For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో ఒక తయారీ యూనిట్ పెట్టాలంటే ఎన్ని అనుమతులు అవసరమో తెలుసా?

|

బిజినెస్ అంటేనే రిస్క్ తో కూడుకున్న పని. అయినా సరే ప్రతి ఏటా కొన్ని లక్షల మంది యువత జీవితంలో ఏదో సాధించాలన్న కసితో వ్యాపారాల్లోకి అడుగుపెడతారు. లక్షల్లో వేతనాలు చెల్లించే ఉద్యోగాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసి, ఇదే మా గమ్యం అంటూ ముందడుగు వేస్తారు. అంత వరకు బాగానే ఉంటుంది కానీ... ఇక ఒక సారి ఫైల్ పట్టుకుని వ్యాపార అనుమతుల కోసం బయలుదేరితే గానీ అసలు విషయం అర్థం కాదు. ఒక చోట నుంచి మరో చోటకు, ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్ కు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతాయే గానే పెద్దగా ఫైల్ కదిలిన దాఖలా కనిపించదు. అయినా సరే ఏదోలా ఉన్న అన్ని రకాల మార్గాలను అన్వేషించి, ఏ మార్గంలో త్వరగా లైసెన్సులు, అనుమతులు లభిస్తాయో తెలుసుకునే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఒక వైపు ఉద్యోగం ఉండదు, మరో వైపు నెల నెల ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. ఇంకోవైపు అనుమతులు లేవని ప్రభుత్వ అధికారుల నుంచి నోటీసులు. ఇక చూడండి పారిశ్రామికవేత్త కష్టం. బయటికి చెప్పుకోలేక, లోపల దిగమింగ లేక కుములిపోతుంటారు. ఇంతకూ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎన్ని అనుమతులు కావాలో తెలుసా మీకు? లేదంటే ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనంలోని విషయాలను మీకోసం అందిస్తున్నాం తెలుసుకోండి.

అక్షరాలా 2,000 రకాల అనుమతులు...

అక్షరాలా 2,000 రకాల అనుమతులు...

భారత దేశంలో ఒక తయారీ రంగ యూనిట్ నెలకొల్పి వ్యాపారం కొనసాగించాలంటే సదరు కంపెనీ సుమారు 2,000 రకాల అనుమతులు, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో సుమారు 122 రకాల కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాలు, స్థానిక సంస్థల అనుమతులు అవసరమవుతాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 1,984 రకాల అనుమతులు అవసరం. ఈ విషయాన్నీ ప్రముఖ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఒక పరిశోధన నిర్వహించి వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ వ్యవహారాల శాఖ, పర్యావరణం, లేబర్ లా, జీఎస్టీ వంటి అనేక శాఖల అనుమతులు అవసరం అవుతాయి. ఈ మేరకు ఒక నివేదికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఫిక్కీ అందజేసినట్లు సమాచారం. వచ్చే బడ్జెట్ లో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది.

సంక్లిష్టం ... కంపెనీల చట్టం..

సంక్లిష్టం ... కంపెనీల చట్టం..

ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే మొదట అనుమతి తీసుకోవాల్సింది కంపెనీల చట్టం నుంచే. ఇక్కడ మొదలైన అనుమతుల పర్వం ఇక కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క కంపెనీల చట్టం నుంచే ఒక కంపెనీ 287 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సెబీ నుంచి ఒక 125 రకాల అనుమతులు (కేవలం లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే) అవసరం. ఫ్యాక్టరీస్ ఆక్ట్ నుంచి 112 అనుమతులు, ఫెమా చట్టం నుంచి 91 రకాల అనుమతులు, ఇన్కమ్ టాక్స్ యాక్ట్ నుంచి మరో 91, ఫారిన్ ట్రేడ్ ఆక్ట్ నుంచి 59 రకాల అనుమతులు అవసరం అవుతాయి. ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందినవి మాత్రమే... ఇక రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, జిల్లా స్థాయి అనుమతులు, స్థానిక అనుమతులు కలిసి ఒక పెద్ద చాంతాడంత లిస్టు అవుతోంది.

పెరుగుతున్న వ్యయం...

పెరుగుతున్న వ్యయం...

పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే ... ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెరుగవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆన్లైన్ లో అనుమతులు ఇవ్వాలని, కేవలం సెల్ఫ్ సర్టిఫికేషన్ తో అన్ని అనుమతులు లభించేలా చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ఒక కంపెనీ అందునా.. దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు కలిగిన వాటికి అనుమతుల గోల మరింత అధికంగా ఉంటోంది. వీటన్నిటినీ సాధించేందుకు కంపెనీలకు అధిక సమయం, అలాగే విపరీతమైన వ్యయం అవుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న కంపెనీలకు మరింత తలనొప్పి వ్యవహారంలా తయారవుతోంది. అందుకే, ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఫారిన్ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. కానీ ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

English summary

Manufacturing companies may need up to 2,000 compliances under laws

Manufacturing companies in India may need to fulfil 1,984 compliances under various central and state laws, which are time-consuming and increase the cost of doing business, industry lobby group Ficci has told top government functionaries ahead of the Union Budget.
Story first published: Wednesday, January 29, 2020, 20:44 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more