For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నాప్‌డీల్: ఆన్‌లైన్‌ ఈకామర్స్ దిగ్గజాల విజయ రహస్యాలు

By Nageswara Rao
|

మీకంటూ ఓ బలమైన కోరిక ఉందా? ఆ కోరికను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ 8 మంది భారతీయలు సాధించిన విజయాలు గురించి తప్పక తెలుసుకోవాలి. అనుకున్నది సాధించారు. అందుకోసం ఎంత కష్టపడ్డారో వారికే తెలుసు.

డిజిటల్ ఇండియాలో వారి భాగస్వామ్యం ఎంత? దానిని అందుకోవడంలో వారు అవలంభించిన మార్గాలేమిటో తెలుసుకుందాం.

8 successful ecommerce sellers share their secrets to success

ఆర్తి గోయల్
ఆర్తి గోయల్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. చాందిని చౌక్ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఈరోజు దేశ వ్యాప్తంగా విస్తరించారు. ఆమె స్వయంశక్తితో ఎదిగిన తీరు ప్రతి ఒక్క గృహిణికి ఆదర్శం. ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయం ఆమె ఎదుగుదలలో ఎంతో కీలకం.

ఫలితం:
ఆర్తి గోయల్ ఆన్‌లైన్ సెల్లర్ మల్టీ ఫ్లాట్ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. అంతే కాదు గృహోపకరణాలైన కుషన్స్, కప్స్, ల్యాప్‌టాప్ కవర్స్ లాంటివి రూపొందిస్తుంటారు. ప్రతి రోజు 800కు తగ్గకుండా అమ్మకాలు నిర్వహిస్తున్నారు.


గౌరవ్ గోయల్
కోల్‌కత్తాకు చెందిన గౌరవ్ గోయల్ ఆన్‌లైన్ మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ డిజిటల్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. స్నాప్‌డీల్ అడ్వైజర్స్ సహాకారంతో ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్స్ రంగంలో తనతో పాటు మరికొంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు.

ఫలితం:
ఆన్‌లైన్ బిజినెస్‌లో గౌరవ్ గోయల్ అతని టీమ్ అద్భుతమైన బిజినెస్‌ చేస్తున్నారు. గడచిన ఏడాది కాలంలో గౌరవ్ గోయల్ బిజినెస్ 100 శాతం అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు.


బాలాజీ
చీరల తయారీదారు కుటుంబం నుంచి వచ్చిన బాలాజీ ఐటీ ప్రొఫెషనల్‌గా మంచి జీతం సంపాదిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో చీరల అమ్మకాలను బిజినెస్‌ను వృద్ధి చేసేందుకు స్నాప్‌డీల్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. వెబ్‌లో చీరలను అందంగా కనిపించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్‌తో ఫోటోలు తీయించి కేటలాగ్స్ మాదిరి పొందుపరిచేవారు.

ఫలితం:
ఆన్‌లైన్‌లో చీరల అమ్మకాలను మరింతగా వృద్ధి చెందేందుకు తన టీమ్‌తో కలిసి పని చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు కొత్త కేటలాగ్స్‌తో కొత్త ట్రెండ్స్‌కు సరిపోయే విధంగా స్నాప్ డీల్ వెబ్ సైట్స్‌లో పొందుపరిస్తుంటాడు.


దర్శన్ రాజ్‌పారా
రాజ్‌కోట్‌కు చెందిన దర్శన్ రాజ్‌పారా ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ముందు కొస్తుంటారు. ఆటోక్యాడ్ డిజైన్ నిపుణుడైన దర్శన్ కొత్త డిజైన్స్‌ను ట్రెండ్స్‌కు తగ్గట్టుగా రూపొందించేవారు. క్వాలిటీ ఉత్పత్తువలపై స్నాప్‌డీల్ సెల్లర్ రేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టింది.

ఫలితం:

స్నాప్‌డీల్ వెబ్‌సైట్‌తో భాగస్వామ్యం అయినప్పటి నుంచి దర్శన్ టర్నోవర్ రెండింతలు పెరిగింది. చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే పొందేవారు. ప్రతి మూడు నెలలకొకసారి 15 ఉత్పత్తులను తీసుకొచ్చేవారు.


ప్రవిధి లకోటియా
ప్రవిధి లకోటియా సెల్లర్స్‌లో ఒకరు కాకపోయినా, స్నాప్‌డీల్ కేపిటల్ అసిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా బిజినెస్‌ను ఎంతగానో తన వ్యాపారాన్ని వృద్ధి చెందించారు. ఈ కామర్స్ పోర్టల్స్‌లో తనదైన ముద్రను వేశారు.

ఫలితం:
2012లో స్నాప్‌డీల్ చేరిన ప్రవిధి లకోటియా ఏడాదికి ఏడాదికి తన వ్యాపారాన్ని వృద్ధి చెందేలా తోడ్పడ్డారు. అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేవారు. ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్ అమ్మకాలను మరింతగా పెరిగేలా ఆమె చేసిన కృషి ఎంతో అమోఘం.


వీఎస్ చంద్రికా కుమార్
కొత్త ఛానెళ్లు, టెక్నాలజీలను అన్వేషించడంలో చంద్రికా కుమార్ ఎప్పుడూ ముందుండేవారు. ఆన్‌లైన్ అమ్మకాలన పల్స్‌ను ఆయన గుర్తించారు. ప్రతి వారానికి కొత్త కొత్త ఉత్పత్తులను జత చేసి బిజినెస్ మరింతగా వృద్ధి చెందేలా సరైన ప్రణాళికలను రూపొందించేవారు.

ఫలితం:
ఆన్‌లైన్ అమ్మకాలను రెట్టింపు చేయడం కోసం 32 మంది సభ్యులతో ఓ సరికొత్త బృందాన్ని ఏర్పరచుకున్నారు. ఆన్‌లైన్ అమ్మకాల్లో విధివిధాలను ఖరారు చేశారు. పోటీదారుల నుంచి పోటీని తట్టుకునేందుకు గాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేవారు.


రామానుజా చారి
సెల్లర్స్‌కు రామానుజా చారి చెప్పే మొట్టమొదటి మాట 'కస్టమరే రాజు'. కస్టమర్లకు అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడం ద్వారా వారి మనసుని గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్నాప్‌డీల్‌లో ఎప్పుడైతే అతని ఎలక్ట్రానిక్ బిజినెస్‌కు ప్రాముఖ్యతను కల్పించారో అప్పటి నుంచి అధిక నాణ్యతను కలిగే ఉత్పత్తులను అందించారు.

ఫలితం:
ఏడాదిలోనే ఆన్‌లైన్ వ్యాపారం రెట్టింపు అయింది.


అన్షు అగర్వాల్
అజ్మీర్‌కు చెందిన అన్షు అగర్వాల్ ఆన్‌లైన్ వ్యాపార రంగంలో తనదైన ముద్రను వేశారు. అన్షు అగర్వాల్ తాను రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్నాప్‌డీల్‌లో తన ఉత్పత్తులను అమ్మకానికి ఉంచినప్పుడు మొదట్లో కొద్ది ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత కాలంలో పుంజుకుంది.

ఫలితం:
2013లో స్నాప్‌డీల్ చేరిన అన్షు అగర్వాల్ వెబ్‌సైట్‌లో 100కు పైగా డిజైన్లను రూపొందించారు. అంతేకాదు తాను రూపొందించిన ఉత్పత్తులకు నిల్వ చేసుకునేందుకు గాను గిడ్డంకులను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

English summary

స్నాప్‌డీల్: ఆన్‌లైన్‌ ఈకామర్స్ దిగ్గజాల విజయ రహస్యాలు | 8 successful ecommerce sellers share their secrets to success

Here are the stories of 8 Indians who believed that they had something unique to sell, something great to achieve, and someone inspiring to become - but never believed it would be this easy. So how did they crack Digital India? What were their secrets to success?
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X