For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

By Nageswara Rao
|

విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్
ముంబై: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేట్లను 2 శాతం వరకూ తగ్గించింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోవడం లక్ష్యంగా రిటైల్ రుణ గ్రహీతలను ఆకర్షించడానికి పలు బ్యాంకులు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తాజా నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ 29 నుండి కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయని యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కోంది.

రూ. 30 లక్షలకు మించిన గృహ రుణాలపై వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. ఇక విద్యా రుణ రేట్లను 1.5 శాతం నుండి 2 శాతం వరకు తగ్గించాయి. రూ. 7.5 లక్షల వరకూ తీసుకున్న విద్యా రుణాలపై 12.75 శాతంగా ఉండనుంది. ఆపై వాటికి 12.50 శాతంగా నిర్ణయించింది. గృహ రుణాలకు సంబంధించి రూ.75 లక్షల వరకూ రుణంపై రేటు బేస్‌రేటుకు సమానంగా 10.50 శాతంగా ఉంటుంది. ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల కంపెనీల వైపు నుంచి రుణాలను డిమాండ్ తగ్గడంతో పలు బ్యాంకులు రిటైల్ విభాగంవైపు దృష్టి సారిస్తున్నాయి.

తెలుగు వన్ఇండియా

English summary

Union Bank cuts home, education loan rates | విద్యా, గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్

Mumbai-based public sector lender Union Bank of India has reduced interest rates on home loans above Rs 30 lakh by 25 basis points and is now offering the home loans up to Rs 75 lakh at the base rate. However, the bank has kept its base rate unchanged at 10.5%.
Story first published: Saturday, December 1, 2012, 10:02 [IST]
Company Search