For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యార్థుల ఏళ్ల కల.. మోడీ గుడ్ న్యూస్: NRA-CET గురించి తెలుసుకోండి

|

కేంద్ర ప్రభుత్వంలోని నాన్-గెజిటెడ్ పోస్టులు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దిగువస్థాయి పోస్టులకు ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్ష(CET) ఉండనుంది. దీనిని నిర్వహించేందుకు జాతీయ నియామక సంస్థ(National Recruitment Agency-NRC)ను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి వర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సులభతరం చేసేందుకు, నిరుద్యోగులపై పరీక్షల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. NRC ఏర్పాటు వల్ల కోట్లమంది యువతకు మేలు కలుగుతుందని, వారు ఉద్యోగాల కోసం వేర్వేరు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని, విలువైన సమయం, ఇతర వనరులు ఆదా అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని చెప్పారు ప్రధాని మోడీ.

లోన్ మారటోరియం ఎఫెక్ట్, ఫైనాన్షియర్లకు 50,000 వాహనాల అప్పగింత?

ఎన్నో ఏళ్ళ యువత కోరిక తీర్చిన కేంద్రం

ఎన్నో ఏళ్ళ యువత కోరిక తీర్చిన కేంద్రం

నాన్-గెజిటెడ్, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో(గ్రూప్ బీ, గ్రూప్ సీ) ఉద్యోగాల భర్తీకి NRAను ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో NRA నిర్వహించే CET ఆధారంగా కేంద్రం ఉద్యోగాల్ని భర్తీ చేస్తుంది. NRA ఏర్పాటుకోసం కేంద్రం రూ.1,517 కోట్లు మంజూరు చేసింది. దీనికి ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి చైర్మన్‌గా ఉంటారు. NRA ఏర్పాటు మరో విప్లవాత్మక, చరిత్రాత్మకమైన నిర్ణయంగా చెబుతున్నారు. ఉద్యోగార్థుల సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఉద్యోగ నియామకాల్లో CET కోసం యువత ఏళ్ళుగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు వారి కోరిక నెరవేరింది. దేశంలో ప్రస్తుతం 20కి పైగా నియామక సంస్థలు ఉన్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. NRA ఏర్పాటుతో ఈ సంస్థలు ఒకే గొడుకు కిందకు వస్తాయి. NRA ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు.

అన్నీ ఒకే గూటి కిందకు, డబ్బు, సమయం ఆదా..

అన్నీ ఒకే గూటి కిందకు, డబ్బు, సమయం ఆదా..

- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం NRA కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET)ను నిర్వహిస్తుంది. ఇందులో స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినవారు ప్రభుత్వ సంస్థల తరఫున నియామక ఏజెన్సీలు నిర్వహించే పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తారు.

- NRA పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 సంస్థలు వస్తాయి.

- దేశంలోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున సుమారు వెయ్యి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

- NRAలో రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఐబీపీఎస్ నుండి ప్రతినిధులు ఉంటారు.

- 12 భాషల్లో జరుగుతున్న ఈ పరీక్షలను, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. దీంతో దేశంలో వివిధ భాషలు మాట్లాడే వారందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి.

- వేర్వేరు ఫీజులతో ఎక్కువ పరీక్షలు రాసే ఇబ్బంది తప్పుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి.

- కామన్ పోర్టల్‌లో అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొని, కేంద్రాల్ని ఎంపిక చేసుకోవచ్చు. అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయవచ్చు.

ఎన్నిసార్లయినా రాయవచ్చు.. ప్రస్తుత రిజర్వేషన్, మూడేళ్లు

ఎన్నిసార్లయినా రాయవచ్చు.. ప్రస్తుత రిజర్వేషన్, మూడేళ్లు

- ప్రస్తుతం కామన్ టెస్ట్ స్కోర్ ఆధారంగా మూడు ముఖ్యమైన ఏజెన్సీల్లో (ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, ఐబీపీఎస్) పోస్టులను భర్తీ చేస్తారు. ఆ తర్వాత క్రమంగా ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తింప చేస్తారు. వేర్వేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఖర్చు, ప్రయాణాల ఖర్చు తగ్గుతుంది.

- ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుతుంది.

- స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు పరీక్షలు మళ్లీ మళ్లీ రాసుకునే వెసులుబాటు ఉంది. అందులో ఎక్కువ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

- పోస్టులను బట్టి ఒక్కోస్థాయి వారికీ ఒక్కో పరీక్ష విడివిడిగా ఉంటుంది.

- ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ప్రతి సంవత్సరం రెండుమార్లు నిర్వహిస్తారు.

- గరిష్ఠ వయోపరిమితి వరకు ఎవరైనా ఎన్నిసార్లయినా పరీక్ష రాయవచ్చు.

- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంది.

- నియామక ప్రకటనల సమయంలో ఈ స్కోర్ ప్రధాన భూమిక అవుతుంది.

- ప్రస్తుత రిజర్వేషన్ విధానం అమలవుతుంది.

- ఉమ్మడి పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంది.

- CET స్కోర్ తర్వాత రెండు, మూడో దశల పరీక్షలను (మౌఖిక, ఇతర పరీక్షలు) సంబంధిత రిక్రూట్మెంట్ సంస్థలు నిర్వహిస్తాయి.

- CET స్కోర్‌ను అవసరమైతే రాష్ట్రాల్లోని నియామక సంస్థలు, ప్రయివేటు సంస్థలు ఉపయోగించుకోవచ్చు.

10వ తరగతి, డిగ్రీ, ఇంటర్.. కోట్లాది మందికి ఊరట

10వ తరగతి, డిగ్రీ, ఇంటర్.. కోట్లాది మందికి ఊరట

గ్రూప్ బి, సి (నాన్ టెక్నికల్) పోస్టుల్లో అభ్యర్థుల స్క్రీన్/షార్ట్ లిస్ట్ కోసం CETని NRA నిర్వహిస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక/ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ ప్రతినిధులు NRAలో ఉంటారు. నాన్ టెక్నికల్ పోస్ట్స్ కోసం గ్రాడ్యుయేషన్, 12వ తరగతి పాసైనవారు, 10వ తరగతి పాసైనవారు వేర్వేరు స్థాయిలో CET పరీక్షను NRA నిర్వహిస్తుంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.

CET మార్కులను బట్టి స్క్రీనింగ్ నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ తుది ఎంపికను ప్రత్యేక స్పెషలైజ్డ్ టైర్స్ (2,3) పరీక్షల ద్వారా సంబంధిత రిక్రూట్మెంట్ ఏజెన్సీలు చేపడతాయి. పరీక్ష పాఠ్యాంశాలు ఉమ్మడిగా ఉంటాయి. దీంతో ప్రస్తుతం ప్రతి పరీక్షకు వేర్వేరు పాఠ్యాంశాలకు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్ కింద ఏటా 1.25 లక్షలగ్రూప్ బీ, సీ ఉద్యోగాల ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటికి దాదాపు 3 కోట్ల మంది హాజరవుతున్నారు.

ఖాళీల భర్తీకి 12 నెలల నుండి 18 నెలల సమయం పట్టేది.

అభ్యర్థులకు లాభాలు..

అభ్యర్థులకు లాభాలు..

ఉమ్మడి నమోదు, ఒకే ఫీజు, ఉమ్మడి పాఠ్య ప్రణాళిక, ప్రామాణిక ప్రశ్నలు, భద్రమైన పరీక్ష ప్రక్రియ, వెంటనే ఫలితాలు, నియామక కాలం తగ్గింపు, ఆన్‌లైన్‌లో పరీక్ష, సొంత జిల్లాలో పరీక్షకు హాజరు, సమయం ఆదా, డబ్బు ఆదా ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి.

English summary

National Recruitment Agency: All you need to know about NRA

National Recruitment Agency, NRA has been given the cabinet nod and would be set up for conducting the preliminary examinations for IBPS, RRB and SSC jobs. Check out What is NRA here.
Story first published: Thursday, August 20, 2020, 9:31 [IST]
Company Search