For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేందుకు రూ. 1,000 కోట్లు సిద్దం: వీడియోకాన్

By Nageswara Rao
|

Videocon to enter banking, earmarks Rs 1,000 crore
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త బ్యాంకింగ్ లైసెన్స్‌లకు తుది మార్గదర్శకాలను విడుదల చేసిన నేపధ్యంలో బ్యాంకింగ్ రేసులోకి తాము ప్రవేశిస్తామని వీడియోకాన్ సంస్ద ప్రకటించింది. ఈ సందర్బంలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ మాట్లాడుతూ విదేశీ భాగస్వామితో ఓ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఇందుకు 1,000 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. లిబర్టీ మ్యూచువల్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాం. ఇప్పుడు కొత్త బ్యాంకుల కోసం ఆర్‌బిఐ ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలతో బ్యాంకింగ్ రంగంలోకి వస్తున్నాము. ఇప్పుడు ఆర్‌బీఐ మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో లెసైన్స్‌కు దరఖాస్తు దాఖలు చేస్తున్నామని అన్నారు.

బ్యాంకు కోసం ఎన్ని నిధులను కేటాయిస్తున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం కనీసం 500 కోట్ల రూపాయల మూలధనం ఉండాలని, అయితే తాము రూ. 1,000 కోట్లను సిద్ధం చేశామని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీడియోకాన్ సంస్థకు మంచి ఆదరణ ఉందన్న ఆయన దేశవ్యాప్తంగా సంస్థకు 500 కార్యాలయాలున్నాయన్నారు. బ్యాంకింగ్ రంగంలోకి రావ డం వలన సంస్థ పరపతి మరింత పెరగగలదనే విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వెలిబుచ్చారు. లెసైన్స్ విషయంలో ఆర్‌బీఐ నిబంధనలన్నింటికీ తమ గ్రూప్‌నకు అర్హత ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్, ఆదిత్య బిర్లా, మహీంద్రా గ్రూప్ తదితర దిగ్గజాలు లెసైన్స్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

వన్ఇండియా మనీ

English summary

బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేందుకు రూ. 1,000 కోట్లు సిద్దం: వీడియోకాన్ | Videocon to enter banking, earmarks Rs 1,000 crore | బ్యాంకింగ్ రంగంలోకి వచ్చేందుకు రూ. 1,000 కోట్లు


 With RBI issuing guidelines for new bank licences, diversified group Videocon Industries today said it will enter the banking sector with a foreign partner and has earmarked Rs 1,000 crore for the purpose.
Story first published: Monday, March 4, 2013, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X