For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంట్రాక్టును రద్దు చేసినందుకు నష్ట పరిహారం రూ. 4,100 కోట్లు: జీఎంఆర్

By Nageswara Rao
|

GMR
మాలె: మాలె ఎయిర్‌పోర్ట్ ఆధునీకరణ కోసం మాల్దీవుల ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును రద్దు చేసిన నేపథ్యంలో తమకు 80 కోట్ల డాలర్లు (సుమారుగా రూ. 4,100 కోట్ల) పరిహారం చెల్లించాలని జీఎంఆర్ తెలిపింది. ఐతే జీఎంఆర్ లెక్కలు తప్పని, అంత చెల్లించాల్సిన అవసరం లేదని.. జీఎంఆర్ ఖర్చు చేసిన వ్యయం, కాంట్రాక్టుకు సంబంధించిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను జరిపిస్తామని చెప్తుంది. ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు రద్దు చేసినందుకు తమకు 80 కోట్ల డాలర్లకుపైగా పరిహారం చెల్లించాలని సూచిస్తూ మాల్దీవుల ప్రభుత్వానికి ఒక లేఖ రాశామని జిఎంఆర్ (ఎయిర్ పోర్ట్స్) సిఎఫ్‌ఓ సిద్ధార్థ్ కపూర్ వెల్లడించారు. ఇది మా ప్రాథమిక అంచనా, లాభనష్టాలు.. ఇతర లెక్కలు పూర్తయిన తర్వాత అసలు మొత్తం ఎంతో తెలుస్తుందని ఆయన చెప్పారు.

ఐతే ఈ లెక్కలు తప్పంటూ చెబుతున్న మాల్దీవుల సర్కార్.. దీనిపై తాము ఫోరెన్సిక్ ఆడిట్‌కు వెళతామని, అప్పుడే మాలే ఎయిర్‌పోర్టు పేరిట జిఎంఆర్ ఏమేరకు నిధులు సమకూర్చుకుందీ, దీనిపై వాస్తవంగా ఎంత సొమ్ము ఖర్చుచేశారన్న విషయం తేటతెల్లమవుతుందని అన్నారు. కంపెనీ వ్యయాలపై మేం అంతర్జాతీయ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేపట్టనున్నాం. అసలు మాలె అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ద్వారా జీఎంఆర్ ఖజానాకు ఎంత మొత్తం వెళ్లిందనే సమాచారం తెలియాల్సి ఉంది. మాకున్న సమాచారం మేరకు జీఎంఆర్ ఈ మాలె ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, నిర్వహణ కాంట్రాక్టును చూపించి ఒక బ్యాంకు నుంచి 35 కోట్ల డాలర్ల మేర రుణాన్ని తీసుకుంది. ఇందులోభాగంగా 15 కోట్ల డాలర్లనే వెచ్చించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ ప్రెస్ కార్యదర్శి మసూద్ ఇమాద్ పేర్కొన్నారు.

ఐతే ఫోరెన్సిక్ ఆడిట్‌కు మీరు సిద్ధమేనా అని జీఎంఆర్ కపూర్‌ను ప్రశ్నించగా, మాలెక్కలు పారదర్శకంగా వున్నాయి. అలాగే మాల్దీవుల ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫోరెన్సిక్ ఆడిట్ క్లాజు లేదని అన్నారు. అయినప్పటికీ ఆడిట్ పట్ల తమకు అభ్యంతరం లేదని, కానీ ఇది సరైన న్యాయప్రక్రియ ద్వారా జరగాలని తెలిపారు. కాగా, తమ లెక్కల ప్రకారం జిఎంఆర్ పరిహారం 150 మిలియన్ డాలర్లకు తగ్గకుండా, గరిష్టంగా 350 మిలియన్ డాలర్లు మించని విధంగా వుంటుందని మాల్దీవుల సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. 2010లో గత మాల్దీవుల ప్రభుత్వ హయాంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా కుదుర్చుకున్న మాలె కాంట్రాక్టు(విలువ దాదాపు రూ.2,600 కోట్లు)ను కొత్త ప్రభుత్వం గత నెల 27న రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

English summary

కాంట్రాక్టును రద్దు చేసినందుకు నష్ట పరిహారం రూ. 4,100 కోట్లు: జీఎంఆర్ | GMR seeks $ 800 million compensation from Maldives govt | రద్దు చేసినందుకు నష్ట పరిహారం రూ. 4,100 కోట్లు

Indian infrastructure firm GMR will seek a compensation of over $800 million from Maldives for the termination of its airport deal here but Male is insisting on a “forensic audit” as it feels the actual amount would be less than half.
Story first published: Monday, December 17, 2012, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X