శాలరీలో పీఎఫ్ తగ్గించుకొని, జీతం పెంచుకుంటే రూ.లక్షలు నష్టపోతారు!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో సంఘటిత రంగంలోని ఉద్యోగుల శాలరీ-పీఎఫ్‌లో మార్పులు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా ఉండేలా ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బేసిక్ శాలరీలో ఇది 12 శాతం. ఇప్పుడు అవసరమైన వారు టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా తీసుకోవచ్చు. కేంద్రం ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ ఈ నిర్ణయం సరైనది కాదు అనేది నిపుణుల అభిప్రాయం.
మాంద్యం దెబ్బ, మోడీ ప్రభుత్వం PF కొత్త ప్లాన్: లక్షలమందికి చేతికి ఎక్కువ శాలరీ!!

ఉద్యోగులకు శుభవార్తకు ఈ వారంలోనే ఆమోదం...
ఇటీవలి కాలంలో ఖర్చులు పెరుగుతున్నందున చేతికి వచ్చే వేతనం ఎక్కువగా ఉంటే బాగుండుందని చాలామంది భావిస్తారు. అలాంటి వారికి కేంద్రం ఇచ్చే ఆప్షన్ శుభవార్తే. కానీ పీఎప్ కట్టింగ్స్ తగ్గించుకొని, టేక్ హోమ్ శాలరీ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సోషల్ సెక్యూరిడీ కోడ్ బిల్లు 2019లో భాగంగా ఈ బిల్లుకు ఈ వారంలోనే పార్లమెంటులో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

స్వల్పకాలిక పరిష్కారమేనా?
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం కట్ అవుతుంది. కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేస్తుంది. చేతికి ఎక్కువ వేతనం వస్తే మంచిదే కావొచ్చు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇది సరికాదని అంటున్నారు. ఈపీఎఫ్‌ను రిటైర్మెంట్ పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఉద్యోగుల చేతికి ఎక్కువ జీతం వస్తే వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటుందని కేంద్రం భావిస్తుంది. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం దీనిని స్వల్పకాలిక పరిష్కరంగా భావిస్తున్నారు.

పదవీ విరమణ తర్వాత తక్కువ మొత్తం
ఎంతోమంది రిటైర్మెంట్ కోసం ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటారు. ఈపీఎప్ కాంట్రిబ్యూషన్ తగ్గితే పదవీ విరమణ తర్వాత పొందే ఫండ్ కూడా తగ్గుతుంది. ఎంతోమంది ఉద్యోగులకు పీఎఫ్ భవిష్యత్తు పెట్టుబడి సాధనమని గుర్తు చేస్తున్నారు.

ఖర్చులు పెరుగుతాయి...
ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకోవడాన్ని సరైన నిర్ణయంగా భావించడం లేదని అసెట్స్ మేనేజర్స్ మేనేజింగ్ పార్ట్నర్ సూర్య భాటియా ఈటీతో చెప్పారు. ఈపీఎప్ సురక్షిత పన్ను ప్రయోజనాలు కలిగిన సేవింగ్స్ సాధనం అన్నారు. తక్కువ ఈపీఎప్ కాంట్రిబ్యూషన్ వల్ల చేతికి వచ్చే వేతనం పెరుగుతుందని, కానీ సేవింగ్స్ తగ్గి ఖర్చులు కూడా పెరుగుతాయని హెచ్చరించారు. ఈ ఆప్షన్‌కు నో చెప్పడమే మంచిదన్నారు.

పీఎఫ్ డబ్బులు చివరి ఆప్షన్ మాత్రమే
ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి చాలామంది ఆశక్తి చూపిస్తుంటారు. అలాగే హోమ్ లోనే రీపేమెంట్, పిల్ల చదువు, పెళ్లి వంటి పలు ఆప్షన్లకు పీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. కానీ పీఎఫ్ డబ్బులను ఎప్పుడు కూడా చివరి ఆప్షన్ కిందనే చూడాలని చెబుతున్నారు.

లక్షలు నష్టపోయినట్లే
ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించుకుంటే పెద్దమొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముప్పై ఏళ్ల వయస్సులోని వారు 60 ఏళ్లకు రిటైర్ అయితే వీరి మంత్లీ బేసిక్ శాలరీ రూ.30వేలుగా ఉంటే వారి కాంట్రిబ్యూషన్ 10 శాతానికి తగ్గిస్తే.. రిటైర్మెంట్ సమయానికి రూ.96 లక్షల నుంచి రూ.76 లక్షలకు తగ్గుతుంది. అంటే రూ.16 లక్షలు తక్కువ వస్తుంది.