For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీసీపై ఆంధ్రా బ్యాంక్ చెక్ బౌన్స్ కేసు.. సమన్లు జారీ చేసిన కోర్టు

By Nageswara Rao
|

T Venkatarami Reddy
హైదరాబాద్: ఆంధ్రా బ్యాంక్ దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) ఛైర్మన్ టి. వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ వినాయక్ రవిరెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) ఇచ్చిన రూ. 200 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో ఆంధ్రా బ్యాంక్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు ఈనెల 28న స్వయంగా హాజరుకావాలని సమన్లలో స్పష్టం చేసింది. కోర్టు జారీ చేసిన సమన్లలో బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేకపోయినా ఆంధ్రాబ్యాంక్‌కు చెక్కు ఎందుకు ఇచ్చారో హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆంధ్రా బ్యాంక్ నుండి 2011 నవంబర్ 18న డీసీహెచ్‌ఎల్ యాజమాన్యం రూ. 200 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణం వసూలు నిమిత్తం బ్యాంకు ఇప్పటికే రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌కు ఆశ్రయించడంతో.. డీసీహెచ్‌ఎల్ బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులపై ఇతరులకు హక్కు కల్పించరాదని డీఆర్‌టీ ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఆస్తుల్లో తమిళనాడులోని 4.5 ఎకరాలు, కర్ణాటకలోని రాజపుర గ్రామంలోని 15279 చదరపు మీటర్ల స్దలాలు ఉన్నాయి. వీటితో పాటు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప లాంటి ప్రాంతాల్లో డీసీహెచ్ఎల్‌కు ఉన్న ఆస్తుల జాబితాను ట్రైబ్యునల్‌కు బ్యాంకు సమర్పించి అటాచ్ చేయాలని కోరడం జరిగింది.

ఇటీవలే డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ఛైర్మన్ టి. వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ టి. వినాయక్ రవిరెడ్డిలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులతో పాటు డీసీహెచ్ఎల్‌కు చెందిన రెండు ఆస్తులను డెట్ రికవరీ ట్రిబ్యునల్ అటాచ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి కె. సాయి మోహన్ తన ఉత్తర్వులను జారీ చేశారు. యాక్సిస్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరిద్దరి ఆస్తులను అటాచ్ చేశారు. తమకు చెల్లించాల్సిన రుణం మొత్తం రూ. 427 కోట్లు చెల్లించడం లేదంటూ యాక్సిస్ బ్యాంక్ తన పిటిషన్‌లో పేర్కొంది.

దీంతో న్యాయమూర్తి యాక్సిస్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణాన్ని ఎందుకు చెల్లించలేదన్న దానిపై డీసీహెచ్ఎల్ సరైన వివరణ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సరైన వివరణ ఇవ్వలేదని, అలాగే రుణానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించడంలో కూడా డీసీహెచ్‌ఎల్ విఫలమైందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అటాచ్‌మెంట్ కోరుతూ యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై కనీసం కౌంటర్ కూడా డీసీహెచ్‌ఎల్ దాఖలు చేయలేదని, ఈ నేపథ్యంలోనే ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు.

అటాచ్ చేసిన ఆస్తుల్లో వెంకట్‌రామిరెడ్డికి చెందిన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పెంటగాన్ ఎక్స్‌టెన్షన్‌లోని ఫ్లాట్ నెంబర్ 9 (ఇంటి నెంబర్ 8-2-703), ఇదే రోడ్డులోని 1050 గజాల ఇంటి స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని వినాయక్‌రెడ్డికి చెందిన 1570 గజాల ఇంటి స్థలం, డీసీహెచ్‌ఎల్ పేరుతో పటాన్‌చెరువు సమీపంలోని కొల్లూరులో ఉన్న ఏడు ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 1066 గజాల ఇంటి స్థలం ఉన్నాయి. డీసీహెచ్‌ఎల్ ఆస్తులను అటాచ్‌చేస్తూ డీఆర్‌టీ జారీచేసిన ఉత్తర్వులను ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్‌లకు యాక్సిస్ బ్యాంకు అందించనుంది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

డీసీపై ఆంధ్రా బ్యాంక్ చెక్ బౌన్స్ కేసు.. సమన్లు జారీ చేసిన కోర్టు | Court summons Deccan Chronicle Holdings chairman in cheque bounce case | డీసీపై ఆంధ్రా బ్యాంక్ చెక్ బౌన్స్ కేసు.. సమన్లు జారీ చేసిన కోర్టు

According to Andhra Bank counsel A Krishnam Raju, the authorities have set up a fast track court to expeditiously dispose of such cheque bounce cases. The current case against DCHL too will come up before a fast track court on June 28.
Story first published: Wednesday, June 19, 2013, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X