For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎం రావుకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (ఫోటో)

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. దుబాయ్‌లో జరిగిన ఆరో విడత సమావేశంలో భాగంగా యూఏఈ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ నహ్యాన్ ముబారక్ అల్ నహ్యాన్ చేతుల మీదగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఆసియా దేశాల నుంచి అనేక మంది అగ్రస్థాయి పారిశ్రామికవేత్తలు, ఎకనమిస్టులు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జీఎం రావు ఎంతో దూరదృష్టి కలిగిన పారిశ్రామిక వేత్తని, సామాజిక బాధ్యత, దాతృత్వంలో ఆయన ముందున్నారని ఏబీఎల్‌ఎఫ్ పేర్కొంది.

G. M. Rao receives ABLF lifetime achievement award

అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులకు ఏబీఎల్‌ఎఫ్ ప్రతిఏటా అవార్డులతో సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా జీఎం రావు మాట్లాడుతూ జాతికి సేవల చేసే అవకాశాన్ని తనకు దేవుడు కల్పించారని అన్నారు.

మా నిజాయితీ, అంకిత భావం వల్ల దేశంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయగలిగామని ఆయన ఈ చెప్పారు. ఢిల్లీలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కేటగిరిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్టుగా నిలిచిందన్నారు.

English summary

జీఎం రావుకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (ఫోటో) | G. M. Rao receives ABLF lifetime achievement award

GMR Group chairman G.M. Rao was conferred the prestigious ABLF lifetime achievement award during the sixth edition of the Asian Business Leadership Forum (ABLF) in Dubai, it was announced here on Tuesday.
Story first published: Wednesday, December 2, 2015, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X