For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రేడింగ్ ఖాతా తెరవడం మరింత సులభం

|

Sebi reworks KYC norms to ease a/c opening process
న్యూఢిల్లీ : మూలధన మార్కెట్లలో ట్రేడింగ్ కోసం ఖాతా తెరిచే ప్రక్రియను పెట్టుబడిదారుల కోసం స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) మరింత సులభతరం చేసింది. సెబి నిర్ణయంతో మదపర్లు ఇక సులభంగా డీమ్యాట్, ట్రేడింగ్ వంటి ఖాతాలను ప్రారంభించవచ్చు. నో యువర్ కస్టమర్ (కెవైసి) రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కెఆర్ఏ) వద్ద భద్రపరచడానికి దరఖాస్తుదారుని నుంచి తీసుకునే కొన్ని వివరాలను కెవైసి దరఖాస్తు నుంచి మినహాయించింది.

దాదాపు అన్ని మార్కెట్లకు ఒకే రకమైన కెవైసి నిబంధనలు ఉండేలా సెబి చర్యలు తీసుకుంటోంది. తాజాగా కెవైసి నిబంధనల్లో వార్షికాదాయం, వృత్తి వివరాలను సంబంధించిన కాలమ్స్‌ను ఎత్తివేసింది. కేంద్రీకృత కెవైసి నమోదు సంస్థకు అవసరమైన వివరాలు మాత్రమే కెవైసి దరఖాస్తులో ఉంటే చాలని సెబి పేర్కొంది.

వృత్తి, ఆదాయం, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారు రాజకీయ సంబంధాలు వంటి వివరాలు కేంద్రీకృత కెవైసి నమోదు సంస్థకు అవసరం లేదని వెల్లడించింది. కెవైసి దరఖాస్తును మార్పులు చేయాల్సిందిగా మార్కెట్ ఇంటర్మీడియేటరీలకు సెబి సర్క్యూలర్ పంపింది. ఇందుకు 6 నెలల సమయం ఇచ్చింది. మార్కెట్‌లో భాగస్వామ్య వర్గాలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబి వివరించింది.

అప్పులు తగ్గుతాయి: మాంటెక్

చెన్నై: ఆర్థిక విధానాన్ని సరైన క్రమంలో పెట్టడం ద్వారా రాబోయే ఐదారేళ్లలో రుణ భారాన్ని భారత్ తగ్గించుకోగలదనే అభిప్రాయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వెలిబుచ్చారు. గురువారం తమిళనాడులోని చెన్నైలో మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సౌతర్న్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ రాజా జె చెల్లయ్య లెక్చర్‌ను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆర్థిక విధానంలో కొద్దిగా సర్దుబాట్లు చేసుకుంటే చాలని, సమూలమైన మార్పులు అవసరం లేదని అన్నారు. ‘రాబోయే ఐదు లేదా ఆరేళ్లలో జిడిపి స్థూల రుణ నిష్పత్తి తగ్గనుందని ఆయన తెలిపారు. ద్రవ్యలోటు కూడా తప్పక తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు.

English summary

ట్రేడింగ్ ఖాతా తెరవడం మరింత సులభం | Sebi reworks KYC norms to ease a/c opening process


 Capital market regulator Securities and Exchange Board of India has re-worked know your client (KYC) requirements for both individuals and non-individuals to avoid repeated modifications in the KYC registration agency (KRA) system.
Story first published: Friday, December 27, 2013, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X