For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రారంభమైన గూగుల్‌ గ్రేట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌

|

Best buys from Google's great online shopping festival
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ ప్రారంభించిన గ్రేట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ (జిఔస్‌ఎఫ్‌) బుధవారం(డిసెంబర్ 10) నుంచి ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ సందర్భంగా గూగుల్‌ నెక్సస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇంకా ఈ ఫెస్టివల్‌ కోసం గూగుల్‌ ఒక క్రోమ్‌కాస్ట్‌ను, లెనోవో, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా హౌజింగ్‌, వాన్‌ హ్యూసెన్‌ కంపెనీలకు చెందిన పలు ఉత్పత్తులను ఆవిష్కరించింది.

క్రోమ్‌కాస్ట్‌ ధర 2,999 రూపాయలు. 2012లో 90 కంపెనీలతో జిఔస్‌ఎఫ్‌ను ప్రారంభించగా, ఈ ఏడాది ఫెస్టివల్‌లో పాల్గొంటున్న కంపెనీల సంఖ్య 450కి పెరిగిందని గూగుల్‌ ఇండియా ఎండి రాజన్‌ ఆనందన్‌ చెప్పారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పట్ల వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోందని, గత కొద్ది వారాల నుంచి 50 లక్షల వినియోగదారులు జిఔస్‌ఎఫ్‌ సైట్‌ను సందర్శించారని వెల్లడించారు.

2016 నాటికి దేశంలో ఆన్‌లైన్‌ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆనందన్‌ తెలిపారు. నెక్సస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యమవుతుందని గూగుల్‌ తెలి పింది. క్రోమ్‌కాస్ట్‌ విక్రయాల కోసం భారతి ఎయిర్‌టెల్‌, స్నాప్‌డీల్‌తో గూగుల్‌ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు వినియోగించుకుంటున్న వారు క్రోమ్‌కాస్ట్‌ కొనుగోలు చేయడం ద్వారా 3 నెలల పాటు 60 జిబి డేటాకు యాక్సెస్‌ కావచ్చని గూగుల్‌ తెలిపింది.

కొత్త వినియోగదారులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని, ఉచితంగా కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు యాక్టివేట్‌ చేస్తామని వెల్లడించింది. టాటా హౌజింగ్‌ కూడా జిఔస్‌ఎఫ్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. 150 కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరులో నిర్మిస్తున్న లగ్జరీ గృహాల సముదాయాన్ని ఆన్‌లైన్‌ ఫెస్టివల్‌లో విక్రయిస్తామని పేర్కొంది.

ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 75 ఇండిపెండెంట్‌ గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న మరో ఏడు ప్రాజెక్టులను కూడా జిఓస్‌ఎఫ్‌లో విక్రయిస్తామని వివరించింది.

English summary

ప్రారంభమైన గూగుల్‌ గ్రేట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ | Best buys from Google's great online shopping festival

Over 450 brands come together for the festival that kickstarts today (till Dec 12). Here's a sneak peek at everything from gadgets to apparel to watches and even airline tickets at slashed rates.
Story first published: Wednesday, December 10, 2014, 13:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X