For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిపోర్ట్: 85 మంది చేతిలోనే సగం సంపద

|

రిపోర్ట్: 85 మంది చేతిలోనే సగం సంపద
దావోస్: కొద్ది మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల హస్తాల్లోనే ప్రపంచ సంపద ఉందని ఇటీవల నిర్వహించిన ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచ సంపదలో దాదాపు సగభాగం 85 మంది వ్యక్తుల చేతుల్లోనే ఉందని వరల్డ్ వైడ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆక్స్‌ఫామ్ తన ‘వర్కింగ్ ఫర్ ది ఫ్యూ' నివేదికలో వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో ఉన్నటువంటి ఈ అసమానతల ప్రభావాన్ని నివేదిక చర్చించింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలో వెల్లడైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సంపన్నులుగా ఎదిగేందుకు రాజకీయ శక్తులను తమ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని తన నివేదికలో పేర్కొంది.

వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవడమే కాకుండా పన్నులు కూడా ఎగవేస్తున్నారని తెలిపింది. 1970 సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకున్న నివేదిక, 30 దేశాలకు 29 దేశాల్లోని సంపన్నుల పన్ను రేటు తగ్గుతూ వచ్చినట్లు పేర్కొంది. గత 30 సంవత్సరాల్లో ఆర్థిక అసమానతలు పెరుగుతూ వచ్చాయని తెలిపింది.

సంపన్నులు పన్నులు ఎగవేస్తూ వస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని, 25 ఏళ్ల కాలంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృత మైందని తెలిపింది. ప్రపంచంలోని ఒక్క శాతం కుటుంబాల చేతుల్లోనే 46 శాతం ప్రపంచ సంపద ఉందని వెల్లడించింది. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలని, ఇందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదిక అభిప్రాయపడింది.

English summary

World's 85 richest people own nearly half of global wealth: Oxfam report

A tiny elite comprising the richest 85 individuals hold wealth equivalent to that owned by the bottom half of the world's population, a report says.
Story first published: Tuesday, January 21, 2014, 10:48 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more