For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాలె ఎయిర్ పోర్ట్ బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్

By Nageswara Rao
|

మాలె: దేశీయ ఇన్‌ఫ్రా దిగ్గజం జీఎంఆర్ సంస్ద నిర్వహణలో ఉన్న మాలె ఎయిర్ పోర్ట్ బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగపూర్ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాలెలోని ఇబ్రహిం నసీర్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ సంస్ద మాల్దీవుల ఎయిర్ పోర్ట్ కంపెనీకి అప్పగించింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక 11.45 గంటలకు అప్పగింత కార్యక్రమం జరిగినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ వహీద్ మీడియా కార్యదర్శి మసూద్ ఇమాద్ తెలిపారు.

MACL takes over airport operations from GMR

ఈ సందర్బంలో మసూద్ ఇమాద్ మాట్లాడుతూ మూడు వారాలపాటు సాగే యాజమాన్య బదలాయింపు ప్రక్రియకు సంబంధించి జీఎంఆర్, మాల్దీవ్స్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ (ఎంఏసీఎల్) కలిసి పనిచేస్తాయని ఆయన వివరించారు. రెండు సంవత్సరాలుగా ఎయిర్‌పోర్టును బాధ్యతలను నిర్వహిస్తున్న జీఎంఆర్, యాజమాన్యం బదలాయింపు విషయంలో ఎంఏసీఎల్‌కి సహకరించేందుకు, సందేహాలేమైనా ఉంటే తీర్చేందుకు అంగీకరించిందని అన్నారు.

ఇది ఇలా ఉంటే శుక్రవారం అర్దరాత్రి నుండి మాలె ఎయిర్ పోర్ట్‌ను ఎంఏసీఎల్ టేకోవర్ చేసిందని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టేకోవర్ కారణంగా తమ ఉద్యోగులు, సరఫరాదారులు, ఇతర సంబంధిత వర్గాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని మాల్దీవుల ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపింది. మాల్దీవుల ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారాన్ని రాబట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జీఎంఆర్ పేర్కొంది.

మాలె విమానాశ్రయ కాంట్రాక్టు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయంటూ మాల్దీవుల ప్రభుత్వం నవంబర్ 27న జీఎంఆర్ కాంట్రాక్టును చేయడంతో పాటు డిసెంబర్ 7 లోగా (శుక్రవారం) ఎయిర్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది. ఈ ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన సింగపూర్ సుప్రీం కోర్టు సైతం మాల్దీవుల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో మాలె ఎయిర్‌పోర్టును జీఎంఆర్ సంస్ద మాల్దీవుల ప్రభుత్వానికి అప్పగించింది.

మాలె ఇబ్రహీం నసీర్ విమానాశ్రయ (ఐఎన్‌ఐఏ) నిర్వహణ, అభివృద్ధి ప్రాజెక్టు కోసం మాల్దీవుల ప్రభుత్వం తరఫున ప్రపంచ బ్యాంకు విభాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 2009లో బిడ్డింగ్ నిర్వహించింది. జీఎంఆర్, మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ కలిసి ఏర్పాటు చేసిన జీఎంఐఏఎల్ సంస్థ 2010లో ఈ 511 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.

మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్‌పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్‌ ప్రభుత్వం జీఎంఆర్‌లో జూన్‌ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్‌చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

గత ప్రభుత్వం హయాంలో కొందరు సీనియర్ అధికారులు, కంపెనీలోని కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ అవకతవకలకు పాల్పడ్డారని ఎంఏసీఎల్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మాల్దీవుల అవినీతి నిరోధక శాఖ కమీషన్ కూడా విచారణ జరుపుతుంది.
ఇటీవలే మాల్దీవుల ప్రభుత్వం సమావేశమై మాలే విమానాశ్రయం కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు మాల్దీవ్‌ అధ్యక్షుడు ప్రెస్‌ కార్యదర్శి మసూద్‌ ఇమావ్‌ ఒక ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నహీద్‌ అధికారంలో ఉన్నప్పుడు జీఎంఆర్‌ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు వల్ల భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన ముప్పుఏమీ లేదని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ గత ప్రభుత్వ హయాంలో కుదర్చుకున్న ఒప్పందం కావడం కాగా.. ఈ డీల్ మా ప్రభుత్వానికి సందేహాస్పదంగా ఉండటం వల్ల దీనిని రద్దు చేయడం జరిగిందని, మిగతా కంపెనీల కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి జీఎంఆర్ కాంట్రాక్టును నవంబర్ 27న మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది.

తెలుగు వన్ఇండియా

English summary

మాలె ఎయిర్ పోర్ట్ బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్ | MACL takes over airport operations from GMR | మాల్దీవుల ప్రభుత్వానికి మాలె విమానాశ్రయం అప్పగించిన జీఎంఆర్

Maldives' state-run MACL on Friday took over the operations of the Male international airport from GMR after the Indian infrastructure major lost a week-long legal battle over the "unilateral" termination of its $511 million airport modernization contract.
Story first published: Saturday, December 8, 2012, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X