For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax: చిన్నోడు... పెద్దోడు.. ఎవరినీ వదలని పన్ను పోటు!

|

ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. అది సహజం కూడా. కానీ, భారత దేశం చిన్నోళ్ల ను .. అంటే సామాన్యులను ప్రత్యేకంగా చూస్తుంది. వారిపై ఏ రకమైన భారం మోపాలనుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది. కానీ, మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్ మాత్రం ఎవరినీ వదల్లేదు. చిన్నోళ్లకు ... పెద్దోళ్ళకు అందరికీ పన్ను భారం పెంచేలా నిర్ణయాలు తీసుకుంది. ఇంకా కొన్ని విషయాల్లో పూర్తి స్పష్టత రానప్పటికీ... గత వారం రోజులుగా అటు సామాన్యులు, ఇటు సంపన్నులు అందరూ బడ్జెట్ ప్రభావం తమపై ఎలా ఉంటుందా అనే ఆలోచిస్తున్నారు. టాక్స్ నిపుణులను సంప్రదిస్తూ వారి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో పడ్డారు. అంతకంతకూ పెరిగిపోతున్న ధరలు ఒక వైపు, పెరగని జీతాలు మరోవైపు సామాన్యులను మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. ఏదో గవర్నమెంట్ తప్పనిసరి కట్టింగ్స్ (పీఎఫ్) వంటి అంశాలు ఉంటాయి కాబట్టి... ఒక ఉద్యోగి ఒకే కంపెనీలో కనీసం 5 ఏళ్లకు పైగా పనిచేస్తే తక్కువలో తక్కువ రూ 3 లక్షల నుంచి రూ 5 లక్షల వరకు సేవింగ్స్ ఉంటాయి. ఎల్ ఐ సి పాలసీ తీసుకుంటే ఒక వైపు బీమా రక్షణ లభిస్తుంది, మరో వైపు తమ పొదుపు కు తగిన రాబడి చేతికి అందివస్తుందని ఉద్యోగులు ఆశతో అవన్నీ కొనుగోలు చేస్తున్నారు. కానీ మన బడ్జెట్ వాటిని ప్రోత్సహించక పోగా... నిరుత్సహపరిచేలా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్‌కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం

అయితే అది ఎంచుకోకండి..

అయితే అది ఎంచుకోకండి..

మన ఆర్థిక మంత్రి గారు... ప్రజలపై ఎంతో ప్రేమ ను చూపినట్లు బడ్జెట్లో కొత్త ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల విభాగంలో అనేక స్లాబులు పెట్టి ఒకవైపు పన్ను రేటు తగ్గుతుంది అని మనం భ్రమ పడేలా చేస్తూ... మరో వైపు పన్ను మినహాయింపులు అన్నీ తొలగించేసింది దయగల మహారాణి. ఈ కొత్త టాక్స్ స్లాబులకు వెళ్లాలని భావించే వారు ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ మొత్తం పన్ను మినహాయింపులు రూ 2.5 లక్షల కంటే అధికంగా ఉంటె మాత్రం... మీకు కొత్త పన్ను విధానం అస్సలు పనిచేయదు. ఎందుకంటే... 80సి లో రూ 1.5 లక్షలు, 80 డీ లో రూ 25,000, సెక్షన్ 24 లో హోమ్ లోన్ వడ్డీ రూ 2 లక్షలు బాండ్స్ రూ 50,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ 50,000 ... ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ పై మినహాయింపు ఇలా ప్రస్తుతం సుమారు రూ 5 లక్షల వరకు మీకు మినహాయింపులు లభిస్తున్నాయి. కానీ కొత్త విధానంలో రూ 2.5 లక్షల కంటే ఎక్కువ ప్రయోజనం ఉండదు. అంటే చూడండి నెలకు సుమారు రూ 50,000 జీతంతో జీవించే ఒక సామాన్య ఉద్యోగికి ప్రభుత్వం ఏపాటి ఊరటనిచ్చిందో?

రూ 7.5 లక్షలు దాటితే పన్ను...

రూ 7.5 లక్షలు దాటితే పన్ను...

పైన వివరించినట్లు చిన్న వాళ్ళను వదలని కేంద్రం... ఇక పెద్ద వేతనాలు తీసుకునే వారికి కూడా చెక్ పెడుతోంది. రూ 15 లక్షలు... అంతకంటే అధిక వేతనం పొందే మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు కూడా కొత్త విధానంలో చుక్కెదురు కానుంది. సహజంగానే అధిక వేతనాలు పొందే ఉద్యోగులకు పన్ను పోటు నుంచి రక్షణ కల్పించేందుకు సంస్థలు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్ పీ ఎస్) లో అధిక కాంట్రిబ్యూషన్ చేస్తుంటాయి. సాధారణంగా కంపెనీ వాటా 14% వరకు ఉన్నా... ప్రస్తుతం గరిష్టంగా కంపెనీ వాటాపై ఎటువంటి పరిమితి లేదు. కానీ కొత్త పన్ను విధానంలో అన్ని రకాల మినహాయింపులు కలిపి రూ 7.5 లక్షలు దాటితే ఇక వారిపై పన్ను పోటు పడబోతోంది. కాబట్టి... పేరుకే పెద్ద జీతం... చేతికొచ్చేది నామ మాత్రం అన్న చందాన ఉంది వీరి పరిస్థితి.

కంగారులో ఎన్నారైలు ...

కంగారులో ఎన్నారైలు ...

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినప్పుడు ఇండియాలోని ఇండియన్స్ కంటే... ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తెగ సంబరపడి పోయారు. మోడీ గారు ఇండియా ను ఒక అమెరికా లాగ, ఒక సింగపూర్ లాగే మార్చేస్తారని మనసా వాచా విశ్వసించారు. రెండో సారి కూడా ఆయనే గెలవని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే జరిగింది. కానీ ఇండియా అమెరికా కాలేదు... లేదంటే సింగపూర్ కూడా కాలేదు కానీ... ఎన్నారైలకు కొత్తగా పన్ను పోటు మొదలైంది. వారు ఏ దేశంలో నివసిస్తున్నా ఇకపై ఇండియాలో పన్నులు చెల్లించాలి. ఇప్పుడు అదే వారిని కంగారుకు గురిచేస్తోంది. అయితే వారి ఇండియాలోని సంపాదన పైనే ఈ పన్ను చెల్లించాలి. విదేశీ సంపాదనపై పన్ను చెల్లింపులు అడగడం లేదు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇండియా ను ఆ విధంగా ముందుకు తీసుకువెలుతున్నారు. పేదోడు, పెద్దోడ్ని ఎవరినీ వదలకుండా పన్నులేసి మరీ ఇండియాను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతారేమో చూడాలి మరి. మీరేమంటారు?

English summary

Indian new tax regime is not going to spare anybody

Indian new tax regime is not going to spare anybody - small or big - as it imposes taxes on each category. The individuals who are getting above Rs 2.5 lakh exemptions are advised not to adopt for new tax slabs to get more benefits. Neither NRIs nor highly paid employees are going to be spared in the new tax system introduced in the Budget 2020 by the Finance Minister Nirmala Sitharaman.
Story first published: Friday, February 7, 2020, 7:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X