For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్‌కు మీ సూచనలు: ప్రజలను కోరిన కేంద్రం

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌పై సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రులను కోరారు. అంతేకాదు బడ్జెట్‌పై ప్రజా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో http://mygov.nic.in పోర్టల్‌ ద్వారా సలహాలు, సూచనలు కేంద్ర ప్రభుత్వానికి పంపేలా ఏర్పాట్లు చేసింది. బడ్జెట్‌ ప్రక్రియలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను రూపొందించే ప్రక్రియను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక వర్గాలు, ఆర్థివేత్తలు, సామాజిక కార్యకర్తలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

In a first, PM Modi asks ministers to fan out for budget inputs

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని బడ్జెట్‌ బృందంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, ముఖ్యఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛెర్మన్‌ అరవింద్‌ పనగరియా తదితరులు ఉన్నారు.

ప్రతి ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలైంది. 2015-16 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న సాధారణ, రైల్వే బడ్జెట్‌లో సామాన్యుల ఆశలు, ఆకాంక్షలకు చోటు లభించిందని ప్రభుత్వం తెలిపింది.

English summary

బడ్జెట్‌కు మీ సూచనలు: ప్రజలను కోరిన కేంద్రం | In a first, PM Modi asks ministers to fan out for budget inputs

Prime Minister Narendra Modi has asked all ministers in his team to tour at least two parliamentary constituencies in a first-of-its-kind effort to gather suggestions from the ground for the annual budget and feedback about the government.
Story first published: Wednesday, December 30, 2015, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X