For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎపిక్ టీవీలో 25 శాతం వాటాని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ

By Nageswara Rao
|

Mukesh Ambani
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ వెంచర్ క్యాపిటలిస్ట్‌గా మారారు. వచ్చే నెల నుండి ప్రసారాలు ప్రారంభించనున్న ఎపిక్ టీవి ఛానల్‌లో ఆయన కొంత వాటా కొనుగోలు చేశారు. ఈ ఛానల్ హై డెఫినేషన్ ఛానల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత దేశ చరిత్ర, జానపదాలు, పురాణాల సంబంధిత కంటెంట్‌ను సమకాలీన ఫార్మాట్‌లో ఈ ఎపిక్ టీవీ అందిస్తుంది. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ వాల్డ్ డిస్నీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా నాలుగేళ్లు పనిచేసి గత ఏడాది ఆ సంస్దలో నుండి బయటకు వచ్చిన మహేశ్ సామత్ నేతృత్వంలో ఎపిక్ టెలివిజన్ నెట్ వర్క్ గత అక్టోబరులో ఏర్పాటైంది.

ఎపిక్ టీవిలో ముకేశ్ అంబానీ ఆయన వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎపిక్ టీవిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు 25% వాటా ఉంది. ముకేశ్ అంబానీ తన సొంత సంస్దల్లో ఒకటైన రిలయన్స్ పోర్ట్స్ అండ్ టర్మినల్స్ ద్వారా ఎపిక్ టీవిలో 25 శాతం వాటాను కొనుగోలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఇప్పటికే నెట్ వర్క్ 18 గ్రూపులో వాటా ఉన్న విషయం తెలిసిందే.

రాఘవ్ బహల్ ప్రమోటర్‌గా ఉన్న మీడియా కంపెనీలైన నెట్ వర్క్ 18, టీవి 18 బ్రాడ్ కాస్ట్‌లు రుణ భారంతో సతమతం అవుతుండగా వాటిలో సుమారు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముకేశ్ అంబానీకి చెందిన ఒక సంస్ద ముందుకోచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ఎపిక్ టీవి డీటీహెచ్ ఫ్లాట్ ఫాంను ఉపయోగించుకోని ప్రతి రోజూ దాదాపు 4 నుండి 5 గంటల పాటు తాజా కార్యక్రమాలను ప్రసారం చేయనుంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ఎపిక్ టీవీలో 25 శాతం వాటాని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ | Mukesh Ambani picks up stake in Epic TV | ఎపిక్ టీవీలో 25 శాతం వాటాని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ

Billionaire industrialist Mukesh Ambani has turned a venture capitalist and is backing a new television channel Epic TV due to go on air next month. Epic TV is a niche high-definition channel, which will have content based on the nation's history, folklore and mythology in a contemporary format.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X