For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జగన్ సరికొత్త అధ్యాయం: 'దిశ' యాప్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేసినా, ఫోన్ ఊపినా చాలు!

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలపై దురాఘతాలు జరిగితే, వారి మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. అదే ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019. అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష అమలు చేసేలా ఐపీసీ, సీఆర్పీసీలలో మార్పులు తీసుకు వచ్చారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు దిశ యాప్ రూపకల్పన చేశారు.

ఏపీలో రిలయన్స్ భూములు వెనక్కి తీసుకుంటున్నారా?

మహిళలకు రక్షణగా దిశ యాప్

మహిళలకు రక్షణగా దిశ యాప్

జగన్ శనివారం ఆంధ్రప్రదేశ్‌లో తొలి దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ సాయంతో సందేశం పంపిస్తే 10 నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు. మహిళలను ఆదుకునేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు దీనిని తీసుకు వచ్చారు.

13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు

13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు

దిశ చట్టం కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 13 ప్రత్యేక కోర్టులు, 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించామని, త్వరలో ఆమోదం లభిస్తుందన్నారు.

మంగళగిరితో పాటు విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్

మంగళగిరితో పాటు విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్

వీటి కోసం రూ.27.39 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులిచ్చారు. రాష్ట్రంలో 18 చోట్ల దిశ పోలీస్ స్టేషన్‌లను ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు విశాఖ, తిరుపతిలోను ఏర్పాటు చేయనున్నారు. 118 మంది సిబ్బందిని నియమిస్తారు. వీటికి రూ.31 కోట్లు విడుదల చేశారు.

ప్రతి స్టేషన్లో 37 మంది సిబ్బంది, ఓ మినీ బస్సు

ప్రతి స్టేషన్లో 37 మంది సిబ్బంది, ఓ మినీ బస్సు

ప్రతి దిశ పోలీస్ స్టేషన్లో 36 నుండి 37 మంది పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఉంటారు. డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కేసులు విచారిస్తారు. పోలీసు వాహనంతో పాటు ఆపదలో ఉన్న మహిళల్ని కాపాడేందుకు ఓ మినీ బస్సును ఏర్పాటు చేసారు.

మహిళల రక్షణ కోసం.. ఫోన్‌ను ఊపినా..

మహిళల రక్షణ కోసం.. ఫోన్‌ను ఊపినా..

ఆపదలోని మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు, రక్షణ కల్పించేందుకు పోలీసు శాఖ దిశ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఆపదలో ఉన్నవారు యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ (SOS) బటన్‌ను ప్రెస్ చేసి, పోలీసుల సహాయం కోరే సమయం లేనప్పుడు ఫోన్‌ను అటు ఇటు గట్టిగా ఊపినా కంట్రోల్ రూంకి క్షణాల్లో సమాచారం వెళ్తుంది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులోకి

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులోకి

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫాంలపై శనివారం నుంచే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్నేట్ లేకపోయినా యాప్ వర్క్ చేస్తుంది

ఇంటర్నేట్ లేకపోయినా యాప్ వర్క్ చేస్తుంది

ఈ యాప్ ఇంటర్నేట్ ఉన్నా, లేకపోయినా పని చేస్తుంది. అంటే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ మహిళలు ఈ యాప్ ద్వారా రక్షణ కోరవచ్చు.

యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు...

యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చాలు...

ఫోన్‌లో యాప్‌ను ఓపెన్ చేసి SOS బటన్ నొక్కితే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, అడ్రస్ వంటి వివరాలు పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్తాయి.

బాధితురాలి పరిస్థితి అంచనా కోసం..

బాధితురాలి పరిస్థితి అంచనా కోసం..

ఫోన్ లొకేషన్, 10 సెకండ్ల నిడివి గల వీడియో, ఆడియో కంట్రోల్ రూంకు వెళ్తాయి. బాధితురాలు ఎక్కడ ఉన్నారు, ఆమె పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.

ట్రాక్ మై ట్రావెల్.. అప్రమత్తం

ట్రాక్ మై ట్రావెల్.. అప్రమత్తం

ఈ యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ ఉంది. మహిళ ఓ ప్రాంతం నుంచి ఆటోలో లేదా బస్సులో లేదా క్యాబ్‌లో మరో ప్రాంతానికి వెళ్తుంటే.. ట్రాక్ మై ట్రావెల్ యాప్షన్ ఎంచుకొని, ప్రాంతం, గమ్యాన్ని రికార్డ్ చేయాలి. అలా చేస్తే కంట్రోల్ రూం నుండి ఆమె వెళ్లే మార్గాన్ని గమనిస్తారు. అప్పుడు ఆ వాహనం మరో మార్గంలో వెళ్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేస్తారు.

SOS బటన్ ప్రెస్ చేస్తే సమాచారం వెళ్తుంది

SOS బటన్ ప్రెస్ చేస్తే సమాచారం వెళ్తుంది

ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి అందిస్తారు. దగ్గరలోని పోలీస్ రక్షక వాహనాలకు కంట్రోల్ రూం నుండి ఆటోమేటిక్‌గా కాల్ డిస్పాచ్ విధానంలో పంపిస్తారు.

జీపీఎస్ ద్వారా పోలీసులు సులభంగా వెళ్ళవచ్చ

జీపీఎస్ ద్వారా పోలీసులు సులభంగా వెళ్ళవచ్చ

జీపీఎస్ అమర్చిన పోలీస్ వాహనాల్లో మొబైల్ డాటా టెర్మినల్ ఉంటుంది. ఈ పోలీస్ వాహనం ఉన్న ప్రాంతం నుంచి మహిళ నుంచి వచ్చిన సందేశం ప్రాంతం వరకు రూట్ మ్యాప్ వెంటనే కనిపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ ద్వారా పోలీసులు వెళ్తారు.

యాప్ నుంచి ఫోన్ కూడా చేయవచ్చు

యాప్ నుంచి ఫోన్ కూడా చేయవచ్చు

దిశ యాప్ ద్వారా 100 లేదా 112 నెంబర్లకు ఫోన్ కూడా చేయవచ్చు. ఈ యాప్‌ను ముఖ్యంగా మహిళల కోసం మాత్రమే సిద్ధం చేశారు. అయితే ఆపదలోని వృద్ధులు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయవచ్చు

కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయవచ్చు

ఆపదలో ఉన్న మహిళ ఎమర్జెన్సీ సమాచారాన్ని పంపించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్ నెంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నెంబర్లు నమోదు చేసుకోవచ్చు. SOS సందేశం పంపినా లేదా ట్రాక్ మై ట్రావెల్ యాప్షన్ వినియోగించినా వాహనం దారితప్పి వెళ్లినా పోలీసులతో పాటు ఈ ఐదు నెంబర్లకు కూడా సందేశం వెళ్తుంది.

ఫోన్ నెంబర్లు, పోలీస్ స్టేషన్లు తెలుసుకోవచ్చు

ఫోన్ నెంబర్లు, పోలీస్ స్టేషన్లు తెలుసుకోవచ్చు

యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు, సమీపంలోని పోలీస్ స్టేషన్ల వివరాలు తెలుసుకునే ఆప్షన్స్ ఉంటాయి.

యాప్‌లో ఇంకా ఎన్నో..

వైద్య సేవలు అవసరమైతే యాప్ ద్వారా దగ్గరలోని మెటర్నిటీ, ట్రామా కేర్ సెంటర్లు, ఇతర ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు, సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు తాము ఉన్న ప్రాంతం నుంచి దగ్గరలోని పోలీస్ స్టేషన్లు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు నావిగేషన్, పోలీసు డైరెక్టరీ, ఎమర్జెన్సీ సమయాల్లో చేయాల్సిన ఫోన్ నెంబర్లు, రోడ్డు భద్రత వంటి ఆఫ్షన్స్ ఉన్నాయి.

English summary

Know about Disha app: How and When it works?

AP Chief Minister YS Jagan Mohan Reddy was on Saturday dismayed at the scale of atrocities against women and children reported since 2014.Addressing a gathering after launching the ‘Disha App’ here, Mr. Reddy said that 5,046 cases of rape and 21,510 cases of sexual assault on minor girls had been reported in the State between 2014 and 2018.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more