For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్ (ఫోటోలు)

By Nageswara Rao
|

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్ జోరుగా పెరుగుతోంది. ప్రముఖ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతుండటమే ఇందుకు ప్రధానకారణం. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, హైదరాబాద్‌లో మెరుగైన మౌలికసదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, తక్కువ స్థాయిలో అద్దెలు, ప్రాపర్టీలు అందుబాటులో ఉండటం వల్లనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోందని నైట్‌ఫ్రాంక్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ వాసుదేవన్‌ అయ్యర్‌ తెలిపారు.

గత ఏడాది ద్వితీయార్థంలో రికార్డు స్థాయిలో 3.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను కంపెనీలు అద్దెకు తీసుకున్నాయన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లో బిల్డర్లు, ఆఫీస్‌ స్పేస్‌ అవసరం ఉన్న వారు కొత్త కార్యాలయాల నిర్మాణ ప్రక్రియలో కలిసి పని చేస్తున్నారని ఆయన చెప్పారు.

 హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

గురువారం గత ఏడాది ద్వితీయార్ధంలో (జూలై-డిసెంబర్‌) హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ స్పేస్‌ మార్కెట్‌కు సంబంధించిన వివరాలతో రూపొందించిన నివేదికను విడుదల చేసిన సందర్భంగా వాసుదేవన్‌ విలేకరులతో మాట్లాడారు. గత ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌లో 7000 నుంచి 7500 గృహాల అమ్మకాలు జరిగాయని చెప్పారు.

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

ఇదేకాలంలో అమ్మకం కాని గృహాలు 31,500 వరకు ఉన్నట్టు తెలిపారు. గృహాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతోందని చెప్పారు. ఇదేకాలంలో కొత్త ప్రాజెక్టుల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. ఈ పరిణామం ప్రాపర్టీల ధరల్లో పెరుగుదలకు దారితీస్తోందని పేర్కొన్నారు.
 హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

హౌజింగ్‌ రంగంలో ప్రస్తుతం సప్లయ్‌, ఇన్వెంటరీ ఐదేళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఎక్కువగా జరిగినట్టు ఆయన చెప్పా రు. ఇదే సమయంలో ఉప్పల్‌, ఎల్‌బి నగర్‌, మల్కాజ్‌గిరీలో అభివృద్ధి కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అయితే రానున్న కాలంలో ఇక్కడ నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

గత ఆరు నెలల కాలంలో 24 లక్షల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ పూర్తయిందని, డిమాండ్‌కన్నా ఇది తక్కువగా ఉండటం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్‌ డైరెక్టర్‌ అర్పిత మెహ్రోత్రా తెలిపారు. డిమాండ్ అధికంగా ఉన్నందు వల్ల రాబోయే రోజుల్లో ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు.

English summary

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు పెరిగిన డిమాండ్ (ఫోటోలు) | Office space absorption in Hyderabad at record level: Knight Frank

After a long spell of lower growth the real estate market in the city of Hyderabad is on the roll again, this time led by the commercial property space.
Story first published: Friday, January 29, 2016, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X