For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్దిక కష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం: ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి

By Nageswara Rao
|

ముంబై: మరో వారం రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్న దువ్వూరి సుబ్బారావు కేంద్ర ప్రభుత్వంపైనా, ఆర్దిక మంత్రి పి చిదంబరం పైనా ఘాటైన విమర్శనాస్త్రాలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం రూపాయి మారకపు విలువ పెరగడానికి, ఆర్దిక కష్టాలకు ప్రభుత్వం పాటిస్తున్న అసంబధ్ద ఆర్దిక విధానాలేనని అన్నారు. వృద్దిని పణంగా పెట్టి కఠిన పరపతి విధానాన్ని అనుసరిస్తున్నారంటూ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఇటీవల కాలంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటనల వల్ల రూపాయి మారకపు విలువ తగ్గిందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. దేశీయంగా వ్యవస్దాగత అంశాలే అందుకు కారణాలని దువ్వూరి తనదైన శైలిలో చెప్పారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరిస్తామన్న విషయం రూపాయి పతనానికి మరింత ఆజ్యం పోసిందన్నారు. ప్రస్తుత ఆర్దిక సమస్యలకు కారణం దేశీయంగా వ్యవస్థాగత అంశాలే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతే.. వ్యాధి నిర్థారణలోను, చికిత్సలోను మనం ఘోరంగా విఫలమవుతామని దువ్వూరి అన్నారు. వృద్ధిని గురించి ఆలోచించబట్టే కఠిన పరపతి విధానం పాటించాల్సి వచ్చిందని దువ్వూరి చెప్పారు. అధిక వడ్డీ రేట్ల వల్ల వృద్ధి కాస్త మందగించినా.. అది స్వల్పకాలికమేనన్నారు. వృద్ధి మందగించడానికి ఆర్‌బీఐ కఠిన పరపతి విధానం కొంత వరకూ కారణం కావొచ్చని.. అయితే..సరఫరా తరఫు సమస్యలు, గవర్నెన్స్ అంశాలే ఇందుకు ప్రధాన కార ణమన్నారు. 2009-12 మధ్య ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాలే వృద్ధి మందగమనం, అధిక ద్రవ్యోల్బణానికి దారి తీశాయన్న దువ్వూరి పేర్కొన్నారు.

ఆర్దిక కష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం: దువ్వూరి

ఇది ఇలా ఉంటే కరెంట్ ఖాతా లోటు అదుపు చేయలేని స్దాయికి పెరిగిపోడవం కూడా రూపాయి పతనానికి కారణమని దువ్వూరి చెప్పారు. కరెంట్ ఖాతా లోటుని అదుపు చేయగలిగితే మన ఆర్దిక పరిస్దితి చక్కబడుతుందన్నారు. దీనిని అదుపు చేయాలంటే ప్రభుత్వం తరుపు నుండి వ్యవస్దాగతమైన చర్యలతో చెయ్యాల్సిందే తప్ప.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏమీ చేయలేదని అన్నారు. ఇక ఆర్దిక మంత్రి చిదంబరం గురించి మాట్లాడుతూ ఆర్‌బీఐ ఉండటం వల్లే దేశం కాస్త బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు ఏదో ఒకనాడు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా జర్మనీ మాజీ చాన్సలర్ గెరార్డ్ ష్రోడర్‌ని దువ్వూరి ఉదహరించారు. ‘బుండెస్‌బ్యాంక్ (జర్మనీ సెంట్రల్ బ్యాంక్) పనితీరు నాకు విసుగు తెప్పించింది. కానీ దేవుడి దయవల్ల అది ఉండటం మంచిదే అయ్యింది' అని గెరార్డ్ అప్పట్లో వ్యాఖ్యానించారని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. అదే విధంగా ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను కూడా మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయాను.. ఎంతగా విసుగెత్తిపోయానంటే అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది' అని అంటారని ఆశిస్తున్నట్లు సుబ్బారావు వ్యాఖ్యానించారు.

చిదంబరం, దువ్వూరి ఇద్దరికీ మధ్య ఉన్న వైరం తెలిసిందే. వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చిదంబరం అనేకసార్లు చెప్పినప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు గాను ఆయన వ్యాఖ్యలను దువ్వూరి పట్టించుకోలేదు. దీంతో నిస్పృహకు లోనైన చిదంబరం వృద్ధిని మెరుగుపర్చేందుకు అవసరమైతే ఒంటరిగానైనా ప్రభుత్వం పోరాడుతుందంటూ గత అక్టోబర్‌లో నిర్వేదం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

Subbarao blames government for rupee dip, economic woes

While the speed and timing of the rupee's depreciation was due to the markets reacting to US Fed announcements, Subbarao said, "We will go astray, both in the diagnosis and remedy, if we do not acknowledge that the root cause of the problem is domestic structural factors."
Story first published: Friday, August 30, 2013, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X