For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto regulation bill: అమెరికా, ఇజ్రాయెల్, థాయ్‌లాండ్ సహా ఆ దేశాల్లో ఎలా?

|

క్రిప్టోకరెన్సీ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 'క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021'ని తీసుకు రానున్న నేపథ్యంలో ఈ అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. నవంబర్ 29వ తేదీ నుండి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో క్రిప్టో సహా 26 బిల్లులను లోకసభలో పెట్టనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ప్రేమ్ వర్క్‌ను రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి.

అదే సమయంలో అన్ని ప్రయివేటు క్రిప్టోలను దేశంలో నిషేధించడం లేదా నియంత్రించడానికి సంబంధించి బిల్లులో ఉండవచ్చు. అయితే క్రిప్టో అంతర్లీన టెక్నాలజీని, దాని ఉపయోగాలను ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు.

కోట్లాది మంది ఇన్వెస్టర్లు

కోట్లాది మంది ఇన్వెస్టర్లు

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. వ్యాల్యూలో తీవ్ర హెచ్చుతగ్గులు, నష్టభయం ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ పెట్టుబడులపై భారీ రిటర్న్స్ ఉండటంతో చాలామంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన దేశంలో కోట్లాదిమంది ఇన్వెస్టర్లు దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన క్రిప్టోలపై పెట్టుబడులు పెట్టారని అంచనా. క్రిప్టోపై కేవలం నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోను ఆసక్తి కనిపిస్తోంది. మనదేశంలో పదిహేను క్రిప్టో ఎక్స్చేంజీలు ఉన్నాయి.

పది కోట్ల మందికి పైగా ఇన్వెస్టర్లు క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. అమెరికా(2.7 కోట్లు), రష్యా(1.7 కోట్లు), నైజీరియా(1.3 కోట్లు) తర్వాత క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. వజీర్ఎక్స్(83 లక్షల ట్రేడింగ్ ఖాతాలు), కాయిన్ స్పిచ్ కుబేర్ (1.1 కోట్ల ట్రేడింగ్ ఖాతాలు) వంటి క్రిప్టోలు ఉన్నాయి.

క్రిప్టోలపై భిన్నంగా వివిధ దేశాలు

క్రిప్టోలపై భిన్నంగా వివిధ దేశాలు

క్రిప్టో పైన వివిధ దేశాలు భిన్న ఆలోచనలతో ఉన్నాయి. ఉదాహరణకు ఎల్-సాల్వేడార్ బిట్ కాయిన్‌ను చట్టబద్ద కరెన్సీగా గుర్తించింది. అదే సమయంలో చైనా నిషేధించింది. క్రిప్టో కరెన్సీలు, సర్వీస్ ప్రొవైడర్లపై ఉక్కుపాదం మోపింది. భారత్ వంటి దేశాలు మధ్యేమార్గంగా నడుస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యూరోపియిన్ యూనియన్ దేశాలు రెగ్యులేటర్స్ పైన పని చేస్తోంది.

ఏ దేశంలో ఎలా?

ఏ దేశంలో ఎలా?

- ఇజ్రాయెల్ సెక్యూరిటీ రెగ్యులేటర్ క్రిప్టో కరెన్సీని సెక్యూరిటీ సబ్జెక్ట్ అని తీర్పునిచ్చింది. ఇజ్రాయెల్ ట్యాక్స్ అథారిటీ క్రిప్టో కరెన్సీని ఆస్తిగా నిర్వచిస్తోంది. మూలధన లాభాలపై 25 శాతం పన్ను ఉంది.

- జర్మనీలో ఫైనాన్షియల్ సూపర్‌వైజరీ అథారిటీ వర్చువల్ కరెన్సీని యూనిట్ ఆఫ్ అకౌంట్‌గా గుర్తించడంతో ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌గా ఉన్నాయి. బిట్ కాయిన్‌ను బుండెస్ బ్యాంకు క్రిప్టో టోకెన్‌గా పరిగణిస్తుంది. అయితే సాధారణ కరెన్సీలా పని చేయదు. అయితే జర్మన్ ఫెడరల్ ఫైనాన్షియల్ సూపర్వైజరీ అథారిటీ లైసెన్స్ పొందిన ఎక్స్చేంజీలు, కస్టోడియన్స్ ద్వారా పౌరులు, చట్టపరమైన సంస్థలు క్రిప్టో సెట్స్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

- యునెటైడె కింగ్‌డమ్ విషయానికి వస్తే, మెజస్టీ రెవెన్యూ అండ్ కస్టమ్స్ క్రిప్టోను అసెట్‌గా లేదా డబ్బుగా పరిగణించనప్పటికీ క్రిప్టోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాబట్టి దీనిని ఎలాంటి ఇతర పెట్టుబడి విధానంతో లేదా చెల్లింపులతో పోల్చలేం.

- అమెరికాలో క్రిప్టోకు వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు నిర్వచనాలు, నిబంధనలు కలిగి ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వం క్రిప్టోను చట్టపరమైన టెండర్‌గా గుర్తించనప్పటికీ రాష్ట్రాలు జారీ చేసిన నిర్వచనాలపై ఆధారపడి ఉంది.

- థాయ్‌లాండ్‌లో డిజిటల్ అసెట్ బిజినెస్‌లు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

English summary

How are cryptos regulated in countries around the world?

The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021, listed for introduction in Parliament’s Winter Session starting November 29, seeks to create a facilitative framework for the creation of the official digital currency to be issued by the Reserve Bank of India.
Story first published: Thursday, November 25, 2021, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X