For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ జాబ్ మార్కెట్ మారుతోంది, మీరూ మారండి! సర్వేలో కీలక అంశాలు

|

న్యూఢిల్లీ: ఐటీ జాబ్ మార్కెట్లో చాలా మార్పులు వస్తున్నాయని, తమ కంపెనీ పరిస్థితులకు అనుగుణంగా ఉండేవారికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. అలాగే తక్కువ అనుభవం కలిగిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయట. 52 శాతం కంపెనీలు రానున్న ఆరు నెలల్లో ఐటీ ప్రొఫెషనల్స్‌ను తీసుకునేందుకు సిద్ధంగా లేవట. ఈ మేరకు ఎక్స్‌పెరిస్ ఐటీ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ సంస్థల్లో నిపుణుల జోరి తగ్గిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే వచ్చే రెండో అర్థ సంవత్సరంలో నియామకాలు 5 శాతం తగ్గుతాయని తేలింది. కొత్త నైపుణ్యాలకు డిమాండ్ తగ్గడంతో ఐటి నియామకాల తీరు మారనుందని పేర్కొంది. ఈ మేరకు సర్వేలోని కొన్ని అంశాలు...

వారికి రూ.4,000 ఇచ్చి, మాకు రూ.400 ఇస్తున్నారు: అమిత్ షా

5 శాతం తగ్గనున్న ఐటీ నియామకాలు

5 శాతం తగ్గనున్న ఐటీ నియామకాలు

2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబర్ నెలలో కొత్తగా నియామకాలు కేవలం 53.41 శాతం మాత్రమేనని, 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు ఇది 47.54 శాతానికి పడిపోనుంది. ఐటీ సంస్థల్లో నియామకాలు 21.61 శాతం ఉండవచ్చునని, ఇతర సంస్థల్లో ఐటీ నిపుణుల నియామకాలు 13 శాతం ఉండవచ్చు. తాజాగా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారితో పాటు అయిదేళ్ల లోపు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్కువ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి.

విశాఖపట్నం సహా మెట్రో నగరాల్లో ఉద్యోగాలు..

విశాఖపట్నం సహా మెట్రో నగరాల్లో ఉద్యోగాలు..

మెట్రో నగరాల్లోనే ఐటీ నిపుణులకు అధికంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. విశాఖపట్నం, జయపుర, చండీగడ్, కోయంబత్తూరు, అహ్మదాబాద్, భువనేశ్వర్ వంటి టైర్ 2 నగరాల్లో అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాంతం, అనుభవం, ఐటీ నైపుణ్యాలు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి.

మూడేళ్ల కనిష్టానికి నియామకాలు

మూడేళ్ల కనిష్టానికి నియామకాలు

ఐటీ కంపెనీల్లో, నాన్ ఐటీ కంపెనీల్లో ఐటీ ప్రొఫెషనల్స్ నియామకాలు మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. సర్వేలో పాల్గొన్న సగానికి పైగా కంపెనీలు 2020 మొదటి క్వార్టర్ ముగిసే వరకు ఎలాంటి నియామకాలు ఉండవని వెల్లడించాయి. 52 శాతం కంపెనీలు వచ్చే ఆరు నెలలో నియామకాలు ఉండవని తెలిపాయి. 2017 తొలి క్వార్టర్ తర్వాత మళ్లీ ఇప్పుడు 50 శాతం కంటే దిగువకు నియామకాలు పడిపోనున్నాయి.

పనిలో ఆసక్తి, కంపెనీకి తగిన విధంగా వ్యవహరించాలి..

పనిలో ఆసక్తి, కంపెనీకి తగిన విధంగా వ్యవహరించాలి..

పని వాతావరణం మారిపోతోందని, ఇప్పటికే సాంకేతిక నైపుణ్యాలే ఉపాధికి కీలకం అని, దీంతో పాటు కొత్తదనాన్ని స్వీకరించడం, భిన్నరంగాలకు అనుసంధఆనించే ఆలోచనలు, నాయకత్వ నైపుణ్యాలు, సోషల్ ఇంటెలిజెన్స్ కలిగిన వారి కోసం కంపెనీ యాజమాన్యాలు వెతుకుతున్నాయని ఎక్స్‌పెరిస్ ఐటీ మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మన్‌ప్రీత్ సింగ్ అన్నారు. పనిలో ఆసక్తి చూపే వారిని, కంపెనీకి తగిన విధంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

కృత్రిమ మేధ, బిగ్ డేటాలో ఉద్యోగాలు..

కృత్రిమ మేధ, బిగ్ డేటాలో ఉద్యోగాలు..

2021 నాటికి కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వారు దొరకక భారీగా కొరత ఏర్పడుతుందని, కృత్రిమ మేధ, బిగ్ డేటాలోనే 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయని మన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐటీ, రిటైల్, తయారీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోని 509 సంస్థల నుంచి అభిప్రాయం సేకరించి నివేదిక రూపొందించారు.

వీటిల్లో డిమాండ్ ఎక్కువ

వీటిల్లో డిమాండ్ ఎక్కువ

ఎడ్యుటెక్, ఫుడ్ టెక్, హెల్త్ టెక్, ఫిన్ టెక్, అగ్రికెట్, ఈ-కామర్స్‌లలో ఆయా రంగాలు బలోపేతం చేస్తున్నాయని (మరిన్ని ఉద్యోగ అవకాశాలు) CIEL HR సర్వీసెస్ సీఈవో అండ్ డైరెక్టర్ ఆదిత్య నారాయణ్ మిశ్రా చెప్పారు. సాఫ్టువేర్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, అప్లికేషన్ మెయింటెనెన్స్ సర్వీస్‌లకు డిమాండ్ అన్నింటి కంటే ఎక్కువగా ఉందని, ఆ తర్వాత క్లౌండ్ కంప్యూటింగ్ ఉన్నట్లు సర్వేలో తేలింది.

English summary

Hiring Intention Of Indian IT Employers Weakens

Corporate India's hiring intention for IT professionals for the next two quarters shows a dip of 5 percentage points from what it was in the last six months, as demand for talent with new skill sets for the future is reshaping the tech job market, says a report.
Story first published: Wednesday, October 23, 2019, 13:23 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more