For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనీ సేవింగ్: ఈ చెడు అలవాట్లను మార్చుకోండి!

|

మనం ఏ అలవాటు చేసుకున్నా అది మనల్ని తీర్చిదిద్దేలా ఉండాలి. జీవితంలో ఎదిగేందుకు వ్యక్తిగత క్రమశిక్షణ ఎంత అవసరమో ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఎక్కువ ఆదా, తక్కువ ఖర్చు, అనవసరమైన అప్పుల నివారణ వంటి మంచి అలవాట్ల ద్వారా ఆర్థికంగా సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగిస్తుంది. పలు చెడు అలవాట్లకు వాయిదా వేయడం వంటివి కూడా ముఖ్య కారణాలు. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఆరు అంకెల బ్యాలెన్స్ చూడటం అసాధారణమేమీ కాదు. ద్రవ్యోల్భణం దాని కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నందున ప్రతి రోజు గడిచేకొద్ది ఆ డబ్బు విలువను కోల్పోతుంది. ఆ డబ్బును కొన్ని క్లిక్స్‌తో లాభదాయకమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు

ఈ అలవాట్లు మార్చుకుంటే మంచిది!

ఈ అలవాట్లు మార్చుకుంటే మంచిది!

సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని నిధులతో ఎలాంటి పని లేకుంటే వాటిని తక్షణమే లిక్విడ్ ఫండ్స్‌లోకి మార్చవచ్చునని చెబుతున్నారు. కేవలం 10 లేదా 15 నిమిషాల్లో రూ.1 లక్ష పెట్టుబడి ద్వారా రూ.4,000 నుంచి రూ.5,000 సంపాదించవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లలో మూలుగుతున్న డబ్బులతో మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కానీ అధిక ఖర్చు, పన్ను ఆదా చేసేందుకు బీమా పాలసీలు కొనుగోలు చేయడం, త్వరిత లేదా ఎక్కువ లాభాల కోసం రిస్కీ స్టాక్స్‌ల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ అలవాట్లు మార్చుకోకుంటే ఆర్థికంగా ఎదురీదవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఎలాంటి రీసెర్చ్ చేయకుండా స్టాక్స్‌ల్లో పెట్టుబడి పెట్టవద్దు

ఎలాంటి రీసెర్చ్ చేయకుండా స్టాక్స్‌ల్లో పెట్టుబడి పెట్టవద్దు

స్టాక్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మార్కెట్లను అర్థం చేసుకోవాలి. స్టాక్స్‌ను విశ్లిషించే సమయం ఉంటేనే మీరు నేరుగా వాటిని కొనుగోలు చేయండి. గత వారం స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. పలు స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగాయి. ఏడాది క్రితం దాదాపు రూ.600గా ట్రేడ్ అయిన DHFL దాదాపు 92 శాతం దిగజారాయి.

మ్యుచువల్ ఫండ్స్ కంటే స్టాక్స్ సేఫ్ అని కాదు...

మ్యుచువల్ ఫండ్స్ కంటే స్టాక్స్ సేఫ్ అని కాదు...

మరోవైపు మ్యుచువల్ ఫండ్స్ అంత తీసిపారేసేలా ఏమీలేవు. సాధారణంగా మార్కెట్స్ పడిపోయినప్పుడు ఈక్విటీ కిందకు పడతాయి. పలు స్టాక్స్ గత ఏడాది కాలంలో పెద్ద మొత్తంలో నష్టపోయాయి. అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్ పెద్దగా నష్టపోలేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూస్తే మ్యుచువల్ ఫండ్స్ కంటే స్టాక్స్ రిస్క్‌గా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని స్టాక్స్ 48 శాతం నుంచి 90 శాతం వరకు నష్టపోతే ఫండ్స్ మాత్రం 6 నుంచి 26 శాతం వరకు మాత్రమే నష్టపోయాయి.

ఒకే రంగం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు

ఒకే రంగం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవద్దు

ఒకే రకమైన ఎక్కువ స్టాక్స్‌లలో లేదా ఒకే కేటగిరీకి చెందిన వివిధ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌ను తగ్గిస్తుందని భావించడం సరికాదు. ఎక్కువ స్టాక్స్‌లలో పెట్టుబడి వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ ఎక్కువగా పెడితే అది ప్రతికూలతగా భావించాలి. మోడర్న్ పోర్ట్‌పోలియో ప్రకారం వివిధ రంగాలకు చెందిన 15-20 స్టాక్స్ నష్ట ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే మరిన్ని స్టాక్స్ కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను తగ్గించదు.

మ్యుచువల్ ఫండ్స్ పరిస్థితి అదే

మ్యుచువల్ ఫండ్స్ పరిస్థితి అదే

మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌కు కూడా ఇది వర్తిస్తుంది. వివిధ కేటగిరీల్లోని ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఒకే కేటగిరీలో ఎక్కువ ఫండ్స్ కొనుగోలు చేయడం మంచిదికాదు. అయితే ఏ ఫండ్స్ మంచివో ఎంచుకొని పెట్టడం మంచిది.

ఎమర్జెన్సీ ఫండ్..

ఎమర్జెన్సీ ఫండ్..

ప్రజల ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఖర్చు పెట్టడంపై ఆసక్తి లేకపోయినా... జీవనశైలి అలా మారిపోయింది. మార్కెట్ కూడా ఖర్చు పెట్టించే విధంగా తయారయింది. ఈ నేపథ్యంలో ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గుతోంది. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ పైన దృష్టి సారించాలి. నెలకు కొంతమొత్తం దాచుకోవడం ద్వారా అత్యవసరమైన సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. అలాగే, స్థిరంగా ఉన్న ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి హఠాత్తుగా సొంత వెంచర్స్ వైపు మరలడం మంచిదికాదు.

ట్యాక్స్ బెనిఫిట్ ఆధారంగా ఇన్సురెన్స్ కొనుగోలు సరికాదు

ట్యాక్స్ బెనిఫిట్ ఆధారంగా ఇన్సురెన్స్ కొనుగోలు సరికాదు

ప్రతి ఏడాది లక్షలాది మంది తమకు అవసరం లేని లేదా ఉపయోగపడని బీమా పథకాలు కొనుగోలు చేస్తారు. వాటికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. పన్ను మినహాయింపు వంటి వాటి కోసం ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసే సమయంలో వాటి వల్ల మూడు రెట్ల ప్రయోజనాలు కూడా కనబడతాయి. సంప్రదాయ ఇన్సురెన్స్ ప్లాన్స్ వల్ల మంచి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ తగినంత బీమా రక్షణను ఇవ్వవు. అలాగే మంచి రాబడిని కూడా ఇవ్వవు. యులిప్స్ కాస్త మెరుగైనప్పటికీ లిక్విడిటీ వంటి సమస్యలు ఉన్నాయి. అంటే కేవలం ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఆధారంగానే ఇన్సురెన్స్ కొనుగోలు సరికాదు.

ఇవి విస్మరించవద్దు..

ఇవి విస్మరించవద్దు..

రుణభారం పెంచుకోవడం సరికాదు. బ్యాంకుల్లో రుణం పెంచుకుంటూ పోతే వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. మీ బ్యాంకు నుంచి వచ్చే క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్స్, ఎస్సెమ్మెస్ అలర్ట్‌లను పట్టించుకోకుండా ఉండవద్దు. ప్రస్తుతం డిజిటల్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డు మోసాలు రోజూ వింటున్నాం. క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు 2017-18లో 50 శాతం పెరిగినట్లు బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ నివేదిక తెలిపింది. ఇందులో 30 శాతం తప్పుడు బిల్లింగ్స్ లేదా డెబిట్స్, 8 శాతం క్రెడిట్ యొక్క తప్పు లేదా లేట్ రిపోర్టింగ్ లేదా నాన్-అప్‌డేషన్ ఫిర్యాదులు.

English summary

Bad money habits that investors should give up

It is said that we first make our habits, and then our habits make us. Save more, spend less and avoid unnecessary debt are a few good habits that can ensure a financially comfortable life. However, people, including those who are financially literate, also pick up bad habits that ultimately disrupt their finances.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more