For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినూత్న 'యాడ్‌రోబ్': హైదరాబాద్‌తో పాటు చిన్న పట్టణాల్లోని వ్యాపారులకూ ఆన్‌లైన్!

By Srinivas
|

హైదరాబాద్: భాగ్యనగరం కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలు అందిస్తున్న యాడ్‌రోబ్.. స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలును కూడా కల్పిస్తోంది.

ప్రస్తుతం తమ యాడ్‌రోబ్‌లో జంటనగరాల నుంచి వెయ్యి మందికి పైగా స్థానిక వ్యాపారులు నమోదు చేసుకున్నారని వ్యవస్థాపకులు, ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి సోమవారం నాడు చెప్పారు. వీటి ద్వారా మూడవేల ఉత్పత్తులను ఎంచుకునే వీలుందని తెలిపారు.

www.adrobe.in ద్వారా హైదరాబాద్‌లో లాంఛనంగా కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడారు. జంట నగరాలతోపాటు పట్టణాల్లోని చిన్న వ్యాపారులు ఆన్‌లైన్‌లో విక్రయాలు చేయడానికి యాడ్‌రోబ్‌ అవకాశం కల్పిస్తుందన్నారు.

Adrobe unveils online marketplace

త్వరలో బెంగళూరు, చెన్నై, విశాఖ, విజయవాడ, వరంగల్‌, తిరుపతి వంటి నగరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. నిత్యవసర సరుకులు నుంచి ఫ్యాషన్‌ దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల వరకూ 100 విభాగాల్లో మూడువేల రకాల వస్తువులను తమ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయానికి ఉంచామన్నారు.

హైదరాబాద్‌కు చెందిన వెయ్యి మంది విక్రేతలు ఇప్పటికే తమ వస్తువులను విక్రయిస్తున్నారని, త్వరలో ఐదు వేల మందికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్డర్ ఇచ్చిన రోజునే తమ సరుకులను డెలివరీ చేస్తామని చెప్పారు.

కాగా, యాడ్‌రోబ్ ఆండ్రాయిడ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐదువేల మందికి పైగా దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. ఇందుకోసం తొలిసారి నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.

English summary

వినూత్న 'యాడ్‌రోబ్': హైదరాబాద్‌తో పాటు చిన్న పట్టణాల్లోని వ్యాపారులకూ ఆన్‌లైన్! | Adrobe unveils online marketplace

Hyderabad based Adrobe Networks Private Limited, which is touted as India’s first adcommerce Company has announced formal launch of the Adrobe (www.adrobe.in), an innovative online marketplace catering exclusively to mom and pop stores in the city.
Story first published: Tuesday, April 5, 2016, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X