SBI డోర్‌స్టెప్స్ బ్యాంకింగ్ సేవలు, ఈ విషయాలు తెలుసుకోండి
ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వృద్ధులకు, కరోనా నేపథ్యంలో ఆందోళన చెందే కస్టమర్లకు ఇది ఎంతో ప్రయోజనకరం. సమయం కూడా ఆదా అవుతుంది. ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులను ఇంటి వద్దనే పొందవచ్చు. అంతేకాదు, క్యాష్ డెలివరీ సేవలు కూడా ఉంటాయని తెలిపింది.
కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, ఆ వడ్డీ రేట్లు పెంపు: ఎన్ని రోజులకు ఎంత పెరిగాయంటే?

ఇలా మరిన్నని వివరాలు తెలుసుకోవచ్చు
'ఇప్పుడు మీ డోర్ స్టెప్ వద్ద మీ బ్యాంకు సేవలు పొందవచ్చు. ఈ సేవలను ఈ రోజే మీర రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం https://bank.sbi/dsb, టోల్ ఫ్రీ నెంబర్ 1800 1037 188 లేదా 1800 1213 721 తెలుసుకోవచ్చు'నని ఎస్బీఐ ట్వీట్ చేసింది.
ఈ ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల సౌకర్యం వినియోగదారులకు ఇంటి వద్దనే సేవలను అందిస్తుంది.

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు
- ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల్లో నగదు పికప్, నగదు డెలివరీ, చెక్కు పికప్, చెక్కు రిక్వైజేషన్ పికప్, ఫారమ్ 15హెచ్ పికప్, డ్రాఫ్ట్స్ డెలివరీలు, టర్మ్ డిపాజిట్ అఢ్వైజ్ డెలివరీ, లైఫ్ సర్టిఫికేట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్స్ పికప్స్ ఉంటాయి.
- ఈ సేవలు పొందేందుకు ఉదయం గం.9 నుండి సాయంత్రం 4 గంటల వరకు 1800111103 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలి. వర్కింగ్ డేస్‌లో ఈ సేవలు ఉంటాయి.
- రిజిస్ట్రేషన్ కోసం సేవా అభ్యర్థన హోంశాఖలో ఉంటుంది.
- డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా కేైసీ కంప్లయింట్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీ ఉంటుంది.

ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ సేవలు ఛార్జీ
- క్యాష్ డిపాజిట్ ₹75/-+ GST
- క్యాష్ పేమెంట్స్ / ఉపసంహరణ ₹75/- + GST
- చెక్కు పికప్/ఇన్స్ట్రుమెంట్- ₹75/- + GST
- చెక్కు బుక్ రిక్విజేషన్ స్లిప్ పికప్- ₹75/- + GST
- టర్మ్ డిపాజిట్ సలహా, ఖాతా స్టేట్మెంట్ (సేవింగ్స్ బ్యాంకు) - ఉచితం
- కరెంట్ ఖాతా స్టేట్మెంట్ (డూప్లికేట్) ₹100 + GST
- నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్ మొత్తం రోజుకు రూ.20,000 పరిమితం.
- హోం బ్రాంచీకి 5 కిలో మీటర్ల దూరంలో చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఖాతాదారులు ఈ సేవలు పొందుతారు.
- ఉమ్మడి ఖాతాలు కలిగిన కస్టమర్లు ఈ సేవలు పొందలేరు.
- చిన్న ఖాతా, వ్యక్తిగతం కానీ లేని ఖాతాలకు కూడా ఈ సేవలు అందుబాటులో లేవు.
- పాస్ బుక్‌తో చెక్కు/ఉపసంహరణ ఫారంను ఉపయోగించి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.