Paytm IPO share allotment online: పేటీఎం షేర్ల కేటాయింపు తెలుసుకోండిలా..
భారత అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లో భాగంగా నేడు లేదా రేపు ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించే అవకాశం ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి నుండి సోమవారం అనుమతి వస్తుందని, ధరల శ్రేణిలో గరిష్టమైన రూ.2150 వద్ద షేర్లు కేటాయించవచ్చునని చెబుతున్నారు. సోమవారం కూడా షేర్ల కేటాయింపు జరగవచ్చునని భావించారు. పేటీఎం మనీ యాప్‌లో ఇదే సమాచారం ఉంది.
రూ.18,300 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన బిడ్స్ ఆధారంగా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.1,49,428 కోట్లు లేదా 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. పేటీఎం పబ్లిక్ ఇష్యూకు 1.89 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4.83 కోట్ల షేర్లు ఉండగా, 9.14 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. ఈ నెల 18న పేటీఎం స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.

అలాట్మెంట్ స్టేటస్
ఆన్లైన్ ద్వారా పేటీఎం ఐపీవో షేర్ అలాట్మెంట్ స్టేటస్ చూసుకోవడానికి బీఎస్ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.
- తొలుత బీఎస్ఈ లింక్ bseindia.com/investors/appli_check.aspx లోకి వెళ్లాలి.
- అక్కడ పేటీఎం ఐపీవో పైన క్లిక్ చేయాలి. అయితే అక్కడ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరు ఉంటుంది.
- పేటీఎం ఐపీవో అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయాలి.
- పాన్ కార్డు వివరాలు నింపాలి
- 'I'm not a robot పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ అప్లికేషన్ పేటీఎం అలాట్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది.