For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజే మాలె ఎయిర్ పోర్ట్ మాల్దీవుల ప్రభుత్వ పరం

By Nageswara Rao
|

GMR to vacate Male airport tonight, stock down 2%
మాలె/సింగపూర్: మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దు వివాదంలో ఇన్‌ఫ్రా దిగ్గజం జిఎంఆర్‌కి మరో దెబ్బ తగిలింది. ఈ విషయంలో గతంలో స్టే ఇచ్చిన సింగపూర్ సుప్రీం కోర్టు తాజాగా మాలె విమానాశ్రయాన్ని మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని గురువారం తీర్పుచెప్పింది. మాలె విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునే హక్కు మాల్దీవుల సర్కారుకు ఉందని సింగపూర్ సుప్రీం కోర్టు చెప్పిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ ఇమాద్ మాలెలో విలేఖరులకు తెలిపారు.

దీంతో ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఎయిర్‌పోర్టు యాజమాన్య బదలాయింపు యథావిధిగా జరుగుతుందని ఆయన చెప్పారు. దీనిపై జీఎంఆర్ సీఈవో సహా ఇతర అధికారులతో తమ దేశ రవాణా మంత్రి (తాత్కాలిక), మరో ఇద్దరు మంత్రులు చర్చించారని ఇమాద్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నేడే (శుక్రవారం) బదలాయింపు ప్రక్రియ జరిపేందుకు జీఎంఆర్ వర్గాలు అంగీకరించాయని వివరించారు. ఇందుకోసం జీఎంఆర్, మాల్దీవ్స్ ఎయిర్‌పోర్టు కంపెనీ (ఎంఏసీఎల్) ప్రతినిధులతో నేడు యాజమాన్య బ దలాయింపు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇమాద్ పేర్కొన్నారు.

మహమ్మద్ నషీద్ హయాం లో జిఎంఆర్‌కు కేటాయించిన 500 మిలియన్ డాలర్ల విలువైన మాలె ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం అనూహ్యంగా గత నవంబర్ 27న రద్దుచేసింది. కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాల్‌చేస్తూ జిఎంఆర్ సింగపూర్ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు జిఎంఆర్‌కు అనుకూలంగా స్టే జారీచేసింది. కానీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ శనివారం ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకోనుంది. ఇప్పుడు సింగపూర్ కోర్టు తీర్పు దరిమిలా తాము చట్టవ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని, సింగపూర్ కోర్టు కూడా తమకు అనుమతి ఇచ్చిందని ఇమాద్ చెప్పారు. కాంట్రాక్టు రద్దు నేపథ్యంలో జీఎంఆర్‌కి ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఇమాద్ తెలిపారు.

సింగపూర్ న్యాయస్థానం తీర్పును తమ శాఖతో పాటు మాల్దీవులలోని భారత హైకమిషన్ కూడా అధ్యయనం చేస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఇందులో రెండు అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. దేశ సార్వభౌమాధికారాలు మొదటిది కాగా, ఒప్పందం చట్టబద్ధత.. కంపెనీకి ఇవ్వాల్సిన పరిహారం రెండోదని ఆయన వివరించారు. తీర్పులో పరిహార విషయం గురించిన ప్రస్తావనే లేదని అక్బరుద్దీన్ చెప్పారు. ఈ కేసు విషయంలో మాల్దీవుల ప్రభుత్వం చట్టపరమైన అన్ని అంశాలను గౌరవిస్తుందని, కాంట్రాక్టు నిబంధనలన్నీ పాటిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం హయాంలో కొందరు సీనియర్ అధికారులు, కంపెనీలోని కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ అవకతవకలకు పాల్పడ్డారని ఎంఏసీఎల్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మాల్దీవుల అవినీతి నిరోధక శాఖ కమీషన్ కూడా విచారణ జరుపుతుంది.
ఇటీవలే మాల్దీవుల ప్రభుత్వం సమావేశమై మాలే విమానాశ్రయం కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు మాల్దీవ్‌ అధ్యక్షుడు ప్రెస్‌ కార్యదర్శి మసూద్‌ ఇమావ్‌ ఒక ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నహీద్‌ అధికారంలో ఉన్నప్పుడు జీఎంఆర్‌ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు వల్ల భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన ముప్పుఏమీ లేదని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ గత ప్రభుత్వ హయాంలో కుదర్చుకున్న ఒప్పందం కావడం కాగా.. ఈ డీల్ మా ప్రభుత్వానికి సందేహాస్పదంగా ఉండటం వల్ల దీనిని రద్దు చేయడం జరిగిందని, మిగతా కంపెనీల కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి జీఎంఆర్ కాంట్రాక్టును ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్‌పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్‌ ప్రభుత్వం జీఎంఆర్‌లో జూన్‌ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్‌చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వంతో జీఎంఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని మాలే ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాము ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లేవీ విధించరాదని తమకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రభుత్వం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తెలుగు వన్ఇండియా

English summary

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజే మాలె ఎయిర్ పోర్ట్ మాల్దీవుల ప్రభుత్వ పరం | GMR to vacate Male airport tonight, stock down 2% | ఈరోజు మాలె ఎయిర్ పోర్ట్‌ మాల్దీవుల ప్రభుత్వ పరం


 Shares of GMR Infra have slipped 2% to Rs 19.40 after the Singapore High Court directed it to vacate Male Airport which it was running since over a year. Analysts believe, the development will impact stock valuations in the interim as the company’s domestic power, roads and airports businesses is already under pressure.
Story first published: Friday, December 7, 2012, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X