For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్కారును కాదు, ప్రజలే మారాలి: అమర్త్యసేన్‌

|
సర్కారును కాదు, ప్రజలే మారాలి: అమర్త్యసేన్‌
హైదరాబాద్: వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిందించే ముందు ప్రజలు తమను తాము నిందించుకోవాలని నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. భారత వ్యాపార, పారిశ్రామిక మండలుల సమాఖ్య(ఫిక్కి) ఆంధ్రప్రదేశ్ విభాగం, ఫిక్కి మహిళా విభాగాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, పౌష్టికాహార లోపం వంటి సమస్యల పరిష్కారంలో ప్రజలే క్రియాశీలంగా ఉండాలని అమర్త్యసేన్ పేర్కొన్నారు.

ఎంతో అభివృద్ధి చెందిన ఢిల్లీ నగరంలో ఎటు చూసినా బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద భవంతులు కనిపిస్తాయని, అయితే వాటిలో పనివాళ్ల కోసం మరుగుదొడ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వివిధ సమస్యలు, సవాళ్లపై ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే బదులు వాటిపై ప్రజల్లో చర్చకు అవకాశం కల్పించాలని, ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.

మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడం వంటి పలు ప్రాథమిక సదుపాయాల విషయంలో మన దేశం పొరుగున ఉన్న బంగ్లాదేశ్, వెనబడిన ఎన్నో ఆఫ్రికా దేశాల కన్నా కూడా వెనకబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి ఏపి విభాగం మహిళా అధ్యక్షురాలు సంగీతారెడ్డి, ఫిక్కి మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు.

అమర్త్యసేన్‌కు హెచ్‌సియూ గౌరవ డాక్టరేట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురువారం అమర్త్యసేన్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మన దేశంలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాయాలలు తయారుకాకపోవడానికి నాణ్యతా ప్రమాణాలే కారణమని అన్నారు. అసలు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను తయారు చేయాలని మనం అనుకుంటే కదా అలాంటి విద్యా సంస్థలు రావడానికని అన్నారు. అత్యాధునిక విధానాలను అవలంభించడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను తయారు చేయగలిగాయని అన్నారు.

విద్య, వైద్యం, ఆహారానికి సంబంధించిన ప్రభుత్వాలు చేయాల్సినంత చేయడంలేదని బహుమతి గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. ఈ అంశాలపై మీడియా కూడా శ్రద్ద పెట్టకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వ బాధ్యతలపైనా, ప్రజల హక్కులపైనా తగినంత చర్చ, సంవాదం ఉంటేనే అభివృద్ధికి దోహదం జరుగుతుందని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.

దళిత సమస్యలు, పేదరికం, ప్రజల మౌలిక హక్కుల నిరాకరణ...వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సమర్థించారు. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సబ్సిడీలకంటే సంపన్న వినియోగదారులకు ముట్టజెపుతున్న సబ్సిడీల మొత్తమే ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. విద్యుత్ సబ్సిడీపై జిడిపిలో 2 శాతం భారత్ వెచ్చిస్తోంది. అయినా దేశంలో మూడో వంతు ప్రజానీకానికి విద్యుత్ సౌకర్యమేలేదని చెప్పారు. ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో భారత్ విఫలమవుతోందని పేర్కొన్నారు.

English summary

Stop blaming govt, says Amartya Sen

Nobel laureate Amartya Sen said people should start questioning and discussing issues of importance instead of blaming the government.
Story first published: Friday, December 20, 2013, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X