For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అకౌంట్ తెరవండి... మేము ఒక మొక్కను నాటుతాం.. ఓ బ్యాంకు వినూత్న ప్రకటన

|

కస్టమర్లను ఆకర్షించడానికి ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ప్రయత్నం చేస్తుంది. కొన్ని ఆఫర్లు ప్రకటిస్తే.. మరికొన్ని డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇస్తుంటాయి. తాజాగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా ఒక వినూత్న ప్రకటన చేసింది. ఇందులో భాగంగా ఎవరైనా కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరిస్తే అందుకు ప్రతిగా ఒక మొక్కను నాటనున్నట్టు ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి జనవరి 26 వరకు తెరిచే ఖాతాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. బ్యాంకు కార్య కలాపాలు ప్రారంభమై అవుతున్న సందర్భంగా ఈ ప్రకటనచేసింది. కొత్తగా ఖాతా తెరిచే కస్టమర్లకు పలు రకాల ఆఫర్లను కూడా ఇస్తోంది. అవేంటో చూద్దాం..

ఆన్ లైన్ సేవింగ్స్ ఖాతా

ఆన్ లైన్ సేవింగ్స్ ఖాతా

* బ్యాంకు ఆన్ లైన్ ద్వారా సేవింగ్స్ ఖాతాను తెరిచే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఖాతాను తెరవడానికి ఆధార్ నెంబర్, ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్, పెర్మనెంట్ ఆకౌంట్ నెంబర్ (పాన్) అవసరం ఉంటుందని బ్యాంక్ తన వెబ్ సైట్ లో పేర్కొంది.

* ఈ బ్యాంక్ శాఖలు ఉన్న నగరంలోని కస్టమర్లు ఖాతాను తెరవడానికి అవకాశం ఉంటుంది.

* ఆన్ లైన్ దరఖాస్తులో ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ను ఎంటర్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. దీని ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం లో ఎంటర్ చేయాలి. అంతే కాకుండా కొన్ని వ్యక్తి గత వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. వార్షికంగా ఏడు శాతం వడ్డీ రేటును పొందవచ్చని బ్యాంకు చెబుతోంది.

ఖాతా రకాలు

ఖాతా రకాలు

* రెండు రకాల ఖాతాలను బ్యాంకు అందిస్తోంది. వీటిలో సిగ్నేచర్ డెబిట్ కార్డు తో కూడిన సేవింగ్స్ అకౌంట్ కు కనీసం రూ.25,000 అవసరం ఉంటుంది. ఈ ఖాతా కు ఇంతే మొత్తంలో నిల్వ అవసరం ఉంటుంది.

* క్లాసిక్ డెబిట్ కార్డు తో కూడిన సేవింగ్స్ ఖాతాకు రూ. 10,000 కనీసం అవసరం ఉంటుంది. కనీస నిల్వ కూడా ఇంతే మొత్తం ఉంది.

కార్డుల ఫీచర్లు ఇవి..

కార్డుల ఫీచర్లు ఇవి..

* వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు తీసుకున్న వారికి ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు.

* బుక్ మై షో డాట్ కామ్ ద్వారా ప్రతి నెలలో రూ.250 డిస్కౌంట్ లభిస్తుంది. మూవీలు, ప్లే స్, ఈవెంట్ల బుకింగ్స్ పై దీన్ని పొందవచ్చు.

* కార్డును వినియోగించి చేసే మొదటి రూ.1,000 అంతకు మించిన కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. గరిష్టంగా రూ.250 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

* ప్రతి మూడు నెలల్లో ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లాంజ్ ను రెండు సార్లు యాక్సెస్ చేయవచ్చు.

* పర్సనల్ యాక్సిడెంట్ కవర్ రూ.25 లక్షలు, తదితర ఫీచర్లు ఉన్నాయి.

వీసా క్లాసిక్ కార్డు ఫీచర్లు

వీసా క్లాసిక్ కార్డు ఫీచర్లు

* రూ. 2 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ కవర్

* డైనింగ్, షాపింగ్, ప్రయాణం, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, హెల్త్ వంటి వాటికి వినియోగించుకున్నప్పుడు ఆఫర్లు లభిస్తాయి.

* సొంత బ్యాంక్ ఏటీఎం లలో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు, ఇతర బ్యాంకు ఏటీఎం లలో 5 ఉచిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

మీ ఖాతా వివరాలు..

మీ ఖాతా వివరాలు..

* మీ ఖాతా సెట్ అప్ అయిన తర్వాత బ్యాంకు మీకు సంభందించిన కస్టమర్ ఐడీ, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సీ కోడ్ వంటి వివరాలను మీ ఇమెయిల్ కు మొబైల్ కు పంపిస్తారు. మీకు వెల్ కమ్ కిట్ కూడా అందుతుంది.

* ఈ ఖాతాలో మీరు గరిష్టంగా రూ. లక్ష డిపాజిట్ చేయవచ్చు. ఇంతకు మించిన క్రెడిట్స్ ను అనుమతించే అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో బ్యాంకు వద్ద పర్సనల్ గా వెరిఫికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

వీటికి సంభందించిన మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్ సైట్ లేదా బ్యాంక్ శాఖ లేదా కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

English summary

IDFC FIRST BANK exciting benefits with new savings account

IDFC FIRST BANK announced new offers on new savings accoount. To celebrate its First Anniversary bank will plant a Sapling for every new Savings Account you open. The bank will do this From 18th December 2019 to 26 th January 2020
Story first published: Thursday, December 19, 2019, 18:48 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more