For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1కే ఇంటి అనుమతి, తక్షణ అప్రూవల్: అలాచేస్తే చెప్పకుండానే కూల్చివేత

|

ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం సులభంగా అనుమతుల మంజూరుతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో నిర్ణీత గడువులోగా అనుమతి ఇవ్వని అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా కూడా ఈ చట్టం ఉంది. దీని ప్రకారం...

2019లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్: బెంగళూరు, హైదరాబాద్ టాప్

75 గజాల్లోపు G+1 ఇంటికి అనుమతి అవసరంలేదు

75 గజాల్లోపు G+1 ఇంటికి అనుమతి అవసరంలేదు

75 గజాలలోపు (63 చ.మీ.) స్థలంలో G+1 ఇంటి నిర్మాణానికి స్థానిక సంస్థ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకొని కేవలం రూ.1 చెల్లించి ఇంటిని నిర్మించుకోవచ్చు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కార్పోరేషన్ లేదా మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

వీరికి ఇన్‌స్టాంట్ అప్రూవల్

వీరికి ఇన్‌స్టాంట్ అప్రూవల్

64 చదరపు మీటర్ల నుంచి 500 చ.మీ.లోపు విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తులో ఇల్లు కట్టుకోవాలని భావించేవారు మున్సిపల్ ఆఫీస్‌ల చుట్టు తిరగవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో స్వీయ ధృవీకరణ పత్రాన్ని అందించి వెంటనే అనుమతిని తీసుకునే సౌలభ్యం ఉంది. అంటే ఇన్‌స్టాంట్ అప్రూవల్ వస్తుంది.

జైలు శిక్ష, భారీ జరిమానా

జైలు శిక్ష, భారీ జరిమానా

200 చ.మీ. నుంచి 500 చ.మీ. లోపు విస్తీర్ణంలో కట్టిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు కావాలంటే నిబంధనల ప్రకారం నిర్మాణం ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది.

తప్పుడు వివరాలు ఇస్తే నోటీసు ఇవ్వకుండా కూల్చివేత

తప్పుడు వివరాలు ఇస్తే నోటీసు ఇవ్వకుండా కూల్చివేత

200 చ.మీ. లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు 10 శాతం బిల్డప్ ఏరియాను తనఖా పెట్టవలసిన అవసరం లేదు. అయితే తప్పుడు వివరాలను పొందుపరిచి అనుమతి తీసుకుంటే మాత్రం నోటీసు ఇవ్వకుండానే కూల్చవచ్చు.

10 మీటర్ల కంటే అధిక ఎత్తులోని నిర్మాణాలకు..

10 మీటర్ల కంటే అధిక ఎత్తులోని నిర్మాణాలకు..

500 చ.మీ. లేదా ఆపై విస్తీర్ణంలో 10 మీటర్ల కంటే అధిక ఎత్తులో నిర్మించే భవనానికి ఆన్‌లైన్ ద్వారా కేవలం 21 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారు. భవన నిర్మాణం సమయంలో 10 శాతం బిల్డప్ ఏరియాను స్థానిక కార్పోరేషన్ లేదా మున్సిపాలిటీకి తనఖా పెట్టాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చాక దానిని నిర్మాణదారుడికి వెనక్కి ఇస్తారు.

ఫిర్యాదు చేస్తే బహుమతి

ఫిర్యాదు చేస్తే బహుమతి

ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు గోప్యంగా ఉంచుతారు. వారంలో చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు మేరకు నిర్మాణం అక్రమమని తేలితే ఫిర్యాదు చేసిన వారికి ప్రోత్సాహక బహుమతి ఉంటుంది.

కొత్త లేఅవుట్లకు..

కొత్త లేఅవుట్లకు..

కొత్తగా లేఅవుట్లు, వెంచర్స్ అభివృద్ధి చేస్తే ప్రాథమిక అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనుమతి లభించాక రెండేళ్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో అనుమతి తీసుకుంటే వెంటనే రద్దు చేస్తారు. అలాగే, అనుమతి లేని లేఅవుట్లను అభివృద్ధి చేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. స్థలం వ్యాల్యూలో 25% జరిమానా విధిస్తారు.

మరిన్ని...

మరిన్ని...

కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం గోడలపై అనధికారిక నోటీసులు, పోస్టర్లు అంటించరాదు. కాలుష్యకారక వస్తువులను రోడ్డుపై పడేసేవారికి సెక్షన్ 161 కింద శిక్ష ఉంటుంది. సౌండ్, ఎయిర్, వాటర్ కాలుష్యానికి కారణమైతే 162 సెక్షన్ కింద చర్యలు ఉంటాయి. హరితహారం కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలి. మున్సిపాలిటీలు గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. విధిగా నర్సరీలు ఏర్పాటు చేయాలి.

English summary

Permission for house for Rs1: Know about new municipal act

Construction of ground plus one floor house in an area up to 75 square yards in Telangana’s urban areas will no longer require permissions from local bodies, providing a big relief to urban poor.
Story first published: Tuesday, January 14, 2020, 12:04 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more