For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో ఉద్యోగాల సంక్షోభం: ప్రపంచ బ్యాంక్

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్యోగాల సంక్షోభంపై ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. 2030 కల్లా జనాభా మరింతగా విస్తరించనున్నతరుణంలో 600 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఆస్టేలియాలో మంగళవారం జరిగిన జీ20 లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మినిస్టిరియల్ మీటింగ్‌‌లో ఓ అధ్యయన నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ నిగెల్ ట్వోస్ మాట్లాడుతూ "ఉద్యోగాల సంక్షోభంపై చిన్నపాటి అనుమానం వాస్తవం" అని అన్నారు.

A Global Jobs Crisis Is Coming, Says World Bank

"ఉద్యోగాల విషయంలో, ముఖ్యంగా నాణ్యతాపరమైన ఉద్యోగాల్లో కొరత ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. జి-20 దేశాల్లో వేతనం, ఆదాయంలో అసమానత ఉందని తెలిసింది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది" అని ఆయన చెప్పారు.

ఆధునిక జి -20 దేశాల కంటే మెరుగ్గా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలే ఉద్యోగాలను సృష్టించడంలో ముందంజలో ఉన్నాయని నిగెల్ తెలిపారు. దానివల్ల ఆర్థిక వృద్ధి పునరుత్తేజంపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.

English summary

త్వరలో ఉద్యోగాల సంక్షోభం: ప్రపంచ బ్యాంక్ | A Global Jobs Crisis Is Coming, Says World Bank


 We are heading for a global jobs crisis, says the World Bank, warning that 600 million new jobs would have to be created by the year 2030 just to keep up with current levels of population growth.
Story first published: Tuesday, September 9, 2014, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X