For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎండీగా గ్రంధి కిరణ్‌కుమార్

By Nageswara Rao
|

Kiran Kumar Grandhi
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అయిన జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గ్రంధి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. కంపెనీ ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కి తెలియజేసింది. ఈ నియామకం జులై 28 నుండి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది.

ఇంతకాలం ఎండీగా ఉన్న బివిఎన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై బీవీఎన్ రావు కంపెనీ బోర్డులో సభ్యునిగా కొనసాగడంతోపాటు ఈపీసీ డివిజన్, సెజ్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌కు చెందిన అర్బన్ ఇన్‌ఫ్రా, హైవే వ్యాపారానికి సంబంధించి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కంపెనీ పేర్కొంది.

పదవీ బాధ్యతల్లో మార్పులకు సంబంధించిన విధానానికి అనుగుణంగా ఉన్నత స్దానాల్లో చేపట్టిన మార్పులు.. అందులో భాగమేనని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. 38 సంవత్సరాలున్న గ్రంధి కిరణ్ కుమార్ జీఎంఆర్ గ్రూప్ వ్వవస్దాపకుడైన గ్రంధి మల్లిఖార్జునరావు కుమారుడు కావడం విశేషం.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎండీగా గ్రంధి కిరణ్‌కుమార్ | GMR Infra appoints Kiran Kumar Grandhi as managing director


 Making a major change at the top level, GMR Infrastructure today said it has appointed Kiran Kumar Grandhi as its managing director, replacing B V N Rao.
Story first published: Tuesday, July 30, 2013, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X