For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

స్పెక్యులేటర్ల వల్లే బంగారం పతనమైంది: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

By Nageswara Rao

స్పెక్యులేటర్ల వల్లే బంగారం పతనమైంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమవ్వడానికి కారణం ప్యూచర్స్ మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించే స్పెక్యులేటర్లేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వ్యాఖ్యానించింది. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో ఇండియా, చైనాలతో పాటు అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో బంగారానికి మంచి డిమాండ్ పెరిగిందని పేర్కొంది. ఐతే డిమాండ్ బాగా ఉన్నప్పటికీ.. బంగారం సరఫరా ఆశించిన స్దాయిలో లేదని, దుబాయ్‌లో బంగారు కడ్డీలతో పాటు నాణేల కొరత ఏర్పడిందని తెలిపింది. ఫ్యూచర్స్ మార్కెట్లో లావాదేవీలు చేపట్టే స్పెక్యులేటివ్ ట్రేడర్ల కారణంగానే గత వారం బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవ్వడం జరిగిందని డబ్ల్యూజీసీ సీఈవో ఆరమ్ శిష్‌మణియన్ అభిప్రాయపడ్డారు.

(SBI Gold deposit scheme: 6 reasons to invest)

అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో పలు దేశాల ఇవ్వెస్టర్లు కొనుగోళ్లకు ఇది సరైన సమయంగా భావిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 16న సింగపూర్‌లో కనిష్టంగా 1,322 డాలర్లను తాకిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 1,415 డాలర్లకు చేరిందని వివరించారు. మా అంచనాల ప్రకారం బంగారానికి మంచి డిమాండ్ కనిపిస్తుందని, అందుకే బంగారం సరఫరా విషయంలో కొన్ని సమస్యలున్నాయని చెప్పారు. ఐతే రాబోయే కాలంలో మళ్లీ బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు.

Todays Gold Rate in Bangalore 22 Karat= Rs.2465.00 24 Karat= Rs.2645.00 indiagoldrate.com/gold-rate-in-b…
— india gold rate (@indiagoldrate) April 18, 2013

Todays Gold Rate in Chennai 22 Karat= Rs.2439.00 24 Karat= Rs.2608.00 indiagoldrate.com/gold-rate-in-c…
— india gold rate (@indiagoldrate) April 18, 2013

వన్ఇండియా మనీ తెలుగు

English summary

Speculators in futures markets caused gold price crash: WGC | స్పెక్యులేటర్ల వల్లే బంగారం పతనమైంది: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

The World Gold Council (WGC) said the recent fall in gold prices was driven by speculative traders in the futures markets.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X