For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget Terminology: గెట్ రెడీ.. బడ్జెట్‌ను ఈజీగా అర్థం చేసుకోవచ్చు.. అంతు చిక్కని పదాలకు అర్థాలివే..

|

బడ్జెట్ అంటే.. వేటి ధరలు పెరిగాయి? ఏవేవి తగ్గాయి? లేదా మన ప్రాంతానికి ఎన్ని నిధులిచ్చారు? అంతవరకే చూసి వదిలేస్తాం. ఎందుకంటే చదువురాని వాళ్లతోపాటు చాలా మంది మనలాంటి సామాన్యుల కూడా ఇదొక బ్రహ్మపదార్థం. డైలీ రొటీన్ పదాలు ఒక్కటీ వినిపించకుండా సాగిపోయే ఆర్థిక మంత్రిగారి బడ్జెట్ ప్రసంగం మనందరికీ అంతుపట్టని వ్యవహారం. అయితే దీనికో ఉపాయముంది. అతి చిన్న కసరత్తుతో బడ్జెట్ లోతుపాతుల్ని పసిగట్టగలిగే మార్గం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే.. కేవలం రెండు డజన్ల పదాలకు అర్థాలు తెలుసుకోవడం ద్వారా బడ్జెట్ సమాచారాన్నంతా మీరు గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నమాట. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో.. బడ్జెట్ భాషలోని ఆ పదాలేంటో ఓ సారి చదివేద్దాం..

ఆర్థిక సంవత్సరం (Fiscal year): సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరాన్ని మనం 'ఫినాన్షియల్ ఇయర్'గా పలుకుతాం. కానీ బడ్జెట్ పరిభాషలో మాత్రం దాన్ని ఫిస్కల్ ఇయర్ అని చదువుతారు. అంటే, ఏడాది కాలానికి సంబంధించిన అకౌంటింగ్ ఇంకా బడ్జెట్ ప్రయోజనాలు కలిసి ఉండేదే ఫిస్కల్ ఇయర్. ఇండియా, జపాన్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలై మార్చి 31తో ముగుస్తుంది. అదే ఆస్ట్రేలియాలోనైతే జులై 1న మొదలై జూన్ 30తో ముగుస్తుంది.

Budget Terminology: గెట్ రెడీ.. బడ్జెట్‌ను ఈజీగా అర్థం

వార్షిక ఆర్థిక నివేదిక (Annual Financial Statement): 'బడ్జెట్'అని మనం దేన్నైతే సింపుల్ గా పలుకుతామో దాని అసలు వాక్యం 'వార్షిక ఆర్థిక నివేదిక' లేదా వార్షిక బడ్జెట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరానికి.. అంచనాలతో కూడిన రసీదులు, ఖర్చుల ప్రకటనను పార్లమెంట్ లేదా అసెంబ్లీకి తప్పనిసరిగా తెలియజేయాల్సిఉంటుంది.

ఆర్థిక బిల్లు (Finance Bill): అంటే పన్ను(ట్యాక్స్)లకు సంబంధించిన బిల్లులన్నమాట. రానున్న ఏడాదికి అవసరమైన నిధుల కోసం కొత్తగా వేయబోయే పన్నులు లేదా అప్పటికే ఉన్న పన్నుల శాతంలో పెంపు/ తగ్గింపు లేదా పన్నుల విధానాన్ని యథావిధిగా కొనసాగించడానికి ఉద్దేశించే బిల్లుల్ని ఫినాన్స్ బిల్లులుగా పేర్కొంటారు. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ఈ బిల్లు చట్టబద్ధతను కల్పిస్తుంది. పార్లమెంట్ రూల్స్ ప్రకారం.. ఒక ఫినాన్స్ బిల్లును సభలో ప్రవేశపెడితే 75 రోజుల్లోగా ఆమోదించాల్సిఉంటుంది. దీనికో ఉదాహరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ). ఆర్థిక బిల్లుగా ఆమోదం పొందిన తర్వాతే జీఎస్టీ చట్టంగా మారడం తెలిసిందే.

వినియోగ బిల్లు (Appropriation Bill): బడ్జెట్ కు సంబంధించి ఇదొక కీలకమైన బిల్లు. ఎందుకంటే ఇది లేకుండా ఏ ప్రభుత్వం కూడా సంఘటిత నిధి నుంచి డబ్బులు వినియోగించలేదు. అధికార శాసనంగా కొనసాగుతోన్న వినియోగ బిల్లు ఆమోదం తర్వాతే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది.

కన్సాలిడేటడ్ ఫండ్ లేదా ఏకీకృత నిధి (Consolidated Fund): ప్రభుత్వ ఆదాయం, వ్యయం, అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చే ఉండేదే కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా ఏకీకృత నిధి. బడ్జెట్ ప్రతిపాదనలో పేర్కొనే ప్రణాళికాబద్ధమైన ఖర్చుల కోసం.. పార్లమెంటు అనుమతితో ఈ నిధిని ఉపయోగించుకుంటారు.

కంటింజెన్సీ ఫండ్ లేదా ఆకస్మిక నిధి (Contingency Fund): అత్యవసర పరిస్థితుల కోసం నిలువ ఉంచేదానినే ఆకస్మిక నిధి లేదా కంటింజెన్సీ ఫండ్ అటారు. భారత రాష్ట్రపతి ఆధీనంలో ఉండే ఈ ఆకస్మిక నిధిని పార్లమెంట్ ఆమోదంతో మాత్రమే వాడుకోవాలి. ఆకస్మిక నిధి నుంచి ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే (కన్సాలిడేటడ్ ఫండ్ లేదా ఏకీకృత నిధి నుంచి) రీఫండ్ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్ లేదా ప్రజల ఖాతా (Public Account): అంటే ప్రజలు ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులన్నమాట. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్), చిన్నమొత్తాల పొదుపు తదితర అంశాల్లో ప్రభుత్వమే ఒక బ్యాంకులా వ్యవహరిస్తుంది. పబ్లిక్ అకౌంట్ లోని డబ్బులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది కాబట్టి దీన్నుంచి నిధులు తీసుకొని వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఆర్థిక విధానం (Fiscal Policy): ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిచేందుకు పన్నుల వసూళ్లు, ఖర్చులు ఎలా ఉండాలో ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల సమాహారాన్నే ఫిస్కల్ పాలసీ లేదా ద్రవ్య విధానం అంటారు.

ద్రవ్య విధానం (Monetary Policy): ఆర్థిక వ్యవస్థ సజావుగా నడిందుకు అవసరమైన డబ్బు(ద్రవ్య) సరఫరాతోపాటు వడ్డీ రేట్లకు సంబంధించి ప్రభుత్వం రూపొందించే ప్రణాళికనే మానిటరీ పాలసీ లేదా ద్రవ్య విధానం అంటారు.

ప్రోత్సాహక పన్ను (Perquisite tax): సంస్థలో ఒక ఉద్యోగికి జీతం కాకుండా ఇతర ప్రయోజనాలు లేదా ప్రోత్సాహకాలపై యజమాని చెల్లించాల్సిన పన్నులనే ప్రోత్సాహక పన్నులుగా వ్యవహరిస్తారు.

సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (Securities Transaction Tax) : వాటాదారుడు తన ఈక్వీటి వాటలను, డెరెవేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఇతర సెక్యూరిటీనలు అమ్మినప్పుడు దానికి పన్ను చెల్లించాలి. దానిని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు. సెక్యూరిటీ ధరపై నామమాత్రపు శాతంతో పన్ను విధిస్తారు.

కార్పోరేట్ ట్యాక్స్ (Corporate Tax) దేశంలో కార్పోరేట్ కంపెనీలు నిర్వహించే కార్యకలాపాల ద్వారా ఆర్జించే ఆదాయంపై పన్ను చెల్లించాలి.

ఎడ్యుకేషన్ సెస్ (Education Cess): కేంద్ర ప్రభుత్వం సమకూర్చే ఎడ్యుకేషన్ ఫండ్‌కు కోసం పలు సేవలపై పన్ను ద్వారా కొంత మొత్తాన్ని సేకరిస్తారు. దీనిని ఎడ్యుకేషన్ సెస్ అంటారు.

సర్‌చార్జీ (Surcharge): అత్యధిక ఆదాయం ఆర్జించినప్పుడు ఉదాహరణకు కోటికిపైగా ఆదాయం ఉన్నప్పుడు వాటిపై అదనంగా పన్ను విధిస్తారు. దానిని సర్‌చార్జి అంటారు.

స్వచ్ఛ భారత్ సెస్ (Swacch Bharat Cess): పన్ను విధింపుకు అర్హతలున్న అన్ని వస్తు సేవలకు ఈ పన్ను వర్తిస్తుంది. భారత దేశాన్ని క్లీన్‌గా ఉంచడం కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) కోసం ఈ పన్నును సేకరిస్తారు.

పన్ను రహిత ఆదాయం (Non Tax Revenue) ప్రజల అవసరాల కోసం ఎలక్ట్రిసిటి, రైల్వే లాంటి పలు సేవల అందించడం ద్వారా భారత ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఇలాంటి మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పన్ను రహిత ఆదాయం లేదా నాన్ టాక్స్ రెవెన్యూ అని అంటారు. ప్రభుత్వం ఇచ్చే లోన్లపై విధించే వడ్డీ ప్రధానంగా ఈ కేటగిరి కిందకు వస్తుంది.

పన్ను మదింపు (Tax abatement): ఓ ప్రత్యేకమైన కాలానికి పన్నులను మదిస్తారు లేదా మినహాయింపు ఇస్తారు. ప్రభుత్వాలు చేపట్టే మూలధన వ్యయం లాంటి కొన్నింటిలో పెట్టుబడులు పెట్టడం లాంటి ప్రమోట్ చేయడానికి ఇలాంటి పన్నులు అమలు చేస్తారు.

ఆర్థిక లోటు (Fiscal deficit): ప్రభుత్వ వ్యయాలు ఆదాయం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఏర్పడుతుంది. అప్పు ద్వారా డబ్బును తెచ్చుకోనే విషయంలో దీనికి మినహాయింపు ఉంటుంది.

ప్రైమరి లోటు (Primary deficit): వడ్డీ చెల్లింపు అనంతరం ఆర్థిక లోటును ప్రైమరీ లోటు అంటారు.

కరెంట్ అకౌంట్ లోటు (Current account deficit): దేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటును కరెంట్ అకౌంట్ లోటు అంటారు.

రెవెన్యూ లోటు (Revenue deficit): ప్రభుత్వానికి సంబంధించి కేటాయించిన బడ్జెట్ చెల్లింపుల కంటే వాస్తవ చెల్లింపులు ఉండటాన్ని రెవెన్యూ లోటు అంటారు.

ప్రమాణిక తగ్గింపులు లేదా స్టాండర్ డిడక్షన్ (Standard Deduction): ఒక సంస్థలో కొన్ని హోదాల్లో విధులు నిర్వహించే వ్యక్తుల జీతంపై పన్ను విధింపు ప్రక్రియలో స్థిరమైన తగ్గింపులు ఇవ్వడాన్ని ప్రమాణిక తగ్గింపులు అంటారు.

NAV: నికర వార్షిక విలువ

సబ్సిడీ (Subvention): వృద్ధి సాధించడానికి పరిశ్రమలకు, సాధారణ ప్రజలకు వాస్తవ ధర కంటే తగ్గింపు రూపంలో ఇచ్చే మొత్తాలను సబ్సిడీ అంటారు.

ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ (Off Budget financing) బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఆమోదించని ఎలాంటి నిధులనైనా ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్ అంటారు.

లోటు వ్యయం (Deficit Spending) ప్రభుత్వాలు ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడాన్ని లోటు వ్యయం అంటారు.

English summary

Budget Terminology: Easy to understand

Financial terms we hear on the day of Budget aren't really words used in day-to-day conversations. Here is a list of few relevant terms that you may have heard during the Union Budget presentation or related news. It is always good to be informed.
Story first published: Tuesday, January 21, 2020, 21:03 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more