EPFO గుడ్‌న్యూస్, లైఫ్ సర్టిఫికెట్ గడువు పొడిగింపు: డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఇలా...
పెన్షన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్ పత్ర-JPP) సమర్పించే తుది గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనజైషన్(EPFO)వో తెలిపింది. తాజాగా పెంచిన గడువులోగా ఎప్పుడైనా ఇవ్వవచ్చునని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా JPP అందచేయలేకపోయిన దాదాపు 35 లక్షల పెన్షన్‌దారులకు ఇది ఉపకరిస్తుంది. నవంబర్ 30వ తేదీలోగా JPP మర్పించని వారికి ఫిబ్రవర వరకు పెన్షన్ యథాతథంగా అందుతుందని కూడా తెలిపింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1995 ప్రకారం పెన్షన్ పొందే వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. JPP ఏడాది పాటు అమల్లో ఉంటుంది.
పన్ను ఎగవేతలు, దుర్వినియోగం.. భారత్‌కు రూ.75,000 కోట్ల నష్టం

ఎప్పుడైనా సమర్పించవచ్చు...
'కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఈ వైరస్ వల్ల వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లైఫ్ సర్టిఫికెట్-JPP సమర్పించే గడువును ఫిబ్రవరి 28, 2021 వరకు ఈపీఎఫ్ఓ పొడిగించింది. ఈపీఎస్ 1995 పెన్షన్ నిబంధన ప్రకారం ఫిబ్రవరి 28, 2021లోపు ఎప్పుడైనా సర్టిఫికెట్ సమర్పించవచ్చు' అని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పుడు దీనిని మరో మూడు నెలలు పొడిగించారు.

ఇక్కడ సమర్పించవచ్చు
లైఫ్ సర్టిఫికెట్-JPP సమర్పణకు వివిధ మార్గాలు ఉన్నాయి. 3.65 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు(CSC) 3.65 లక్షలు, పెన్షన్ పంపిణీ బ్యాంకు బ్రాంచీలు, 1.36 లక్షల పోస్టాఫీస్‌లు, 1.90 లక్షల పోస్ట్‌మెన్‌లతో కూడిన పోస్టల్ నెట్ వర్క్, పోస్టల్ డిపార్టుమెంట్ పరిధిలోని గ్రామీన్ డాక్ సేవక్ సహా వివిధ మార్గాల్లో వీటిని సమర్పించవచ్చు.

డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా సమర్పణ
- జీవన్ ప్రమాణ్-JPPను డోర్ స్టెప్ ద్వారా సమర్పించేందుకు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- సర్టిఫికెట్ సమర్పణ కోసం మీ బ్యాంకును ఎంచుకోవాలి.
- మీ పెన్షన్ ఖాతాను వెరిఫై చేసుకోవాలి.
- డోర్ స్టెప్ ఛార్జీలను చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి.
- నామమాత్రపు ఛార్జీలు చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు.
- మీ అభ్యర్థన సమర్పణ తర్వాత మీ ఏజెంట్ పేరు మీకు ఎస్సెమ్మెస్ ద్వారా వస్తుంది.
- బ్యాంకు ఏజెంట్ మీరు ఇచ్చిన చిరునామాకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు.