For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ-కామర్స్ చేయూత, మన కంపెనీల రికార్డ్ బిజినెస్.. ఎంతంటే? అమెజాన్‌కు గడ్కరీ విజ్ఞప్తి

|

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్(GSP)లో భాగస్వాములుగా ఉన్న దేశీయ ఎంఎస్ఎంఈలు,బ్రాండ్స్ మొత్తం ఎగుమతులు 200 కోట్ల డాలర్లు (రూ.15,000 కోట్లు) దాటాయి. ఈ మేరకు అమెజాన్ ఇండియా సోమవారం ఈ విషయం వెల్లడించింది. ముంబైకి చెందిన టెక్స్‌టైల్ కంపెనీ కావొచ్చు, బెంగళూరుకు చెందిన ఎలక్ట్రానిక్స్ టాయ్ మ్యానుఫ్యాక్చరర్స్ కావొచ్చు.. ఇలా భారత్ మాత్రమే కాకుండా అమెరికా నుండి యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూకే సహా వివిధ దేశాలకు GSP ద్వారా మన ఎంఎస్ఎంఈలు విస్తరించాయి. 2015లో GSP లాంచ్ అయింది. ఇప్పుడు ఏకంగా 2 బిలియన్ డాలర్ల సేల్స్‌కు పెరిగింది.

10 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం

10 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు చెందిన 15 వెబ్‌సైట్స్ ద్వారా విదేశాలకు ఎగుమతులు జరిపేలా ఇండియన్ కంపెనీలకు వీలుకల్పించేందుకు 2015లో అమెజాన్ GSPని ప్రారంభించింది. మొదట కేవలం కొన్ని వందలమంది వ్యాపారులతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు 60 వేలమందికి పైగా ఎక్స్‌పోర్టర్స్ భాగస్వాములుగా ఉన్నారు. GSP ద్వారా 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి ప్రారంభంలో ప్రకటించింది.

18 నెలల్లోనే..

18 నెలల్లోనే..

భారత ఆర్థిక వ్యవస్థకు MSMEలు వెన్నెముక అని, డిజిటలైజ్ చేయడం ద్వారా ఈ కంపెనీల ఎగుమతులకు ఊతమివ్వడంతో పాటు భారీస్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తమ కంపెనీ కృషి చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా అధినేత అమిత్ అగర్వాల్ వెల్లడించారు. GSP ద్వారా తొలి మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల విలువైన ఎంఎస్ఎంఈ ఎగుమతులు జరిగాయని, ఆ తర్వాత కేవలం 1 బిలియన్ డాలర్లు చేరుకోవడానికి (మొత్తం 2 బిలియన్ డాలర్లు) 18 నెలల్లో సమయం మాత్రమే పట్టిందన్నారు.

ఈ నగరాల నుండి భారీ ఎగుమతులు

ఈ నగరాల నుండి భారీ ఎగుమతులు

గత ఏడాది ఢిల్లీ, జైపూర్, ముంబై, సూరత్, బెంగళూరు, ఇండోర్ తదితర నగరాల నుండి ఎక్కువగా ఎగుమతులు జరిగాయి. చాలా ఎంఎస్ఎంఈలు GSP ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేల్స్ నిర్వహిస్తున్నాయి. 2006లో ముంబైలో ప్రారంభమైన ఎన్ఎంకే టెక్స్‌టైల్స్ ఇప్పుడు అమెరికా, కెనడాలలోని పెద్ద స్టోర్స్‌కు ఎగుమతి చేస్తోంది. 2016లో ఈ కంపెనీ ఆఫ్ లైన్ బిజినెస్ కాస్త మందగించింది. 2017 నుండి GSP ద్వారా మంచి వృద్ధిని నమోదు చేసింది.

అమెజాన్‌కు గడ్కరీ విజ్ఞప్తి

అమెజాన్‌కు గడ్కరీ విజ్ఞప్తి

భారతీయ మైక్రో సెగ్మెంట్‌కు మరింత ఊతమివ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అమెజాన్ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం అమెజాన్ ఎక్స్‌పోర్ట్ డైజెస్ట్ 2020ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎంఎస్ఎంఈ రంగం వేగంగా కోలుకునేందుకు ఎగుమతులకు ఊతమివ్వడం అత్యంత కీలకమని చెప్పారు. దేశ జీడీపీలో 28 శాతం ఈ పరిశ్రమల ద్వారానే వస్తోందని, అలాగే ఎగుమతుల్లో కూడా 48 శాతం ఇవే ఉన్నాయన్నారు. మేకిన్ ఇండియా పథకం కంద ఇండియన్ ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేరవేసేందుకు గతంలోనే అమెజాన్ అంగీకరించింది. ఈ క్రమంలో ఎగుమతులు 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన దేశంలో స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులు అమెజాన్ వెబ్ సైట్స్ ద్వారా అమెరికా, యూకే, యూఏఈ, కెనడా, మెక్సికో, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో మార్కెట్ సంపాదించుకున్నాయి.

English summary

With $2 billion in exports, MSMEs get international reach via Amazon's GSP

From a Mumbai-based textile company that has become one of the most popular brands in the bed-linen category on Amazon’s US marketplace to a Bengaluru-based electronics toy manufacturer that expanded its presence beyond India and the US to the UK, Canada, Australia and the UAE — several MSMEs have grown as a part of Amazon’s Global selling Programme (GSP).
Story first published: Tuesday, July 21, 2020, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X