For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబానీ సోదరుల మధ్య కుదిరిన రూ. 12,000 కోట్ల ఒప్పందం

By Nageswara Rao
|

Mukesh and Anil Ambani
ముంబై: భారతదేశంలో అగ్రగామి కార్పోరేట్ సంస్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 39వ వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో రూ.1.5 లక్షల కోట్లకు పైగా నిధులను పెట్టుబడుల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చమురు, గ్యాస్, పెట్రోలియం రిఫైనింగ్-మార్కెటింగ్, పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల్లో రిలయన్స్ ఈ పెట్టుబడులను పెట్టనుంది. ఈ పెట్టుబడుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌తో ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ షేరింగ్‌కు సంబంధించి రిలయన్స్ జియో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం విలువ రూ. 12,000 కోట్లు.

(6 mistakes to avoid while filing tax returns)

ఈ సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ (4జీ) సేవలను ప్రారంభించేందుకు ఆర్‌ఐఎల్ పూర్తిస్థాయిలో ఉందన్నారు. గ్రూప్ టెలికం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు మాత్రమే దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రం లెసైన్స్‌లు ఉన్నాయి. రిలయన్స్ జియోలో 7,000 మంది సిబ్బందిని నియమించనున్నట్లు ముకేశ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మూడింతలకుపైగా పెంచి 10,000 మందికి చేరుస్తామన్నారు. ఇప్పటిదాకా టెలికం వెంచర్‌పై రిలయన్స్ రూ.18,000 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టింది. రానున్న 12 నెలల్లో రిలయన్స్ జియో ప్రణాళికల్లో భారీస్థాయి పురోగతి ఉంటుందని... కంపెనీ అందించే సేవలు, ఇతరత్రా వివరాలను వచ్చే ఏడాది ఏజీఎంలో పూర్తిగా తెలియజేయనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు.

అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో 4జీ సేవల ఆరంభం కోసం రూ.3,000 కోట్లు వెచ్చించనున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించింది. రిలయన్స్ జియో.. 4జీ సర్వీసులను అత్యంత చౌక ధరలకే అందించేందుకు సిద్దమైందని సమాచారం. అటు టెలికం రంగంలోనే కాకుండా రిటైల్ వ్యాపారంలో కూడా రిలయన్స్ భారీ లక్ష్యాలనే నిర్దేశించుకుంది. రాబోయే 3 - 4 సంవత్సరాల్లో రూ.40,000-50,000 కోట్ల స్థాయికి చేర్చడంపై దృష్టి పెట్టినట్లు ముకేశ్ తెలిపారు. ఏటా 50% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2012-13లో రిటైల్ వ్యాపార ఆదాయం రూ.10,000 కోట్లకు చేరిందన్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

అంబానీ సోదరుల మధ్య కుదిరిన రూ. 12,000 కోట్ల ఒప్పందం | Reliance Jio and RCom sign deal worth Rs 12,000 crore for tower sharing | అంబానీ సోదరుల మధ్య కుదిరిన రూ. 12,000 కోట్ల ఒప్పందం

Reliance Industries Ltd's telecommunications unit will lease up to 45,000 mobile towers from Reliance Communications Ltd in a deal valued at more than Rs 120 billion ($2.1 billion) over the lifetime of the contract, the Indian companies said on Friday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X