GST Important rule: రూ.20 కోట్ల టర్నోవర్ దాటితే ఈ-ఇన్వాయిస్
రూ.20 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారాలు కలిగి ఉన్న వారికి ఏప్రిల్ 1, 2022 నుండి ఒక ముఖ్య విషయం. ఈ రూల్ ప్రకారం రూ.20 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఏప్రిల్ 1, 2022 నుండి B2B ట్రాన్సాక్షన్స్ కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ను రూపొందించాలి. బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రూ.20 కోట్ల టర్నోవర్ దాటితే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ జనరేట్ చేయాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం ప్రకారం బిజినెస్ టు బిజినెస్ (B2B) ట్రాన్సాక్షన్స్ రూ.500 కోట్లకు చేరితే సదరు సంస్థలు ఇన్వాయిస్లు జారీ చేయడం తప్పనిసరి అని 2020 అక్టోబర్ ఒకటవ తేదీన కేంద్రం ప్రకటించింది. దీనిని గత ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి రూ.100 కోట్లకు కుదించింది. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి రూ.50 వేల కోట్ల టర్నోవర్ దాటిన సంస్థల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ-వాయిస్ జనరేట్ చేస్తోంది.

ఇప్పుడు దీనిని రూ.20వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు వర్తింప చేస్తోంది. దేశంలోని చాలా కంపెనీలపై ఈ కొత్త జీఎస్టీ రూల్ ప్రభావం చూపుతుంది. తాజా నిర్ణయంతో ఈ-ఇన్వాయిస్లు సమర్పించే సంస్థల సంఖ్య పెరుగుతుంది. ఈ-ఇన్వాయిస్ సమర్పించకుంటే సదరు సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందలేవు. అంతేకాదు, పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది.