పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్: ఆన్లైన్లో డబ్బులు ఇలా జమ చేయండి
రికరింగ్ డిపాజిట్ (RD) ఒక పాపులర్ సేవింగ్స్ స్కీం. ఆర్డీ సహా స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేటును జనవరి-మార్చి త్రైమాసికానికి గాను ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) యాప్ ద్వారా కూడా మీరు ఆన్ లైన్లో పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్లో జమ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మీ నెలవారీ ఆర్డీ అమౌంట్ మొత్తాన్ని ఆర్డీ అకౌంట్లోకి జమ చేయవచ్చు.
దక్షిణాదిన రియాల్టీ అదుర్స్, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు జంప్

IPPB ద్వారా పోస్టాఫీస్ ఆర్డీ ఖాతాలోకి ఇలా జమ చేయండి
- మీ బ్యాంకు అకౌంట్ నుండి డబ్బును IPPB అకౌంట్లోకి యాడ్ చేయాలి.
- DOP ఉత్పత్తులోకి వెళ్లాలి. అందులో రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవాలి.
- మీ RD అకౌంట్ నెంబర్, DOP కస్టమర్ ఐడీని ఎంటర్ చేయాలి.
- ఇన్స్టాల్మెంట్ కాలపరిమితి, అమౌంట్ ఎంచుకోవాలి.
- IPPB మొబైల్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ పేమెంట్ ట్రాన్సుఫర్‌ను IPPB నోటిఫై చేస్తుంది.
- ఇండియా పోస్ట్ అందించి వివిధ రకాల పెట్టుబడుల ఆప్షన్స్‌కు సంబంధించిన మనీ మొత్తాలను IPPB బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.

ఈ యాప్ ద్వారా
IPPBతో ఆన్లైన్ చెల్లింపులు సులభంగా మారుతోంది. ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (IPPB) పేరుతో ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ యాప్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా నెలవారీ రికరింగ్ డిపాజిట్స్‌ను పోస్టాఫీస్‌కు వెళ్లకుండానే. గంటల తరబడి వరుసలో నిలబడే ఇబ్బంది లేకుండానే చెల్లింపులు జరపవచ్చు. కరోనా నేపథ్యంలో బ్యాంకులు, వివిధ సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీస్ వరకు వెళ్లకుండా నెలవారీ RD మొత్తాలు చెల్లించవచ్చు.

వడ్డీ రేట్లు యథాతథం
పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం జనవరి - మార్చి త్రైమాసికంలో మార్చలేదు. మార్చి 31తో ముగిసే 2020-21 నాలుగో త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మూడో త్రైమాసికంలో నోటిఫై చేసినవే ఉంటాయని సంబంధిత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.