For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవి చొరవ: తిరుపతిలో పాకశాస్త్ర వర్సిటీ

|

Indian Culinary Institute to be set up in Tirupati
న్యూఢిల్లీ/చిత్తూరు: భారతీయ పాక శాస్త్రానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పాక శాస్త్ర నైపుణ్యాలను మన దేశ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులకు కూడా అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందు కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చాలా చొరవ చూపారు.

చిరంజీవి చొరవతో ఎన్నో రోజులుగా చెబుతున్న పాకశాస్త్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఈ వర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయిలో వివిధ వంటకాల గురించి శాస్త్రీయ బోధన లభిస్తుంది. కోల్‌కతా, ఢిల్లీతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో వర్సిటీ శాఖలుంటాయి.

ఆతిథ్య రంగంలో దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిన రీత్యా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీ సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని అధికార వర్గాలు చెప్పాయి. ఇంకా వర్సిటీలో మాస్టర్స్ కోర్సులను, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. కాగా చిరంజీవి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారతీయ పాక శాస్త్ర యూనివర్సిటీ ఏర్పాటు కోసం కృషి చేశారు.

12వ పంచవర్ష ప్రణాళికలో పర్యాటకరంగ వర్కింగ్ గ్రూప్ నివేదికలో ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌ (పాకశాస్త్ర యూనివర్సిటీ)ను ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేయాలని చిరంజీవి సూచించారు. కాగా, ఇప్పటికే తిరుపతిలో వర్సిటీ కోసం 14 ఎకరాల భూమిని పర్యాటక శాఖ కేటాయించింది. మరో 20 నెలల్లో తిరుపతిలో ఈ వర్సిటీ పనులు పూర్తి కానున్నాయి. 2016 విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

English summary

చిరంజీవి చొరవ: తిరుపతిలో పాకశాస్త్ర వర్సిటీ | Indian Culinary Institute to be set up in Tirupati


 The Union Cabinet has approved setting up of the Indian Culinary Institute (ICI) at Tirupati in the State. The first of its kind institution in the country will come up with an estimated investment of about Rs. 200 crore.
Story first published: Friday, March 14, 2014, 10:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X