For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్: అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

By Nageswara Rao
|

న్యూయార్క్: 2016 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈసారి కూడా జాబితాలో అగ్రస్థానానాన్ని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ నిలబెట్టుకున్నారు. ఆయన 75 బిలియన్‌ డాలర్ల (రూ.5.10 లక్షల కోట్ల) నికర సంపద కలిగి ఉన్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది.

బిల్ గేట్స్ అగ్రస్థానంలో కొనసాగడం వరుసగా ఇది మూడో ఏడాది. గత 22 ఏళ్లలో 17 సార్లు గేట్స్‌ ఈ జాబితాలో తొలి స్థానంలోనే ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన రిటైల్‌ సంస్థ జెరా వ్యవస్థాపకుడు అమాన్‌షియో ఆర్టెగా రెండో స్థానంలో నిలవగా, బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈఓ వారెన్‌ బఫెట్‌ మూడో స్థానంలో నిలిచారు.

మెక్సికన్‌ కుబేరుడు కార్లోస్‌ స్లిమ్‌ నాలుగు, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ఐదో స్ధానంలో ఉన్నారు. 11.2 బిలియన్ డాలర్ల సంపద పెరగడంతో, గతేడాది 16వ స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈసారి 6వ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇక తాజా జాబితాలో భారత కుబేర దిగ్గజం ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 36వ స్థానం దక్కించుకున్నారు. క్రూడాయిల్‌ క్షీణతతో ఆర్‌ఐఎల్‌ షేరు విలువ తగ్గినా ముకేశ్‌ స్థానంలో నిలవడం విశేషం. ముకేశ్ అంబానీ సంపద విలువ 1,930 కోట్ల డాలర్లు. ఇదిలా ఉంటే తెలుగువారిలో అరబిందో పివి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, దివీస్ ల్యాబ్ మురళికి చోటు దక్కింది.

 అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

250 కోట్ల డాలర్ల సంపదతో రామ్‌ప్రసాద్‌ 688వ స్థానాన్ని, 195 కోట్ల డాలర్ల సంపదతో మురళి 906వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారతీయ కుబేరుల్లో రామ్‌ప్రసాద్‌ 25వ స్థానంలో, మురళి 37వ స్థానంలో నిలిచారు.

 అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

భారత కుబేరుల్లో ముకేశ్‌ తర్వాత సన్‌ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ (44వ ర్యాంకు- 1,670 కోట్ల డాలర్ల సంపద), విప్రో చైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ (55వ ర్యాంకు- 1,500 కోట్ల డాలర్ల సంపద), హెచ్‌సిఎల్‌ శివనాడర్‌ (88వ ర్యాంకు- 1,110 కోట్ల డాలర్ల సంపద) ఉన్నారు.

 అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

వీరితో పాటు లక్ష్మీ మిట్టల్‌ (135), సునీల్‌ మిట్టల్‌ (219), గౌతమ్‌ అదానీ (453), సావిత్రి జిందాల్‌ (453), రాహుల్‌ బజాజ్‌ (722), నారాయణ మూర్తి (959), ఆనంద్‌ మహీంద్రా (1577) తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

 అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు

ఇదిలా ఉంటే రాకేశ్‌ ఝున్‌ఝన్‌వాలా, నందన్‌ నీలేకని, సచిన్‌ బన్సాల్‌, హబిల్‌ ఖొరాకివాలా తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2016 సంవత్సరానికి సంస్థ ప్రకటించిన కుబేరుల జాబితాలో 1,810 మందికి చోటుదక్కింది. గతేడాది ఈ జాబితాలో 1,826 మంది ఉన్నారు. వీరి సగటు నికర సంపద విలువ 6.5 బిలియన్‌ డాలర్లు (రూ.44,200 కోట్లు) అని ఫోర్బ్స్ తెలిపింది.

English summary

ఫోర్బ్స్: అంబానీకి 36, ఇద్దరు తెలుగువారికి చోటు | Forbes 2016 World's Billionaires: Meet The Richest People On The Planet

Volatile stock markets, cratering oil prices and a stronger dollar led to a dynamic reshuffling of wealth around the globe and a drop in ten-figure fortunes for the first time since 2009.
Story first published: Wednesday, March 2, 2016, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X