For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్దిరేటు మందగించడం ఆందోళన కలిగించే అంశం: దువ్వూరి

By Nageswara Rao
|
వృద్దిరేటు మందగించడం ఆందోళన కలిగించే అంశం
ముంబై: ఆర్దిక వ్యవస్ద వృద్దిరేటు మందగించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మూలధన పెట్టుబడుల్లో తీవ్ర ఒడిదుడుకులు దేశ వృద్ధిని పటిష్ట రీతిన స్థిరంగా ముందుకు సాగనీయకుండా చేస్తున్నాయని ఏడవ ద్రవ్య స్థిరత్వ నివేదికను విడుదల చేస్తూ అన్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి 5.7 శాతం మాత్రమే ఉండగలదని ఆర్‌బీఐ అంచనా వేస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుల వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్దరేటుపై ఆశావహంగా ఉన్నట్లు దువ్వూరి అన్నారు.

గత ఏడాది ఆర్దిక వృద్దిరేటు దశాబ్ద కనిష్ట స్దాయికి తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం వేడి తగ్గినందున వృద్దిరేటును పెంచే చర్యలకు ఆర్‌బీఐ పూనుకుంది. ఐతే ప్రస్తుతం ఉన్న అధిక కరెంటు ఖాతా లోటు కారణంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న నిధుల ప్రవాహాం హఠాత్తుగా నిలిచిపోయినా.. లేక వెనక్కి వెళ్లినా ఆర్దిక వ్యవస్దకు పెను ప్రమాదమని అన్నారు. దీనికి కారణం ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనేనని అన్నారు.

వృద్దిరేటు తగ్గడం, కార్పోరేట్ కార్యకలాపాలు మందగించడం, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల గడచిన ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థలో స్థూల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయన్నారు. వృద్ధి రేటు పదేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి పడిపోయింది. అధిక బంగారం దిగుమతులు, విదేశీ రుణ భారం, కార్పొరేట్ రంగం పనితీరు ఆందోళనకరంగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిస్థితి మెరుగుపడినప్పటికీ... మొత్తం రుణాల్లో ఎన్‌పీఏ 3.4 శాతానికి తగ్గింది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

Slowing growth is 'most worrisome' factor RBI | వృద్దిరేటు మందగించడం ఆందోళన కలిగించే అంశం: దువ్వూరి

Slowdown in growth is the most worrisome factor and volatile capital flows have made the country vulnerable to "stops and reversals", RBI governor D Subbarao said on Thursday.
Story first published: Friday, June 28, 2013, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X