For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

|

న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. సులభతర పెట్టుబడుల మార్గాల్లో మొబైల్ యాప్ ఒకటి. గత కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక మాంద్య భయం, అమెరికా-చైనా ట్రేడ్ వార్ భయం కారణంగా పసిడి ధర భారీగా పెరుగుతూ వచ్చింది. రెండు రోజులుగా బంగారం ధర కుదుటపడుతోంది. ఇటీవల బంగారం ధర దాదాపు రూ.1400 తగ్గింది. అయినప్పటికీ బంగారంపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనమని చాలామంది భావిస్తారు. ఈ ఏడాది టెక్ దిగ్గజం గూగుల్ యూపీఐ యాప్ గూగుల్ పే(అంతకుముందు తేజ్) ద్వారా బంగారం కొనే వెసులుబాటును కల్పించింది.

గత వారం కంటే రూ.1300 తగ్గిన బంగారం ధరలు

ఎలా పని చేస్తుంది?

ఎలా పని చేస్తుంది?

గూగుల్ పే ద్వారా 99.99 శాతం నాణ్యత కలిగిన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. MMTC-PAMP ద్వారా కొనుగోలు సౌకర్యాన్ని కల్పించింది. గూగుల్ పే యాప్ ద్వారా MMTC-PAMP ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. MMTC-PAMP ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 2008లో ప్రారంభమైంది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన MMTC, స్విట్జర్లాండుకు చెందిన PAMP జాయింట్ వెంచరే MMTC-PAMP. ఇది భారత అతిపెద్ద బులియన్ ట్రేడర్.

- గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ (GAP) మీరు బంగారాన్ని విక్రయించే వరకు భౌతికరూపంలో సంరక్షించబడుతుంది.

- MMTC-PAMP ద్వారా కొనుగోలు చేస్తే మీ బంగారం సురక్షితంగా నిల్వ చేయబడిందని నిర్ధారణ చేసేందుకు బీమా చేయబడుతుంది.

ఇవి తెలుసుకోండి... లక్షణాలు

ఇవి తెలుసుకోండి... లక్షణాలు

- గూగుల్ పే అకౌంట్‌లో Gold Vault ఆప్షన్ ఉంటుంది. ఇది GAP అకౌంట్ డిజిటల్ రిప్రజంటేషన్‌ను చూపిస్తుంది.

- మీరు మీ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మీ అన్ని ట్రాన్సాక్షన్స్‌ కూడా చూసుకోవచ్చు.

- యాప్‌లో కనిపించే ధరకు మీరు MMTC-PAMP ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

- కనీసం కొనుగోలు రూ.1

- రూ.50,000 అంతకుమించి కొనుగోలు చేయాలంటే GAPలోని KYC నిబంధనలు ఫాలో కావాలి.

- యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఫోన్ నెంబర్‌తో గోల్డ్ వాల్ట్ లింక్ చేయబడుతుంది. మీరు ఫోన్ నెంబర్ మారిస్తే కనుక మీ కొత్త నెంబర్ యాక్సెస్ కోసం గుర్తింపును ధృవీకరించవలసి ఉంటుంది.

- ఏదైనా అకౌంట్ అనుమానాస్పదంగా కనిపిస్తే ఆటోమేటిక్‌గా సైనవుట్ అవుతుంది.

- కొనుగోలు చేసిన బంగారాన్ని మీ ఇంటికి డెలివర్ చేసే ఆఫ్షన్ కూడా మీరు ఎంచుకోవచ్చు.

- మీ ఖజానాలోని బంగారానికి వారసుడిని చట్టపరంగా మీరు ఎంచుకోవచ్చు. వారసుడిని గుర్తించిన తర్వాత MMTC-PAMP మీ ఖాతాను క్లోజ్ చేసి ఆ బంగారాన్ని వారసుడికి అందిస్తుంది.

గూగుల్ పే ద్వారా బంగారాన్ని ఎలా కొనుగోలు చేయవచ్చు?

గూగుల్ పే ద్వారా బంగారాన్ని ఎలా కొనుగోలు చేయవచ్చు?

- గూగుల్ పే యాప్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో లేకుంటే ప్లేస్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవాలి. యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.

- ఆ తర్వాత News పైన క్లిక్ చేసి Gold Vault సెర్చ్ చేయాలి.

- Buy ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మీకు ప్రస్తుత ధర కనిపిస్తుంది.

- మీరు ఎంత మొత్తం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో.. ఆ మొత్తాన్ని అక్కడ ఎంటర్ చేయాలి. మీ మొత్తానికి ఎంత బంగారం వస్తుందో అక్కడ డిస్‌ప్లే అవుతుంది.

- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు కొనుగోలు ప్రారంభించిన సమయం నుంచి 5 నిమిషాలు ఆ ధర ఉంటుంది.

- డిస్‌ప్లే అయిన మొత్తంలో ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ట్యాక్స్‌లు వేరుగా ఉండవచ్చు. జీపీఎస్ ద్వారా గూగుల్ పే మీ లొకేషన్‌ను గుర్తిస్తుంది.

- మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

- మీ పేమెంట్ సక్సెస్ అయిన కొద్ది నిమిషాలకు మీ వాల్డ్‌లో బంగారం కనిపిస్తుంది.

- పేమెంట్ ఫెయిల్ అయితే కనుక 3 బిజినెస్ డేస్‌లలో మీ మొత్తం తిరిగి రీఫండ్ అవుతుంది.

- మరో విషయం గుర్తుంచుకోండి... కొనుగోలు చేసిన తర్వాత మీరు క్యాన్సిల్ చేయలేరు. కానీ MMTC-PAMP ద్వారా మీరు విక్రయించవచ్చు.

గూగుల్ పే ద్వారా బంగారాన్ని ఎలా విక్రయించాలి?

గూగుల్ పే ద్వారా బంగారాన్ని ఎలా విక్రయించాలి?

- గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి.

- News పైన క్లిక్ చేయాలి. Gold Vault సెర్చ్ చేయాలి

- Sell ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ప్రస్తుత బంగారం ధర మీకు డిస్ ప్లే అవుతుంది.

- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు విక్రయం ప్రారంభించిన సమయం నుంచి 5 నిమిషాలు ఆ ధర ఉంటుంది.

- విక్రయాల పైన ట్యాక్సెస్ ఉండవు. కాబట్టి డిస్ ప్లే అయిన ధరలో ట్యాక్స్‌లు కలిపి కనిపించవు.

- ఎంతమొత్తం బంగారం విక్రయించాలనుకుంటున్నారో.. ఆ ధరను ఎంటర్ చేయాలి. కనీస సేల్ అమౌంట్ రూ.1

- మీ వాల్ట్‌లోని బంగారాన్ని ఒకేసారి అమ్మవచ్చు. కానీ రూ.2 లక్షల వరకు మాత్రమే పరిమితం.

- మీ బంగారం విక్రయం విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్‌లో కొద్ది నిమిషాలకు కనిపిస్తాయి. గూగుల్ పే లింక్ కలిగిన అకౌంట్లో కనిపిస్తాయి.

ఈ వివరాలు ఉంటాయి...

ఈ వివరాలు ఉంటాయి...

గూగుల్ పే ద్వారా పలు వివరాలు తెలుసుకోవచ్చు.

- ట్రాన్సాక్షన్ అమౌంట్.

- ట్రాన్సాక్షన్ స్టేటస్

- యూపీఐ, వెంండర్, గూగుల్ ట్రాన్సాక్షన్స్ ఐడీలు

- TO మరియు From ఈమెయిల్ అడ్రస్‌లు

- ఇన్వాయిస్ నెంబర్.

ట్రాన్సాక్షన్ వివరాలు ఎలా చూడాలి?

ట్రాన్సాక్షన్ వివరాలు ఎలా చూడాలి?

- ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవడానికి మొదట గూగుల్ పే ఓపెన్ చేయాలి.

- Businesses లిస్టులో గోల్డ్ వాలెట్ ఉంటుంది.

- మీకు అవసరైన ట్రాన్సాక్షన్స్ అక్కడ ఉంటాయి.

- ట్రాన్సాక్షన్ బాక్స్ తెరిచి వివరాలు చూడాలి.

- సక్సెస్ అయినా అలాగే కానీ ట్రాన్సాక్షన్స్... అన్ని కూడా అక్కడ ఉంటాయి.

గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తే మీ ఇంటికి ఎలా డెలివర్ అవుతుంది?

గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తే మీ ఇంటికి ఎలా డెలివర్ అవుతుంది?

- గూగుల్ పే ఓపెన్ చేయండి.

- New పైన ట్యాప్ చేసి, Gold Vault సెర్చ్ చేయాలి

- Delivery క్లిక్ చేయండి.

- ఎక్కడికి డెలివరీ కావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Next కు వెళ్లండి.

- బంగారంను సెలక్ట్ చేసుకోని Add to basket ను ఎంచుకోవాలి.

- మీరు బంగారం కొనుగోలు చేసే మొత్తాన్ని పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు add లేదా remove ఆప్షన్ ఎంచుకోండి.

- ఆ తర్వాత చెకౌట్ పైన క్లిక్ చేసి, అడ్రస్ ఎంటర్ చేయాలి.

- ఈ చిరునామాకు డెలివరీ చేయండి అని ట్యాప్ చేయాలి.

- అంతా పూర్తయ్యాక మీ డెలివరీ ఆర్డర్‌ను సమీక్షించుకోవచ్చు. అంతకుముందు పేజీకి వెళ్లి అవసరమైతే ఏవైనా మార్పులు చేసుకోవచ్చు.

- ఆర్డర్‌ను నిర్ధారించేందుకు Pay పైన క్లిక్ చేయాలి.

- పేమెంట్ ఆప్షన్ ఎంచుకొని, Proceed to Pay పైన క్లిక్ చేయాలి.

- మీ బంగారాన్ని ట్రాక్ కూడా చేయవచ్చు.

English summary

How To Buy And Store Gold On Google Pay In India?

Mobile apps are one of the most recent and easiest mediums to add gold to your investment portfolio. With prices on the rise amid concerns of economic slowdown, the yellow metal has caught attention among investors once again.
Story first published: Tuesday, September 10, 2019, 11:32 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more