For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ వ్యవస్దను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దుతాం: దువ్వూరి

By Nageswara Rao
|
బ్యాంకింగ్ వ్యవస్దను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దుతాం
బెంగుళూరు: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్దను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. బెంగుళూరు బ్యాంకర్స్ క్లబ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దువ్వూరి సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేనటువంటి సురక్షితమైన బ్యాంకింగ్ నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల మూడు ప్రయివేటు బ్యాంకుల్లో మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కోవడంతో దువ్వూరి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంగా పటిష్టంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ మనీ అంశం కేవలం బ్యాంకింగ్ సమస్య కాదని, ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఇదొక పెద్ద సవాల్ అని అన్నారు. సైప్రెస్ బ్యాంకింగ్ సంక్షోభం పట్ల దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు.

రెండు రోజుల క్రితం బ్యాంకర్ల సమావేశంలో పాల్గోన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి మ మాట్లాడుతూ దేశంలోని మూడు ప్రయివేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌లపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవి కావని అన్నారు. మనీ లాండరింగ్‌ను అడ్డుకునే పటిష్టమైన వ్యవస్థ భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లలో మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ‘కోబ్రాపోస్ట్' అనే ఆన్‌లైన్ పోర్టల్ గత వారం ఆరోపిస్తూ సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంకర్ల సమావేశంలో పాల్గోన్న అనంతరం మాట్లాడుతూ ఆ బ్యాంకుల్లో జరిగింది కేవలం కేవైసీ (నో యువర్ కస్టమర్) ఉల్లంఘన వ్యవహారమే తప్ప ఎలాంటి కుంభకోణం జరగలేదని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆర్థిక పరమైన ఎటువంటి లావాదేవీ జరగలేదని చెప్పారు. కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌లో చోటుచేసుకున్న అంశాలన్నీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అంశాలే తప్ప, మనీ లాండరింగ్‌కు సంబంధించినవిగా భావించకూడదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధానికి అనుసరిస్తున్న విధానాలు చాలా సంపూర్ణమైనవి. ఆ విధానాలలో ఎటువంటి దోషాలు లేవని స్పష్టం చేశారు. అవసరమనిపిస్తే మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థను ఆర్‌బిఐ మరింత పటిష్టంగా, కఠినంగా తీర్చిదిద్దుతుంది.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

Banks not attracting best talent, says RBI Governor | బ్యాంకింగ్ వ్యవస్దను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దుతాం

The Indian banking industry is not attracting the best talent as bankers are not able to sell banking as a bright and promising career with long-term benefits, Reserve Bank of India (RBI) governor D Subbarao said here on Friday.
Story first published: Saturday, March 23, 2013, 12:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X