For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదేళ్ల కనిష్టానికి భారత కార్పొరేట్ల లాభాలు

|

India Inc profitability at five-year low
ముంబై: రుణస్థాయి పెరుగుదలను కట్టడి చేసేందుకు, తమ వృద్ధి రేటును పెంచుకునేందుకు భారత కంపెనీలు ప్రస్తుతం పోరాటం కొనసాగిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలలో మూలధనంపై వచ్చిన మొత్తాలను (లాభాలను) పరిశీలించినట్లయితే మూలధన పెట్టుబడులు దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇది (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మినహయించి) 2007-08లో పెట్టుబడుల సగటు 29 శాతం ఉండగా 20.5 శాతానికి పడిపోయింది, కాగా ఎఫ్‌వై 13లో 200 బిఎస్ఈ కంపెనీలలో 142 కంపెనీలు ఉన్నాయి.

ఉపాధి పెట్టుబడులపై ఆదాయాన్ని (ఆర్ఓసిఈ) బట్టి కంపెనీలు తమ ఆర్థిక వనరులను ఏ మేరకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. ఒక వేళ ఓ కంపెనీ భారీ మొత్తంలో రుణాలను పొందినట్లయితే ఆ కంపెనీ లాభాల నిష్పత్తిలో పెరుగుల నమోదు చేసుకోలేకపోతోంది. కార్పొరేట్ స్థాయిని నిర్ణయించడంలో ఉపాధి పెట్టుబడులపై ఆదాయం అనేది కీలకమైన అంశమని అమితాబ్ క్యాపిటల్, ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సౌరభ్ ముఖర్జీ అన్నారు. అన్ని కార్పొరేట్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

ఆర్థికాభివృద్ధి కారణంగా భారత కంపెనీలు 2009 వరకు అధిక మొత్తంలో మూలధన ఆదాయాలను పొందినట్లు ఆయన తెలిపారు. అయితే 2008లో సంభవించిన లేమాన్ సంక్షోభం కారణంగా ఆదాయ నిష్పత్తి పెరుగుదలలో క్షీణత ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో మళ్లీ ఆర్థి వృద్ధిలో పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉందని అన్నారు.

అయితే కంపెనీల తమ వ్యాపారాన్ని భారీగా విస్తరించడం, అనవసరంగా ఇతర కంపెనీలలో కలిసిపోవడం, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం లాంటివి కొంత ఆందోళనకరంగా ఉన్నాయని ముఖర్జీ తెలిపారు. కొన్ని కంపెనీలు అనవసర విలీనాలు, కొనుగోళ్లు చేయడం ద్వారా తమ నాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పాలసీలు కొంత మేరకు సహకరిస్తున్నప్పటికీ, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఆందోళనకరంగా ఉంటున్నాయని తెలిపారు.

గత ఐదు సంవత్సరాల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు తమ మూలధన ఆదాయాలను పెంచుకునేందకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. రుణ పరిమితిని తక్కువగా లేదా సున్నా స్థాయిలో కలిగి ఉన్న ఈ కంపెనీలు ఎక్కువ లాభాలను పొందాయి. వాటిలో క్యాస్ట్రల్ ఆర్ఓసిఈ 104.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో టైట్ ఇండస్ట్రీస్ కూడా 59.4శాతం లాభాల పెరుగుదలను నమోదు చేసింది.

ప్రతికూల పరిస్థితుల్లో రుణస్థాయిలను తగ్గించుకోవడం ద్వారా ఈ కంపెనీలు లాభాలను ఆర్జించాయని ఏఎస్‌కె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ షా తెలిపారు. మార్కెట్ విలువలో పెరుగుదల 89శాతం వృద్ధి నమోదు కాగా, భారత కంపెనీలు 30శాతం మాత్రమే మూలధన ఆదాయాలను పెంచుకోగలిగాయాని చెప్పారు. 15 నుంచి 30 సగటు రాబడితో కంపెనీలు తమ లాభాలను 38శాతం మార్కెట్ విలువను కలిగి ఉండే అవకాశం ఉదని తెలిపారు.

English summary

ఐదేళ్ల కనిష్టానికి భారత కార్పొరేట్ల లాభాలు | India Inc profitability at five-year low

Indian companies are struggling to maintain their profitability as rising debt levels and slackening growth begin to take a toll.
Story first published: Monday, December 23, 2013, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X