For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే సాంప్రదాయంతోనే మార్పు: వి. బాలకృష్ణన్

By Nageswara Rao
|

నవంబర్ 1 నుండి ఇన్సోసిస్ సీఎఫ్ఓగా రాజీవ్ భన్సల్
బెంగుళూరు: నిన్న విడుదల చేసిన ఇన్సోసిస్ ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహానికి గురి చేసినప్పటికీ.. అందరిని ఆశ్యర్యపరుస్తూ కంపెనీ సీఎప్‌ఓ వి. బాలకృష్ణన్‌ ఆ పదవి నుండి వైదొలగనున్నారంటూ కంపెనీ చేసిన ప్రకటన ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. 6 సంవత్సరాల నుండి ఇన్సోసిస్‌లో సీఎప్‌ఓగా పని చేస్తున్న వి. బాలకృష్ణన్ అక్టోబర్ 31న వైదొలగుతారు. ఆ తర్వాత ఈయన స్దానంలో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీవ్ బన్సల్‌ను భవిష్యత్ సీఎప్‌ఓగా ప్రకటించారు.

ఐతే వి. బాలకృష్ణన్ మాత్రం కంపెనీ బోర్డులో సభ్యునిగా కొనసాగుతారు. సబ్సిడరీ ఇన్సోసిస్ బీపీఓ, ఫినకిల్, ఇండియా బిజినెస్ యూనిట్లకు హెడ్‌గా వ్యవహరించనున్నారని ఇన్సోసిస్ పేర్కోంది. ప్రస్తుతం కంపెనీ సీఈఓ, ఎండీగా ఉన్న ఎస్ డి శిబులాల్ స్దానాన్ని భవిష్యత్తులో చేపట్టే సామర్ద్యం ఉన్న వ్యక్తిగా ప్రచారంలో ఉన్న బాలకృష్ణన్‌ను ఆకస్మాత్తుగా కీలక బాధ్యతల నుండి తప్పించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణన్ ఒక్కరే రేసులో ఉన్నారనుకుంటే పొరపాటే. బోర్డు సభ్యుడు, ఇన్సోసిస్ ఐరోపా వ్యాపారం, ఆర్దిక సేవల, బీమా విభాగ గ్లోబల్ హెడ్ అయిన బి.జి. శ్రీనివాసన్ కూడా ఉన్నారు.

మీరు సీఎఫ్‌ఓగా వైదొలుగుతానంటూ మార్కెట్‌కు షాక్ ఇచ్చారెందుకన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఇది షాక్ కాదు. యువతకు ప్రాధన్యమివ్వాలనే సంప్రాదాయాన్ని పాటించాం. రాజీవ్ బన్సల్ యువకుడే కాక మంచి వ్యక్తి. అందుకే అతనికి అవకాశం ఇచ్చాం. అయినా నేను బీపీఓ, ఫినాకిల్, ఇండియా బిజినెస్ విభాగాలను చూసుకుంటానని బాలకృష్ణన్ వివరించారు.

ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల వేతనాలను 6 శాతం మేర పెంచుతున్నట్లు ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఆఫ్‌షోర్ సిబ్బందికి సగటున 6 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెరుగుదల ఉంటుందని ఇన్ఫీ సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ చెప్పారు. అక్టోబర్ 1 నుంచి ఆఫ్‌షోర్ ఉద్యోగులకు, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆన్‌సైట్ సిబ్బందికి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇదిలాఉండగా, క్యూ2లో కంపెనీలో స్థూలంగా 10,420 మంది కొత్త ఉద్యోగులు చేరారు.

ఇతర కంపెనీలకు వలసవెళ్లిన వారిని తీసేస్తే నికరంగా 2,610 మంది జతయ్యారు. దీంతో సెప్టెంబర్ 30 నాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,53,761 మందికి చేరింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 35 వేల మందిని ఇన్ఫోసిస్‌లో, 13 వేల మందిని సబ్సిడరీ సంస్థ ‘ఇన్ఫోసిస్ బీపీఓ'లో చేర్చుకోగలమని అంచనా వేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

తెలుగు వన్ఇండియా

English summary

It’s all about giving space for youngsters, says Infosys’ outgoing CFO | నవంబర్ 1 నుండి ఇన్సోసిస్ సీఎఫ్ఓగా రాజీవ్ భన్సల్

The last 18 months has seen Infosys making major changes in the top management. The latest one is its CFO V. Balakrishnan who will now head the India and BPO businesses of the company. In an interview with Business Line, Bala talks about what lies ahead for the company.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more