For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలు: ‘వాయో’ను అమ్మే పనిలో సోనీ

|

Sony to exit Vaio PC business
న్యూయార్క్/టోక్యో: వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా పెరిగిపోతున్న నష్టాలను తగ్గించుకునేందుకు పర్సనల్ కంప్యూటర్ (పిసి) వ్యాపారాన్ని విక్రయించాలని, 5 వేల ఉద్యోగాల్లో కోత విధించాలని జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీని ద్వారా 100 కోట్ల డాలర్లను ఆదా చేయాలని సోనీ భావిస్తోంది. ఆశ్యర్యకరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సోనీ 108 కోట్ల డాలర్ల భారీ నష్టాన్ని చవిచూసింది.

ఈ నేపథ్యంలో ‘వాయోయో' బ్రాండ్‌పై కొనసాగిస్తున్న తన పిసి వ్యాపారాన్ని జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ (జెఐపి) సంస్థకు విక్రయించాలని, టెలివిజన్ విభాగాన్ని ప్రత్యేక యూనిట్‌గా విభజించాలని సోనీ నిర్ణయించింది. ఇకపై టివి, మొబైల్స్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించనున్న సోనీ ఇందుకోసం సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఆర్‌అండ్‌డి వ్యయాలను సైతం నియంత్రించాలని భావిస్తోంది. కాగా పిసి వ్యాపార విక్రయానికి సంబంధించి సోనీ, జెఐపిలు గురువారం ఎంఒయుపై సంతకాలు చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న సోనీ, పిసి వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించుకోవడం వెనుక అనేక ఆర్థిక కారణాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్త మోడళ్లను ఆవిష్కరించడంలో వెనుకబాటు, అంతర్జాతీయంగా వినియోగదారులు ఆపిల్, సామ్‌సంగ్ మొబైల్స్‌పై అధికంగా దృష్టి సారించడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద టివి తయారీ సంస్థ సోనీ పిసి అమ్మకాలు కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం సోనీ విడుదల చేసిన ప్లేస్టేషన్4 అమ్మకాలు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయని వారు తెలిపారు. గత నవంబర్‌లో విడుదలైన ఈ ప్లేస్టేషన్4 మొదటి ఆరు వారాల్లోనే 4.2 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో పోటీ దారులైన మైక్రోసాఫ్ట్, నిన్‌టెన్‌డో కార్పొరేషన్లను తోసిరాజనేలా దీని అమ్మకాలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం వ్యాపార బదిలీలో భాగంగా సోనీ పిసి ఉత్పత్తుల ప్లానింగ్, డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తిని నిలిపివేయనుంది.

2014 ప్రథమార్ధం అనంతరం పిసి అమ్మకాలను సైతం పూర్తిగా నిలిపివేయనుంది. అయితే వయో పాత కస్టమర్లకు మాత్రం సేవలను కొనసాగించనుంది. సోనీలో పిసి విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు 250-300 మంది ఉద్యోగులను జెఐపి కంపెనీకి బదలాయించే అవకాశం ఉంది. అంతేగాక సోనీ తన వ్యయ నియంత్రణలో భాగంగా జపాన్‌లో 1500 మందిని, ఇతర దేశాల నుంచి 3500 మందిని వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి తొలగించాలని భావిస్తోంది.

కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ వ్యయాలు 7,000 కోట్ల యెన్‌(జపాన్ కరెన్సీ)లకు చేరతాయని అంచానా వేస్తున్నారు. అంతేకాక వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం మరో 7,000 కోట్ల యెన్‌లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా 2016 మార్చి 31 కల్లా వార్షిక స్థిర వ్యయాలు 10,000కోట్ల యెన్‌లకు చేరతాయని సోనీ అంచనా వేస్తోంది.

English summary

నష్టాలు: ‘వాయో’ను అమ్మే పనిలో సోనీ | Sony to exit Vaio PC business

Sony Corp's plans to quit making personal computers after years of losses focus a spotlight on how it intends to fix a much bigger problem - a flagship TV division that has lost $7.5 billion over the last 10 years.
Story first published: Friday, February 7, 2014, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X