For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచపు కుబేరుల టాప్ 20 జాబితాలో ముకేశ్, అనిల్ అంబానీలు

By Nageswara Rao
|

Mukesh Ambani and Anil Ambani
లండన్: లండన్‌‌కు చెందిన సండే టైమ్స్ అనే మ్యాగజైన్ రూపొందించిన 2013 ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలు సంయుక్తంగా 20వ స్దానంలో నిలిచారు. అన్నదమ్ములిద్దరూ విడివిడిగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ.. పెట్రో కెమికల్స్ కేటగిరిలో 1700 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 1,39,400 కోట్లు)తో ఉండటంతో ఈ స్దానంలో నిలిచారు. గతయేడాది వీరిద్దరి సంపద 1,900 కోట్ల పౌండ్లు. ఇక హిందూజా గ్రూప్ చైర్మన్ శ్రీచంద్ హిందూజా, కో - ఛైర్మన్ గోపిచంద్ హిందూజా 1,100 కోట్ల పౌండ్ల(సుమారు 90,200 కోట్లు)తో 47వ స్దానంలో నిలిచారు. మొట్టమొదటి స్దానంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన వాల్ మార్ట్ సూపర్ మార్కెట్లను నిర్వహించే అమెరికాలోని వాల్టన్ కుటుంబం 9,000 కోట్ల పౌండ్ల (సుమారు రూ. 7,38,000)తో ఉన్నారు.

(April 22: Gold rates in major metros)

దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంది. ముకేశ్ అంబానీ భద్రతను దేశంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) పర్యవేక్షిస్తుంది. కార్పోరేట్ స్దాయికి చెందిన వ్యక్తికి సీఆర్‌పీఎఫ్ ఈ స్థాయి రక్షణ కల్పించడం దేశంలోనే ఇది మొట్టమొదటిసారి. జడ్ కేటగిరీ భద్రత కింద అంబానీ వెంట పైలట్, ఫాలో ఆన్ వ్యాన్లు ఉంటాయి. అధునాతన ఆయుధాలతో 28 మంది కమాండోల టీమ్ (ఉత్తరప్రదేశ్ బెటాలియన్) అనుక్షణం ముకేష్ అంబానీకి రక్షణ కల్పిస్తారు.

ప్రముఖ ఉగ్రవాద సంస్థ, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) గ్రూప్ నుంచి ముకేశ్ అంబానీకి అపాయం ఉందని, బెదిరింపు లేఖలు వస్తున్నాయని అంబానీ కార్యాలయం ముంబై పోలీసులకు సమాచారమందించింది. అంబానీ నివాసం.. అంటిలియా, పరిసర ప్రాంతాల్లో ముంబై పోలీసులు రక్షణను కట్టుదిట్టం చేశారు.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

ప్రపంచపు కుబేరుల టాప్ 20 జాబితాలో ముకేశ్, అనిల్ అంబానీలు | Mukesh and Anil Ambani 20th richest in world | ప్రపంచపు కుబేరుల టాప్ 20 జాబితాలో ముకేశ్, అనిల్ అంబానీలు

India's leading industrialist brothers, Mukesh and Anil Ambani, have been together listed as 20th richest in the world in the Sunday Times Rich List 2013.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X