For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేటి నుండే గ్రామవాలంటీర్ పోస్ట్‌కు దరఖాస్తులు: స్టెప్ బై స్టెప్.. ఇలా అప్లై చేయండి...

|

అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ ఈ రోజు (సోమవారం జూన్ 24)న వెలువడుతుంది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వాలంటీర్లను నియమించకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారం ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ వాలంటీర్ల దరఖాస్తు కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ సిద్ధం చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణాలలో 40వేల మంది వాలంటీర్ల నిమయామకానికి కూడా సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది.

రూ.42 చెల్లిస్తే రూ.1,000: APY గురించి పూర్తి వివరాలు...రూ.42 చెల్లిస్తే రూ.1,000: APY గురించి పూర్తి వివరాలు...

ఇంటర్వ్యూలు

ఇంటర్వ్యూలు

గ్రామవాలంటీర్ల ఎంపిక కోసం ఈ రోజు (సోమవారం జూన్ 24) నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 10న దరఖాస్తులు పరిశీలిస్తారు. జూలై 11 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 1వ తేదీన ఎంపికైన వాలంటీర్లను ప్రకటిస్తారు. ఆగస్ట్ 5-10వ తేదీ వరకు ట్రెయినింగ్ ఉంటుంది. ఆగస్ట్ 15న విధుల్లో చేరవలసి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి ప్రజలకు రేషన్ వంటి ప్రభుత్వ సేవలు ఇంటి ముందుకే రానున్నాయి.

50 కుటుంబాలు లేని గ్రామాల్లో...

50 కుటుంబాలు లేని గ్రామాల్లో...

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,84,498 గ్రామ వాలంటీర్లు అవసరమని గుర్తించారు. నెల్లూరును మినహాయిస్తే మిగతా 12 జిల్లాల్లో 1,70,543 వాలంటీర్లు అవసరం. నెల్లూరుకు కూడా నేడు నోటిఫికేషన్ జారీ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 21వేలకు పైగా వాలంటీర్లు, కడపలో అత్యల్పంగా 9వేలకు పైగా వాలంటీర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. కొన్ని గ్రామాల్లో కనీసం 50 కుటుంబాలు కూడా లేవు. అలాంటి వాటిచోట వాలంటీర్ల నియామకంపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఏయే జిల్లాలో ఎంతమంది వాలంటీర్లు అవసరం?

ఏయే జిల్లాలో ఎంతమంది వాలంటీర్లు అవసరం?

తూర్పు గోదావరిలో 21,600, పశ్చిమ గోదావరిలో 17,881, గుంటూరులో 17,550, కర్నూలులో 16,000, చిత్తూరులో 15,824, ప్రకాశంలో 14,106, అనంతపురంలో 14,007, కృష్ణాలో 14,000, విశాఖపట్నంలో 12,272, శ్రీకాకుళంలో 11,924, విజయనగరంలో 10,012, నెల్లూరులో 10,000, కడపలో 9,322 వాలంటీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వెబ్‌సైట్లో ఫాం ఎలా నింపాలి?

వెబ్‌సైట్లో ఫాం ఎలా నింపాలి?

http://gramavolunteer.ap.gov.in/GRAMAVAPP/VV/index.html

వెబ్‌సైట్లోకి వెళ్లాలి. అయిదు స్టెప్పుల్లో ఫారం పూర్తవుతుంది. తొలుత డిక్లరేషన్ అడుగుతుంది. ఇది తెలుగులో, ఇంగ్లీష్‌లో ఉంటుంది.

- దానిని పూర్తిగా చదివిన తర్వాత 'accept/అంగీకరిస్తున్నాను' పైన క్లిక్ చేయాలి.

- మొదటి దశలో Place(ప్రాంతం), Qualification (విద్యార్హత), Date Of Birth (పుట్టిన తేదీ)(as per SSC Certificate) వివరాలు ఇవ్వాలి.

- ఈ మూడు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు అర్హులు అయితే గ్రామ వాలంటీరుగా దరఖాస్తు చేయుటకు మీరు అర్హులు అని వస్తుంది.

- అప్పుడు OK పైన క్లిక్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

- ఆధార్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది.

- ఆ తర్వాత అక్కడ ఇచ్చిన కాప్యాను టైప్ చేయాలి.

- అనంతరం SEND OTP పైన క్లిక్ చేయండి.

- ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

- Verify OTP పైన క్లిక్ చేయాలి.

- గ్రామ వాలంటీర్‌గా దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ లేకుండా.. మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకున్నవారు పది రోజుల్లోపు ఆధార్‌ను ఇవ్వవలసి ఉంటుంది.

- ఆధార్ లేనివారు మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే Aadhaar not available పైన క్లిక్ చేయాలి.

- అప్పుడు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది.

- Verify OTP పైన క్లిక్ చేయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

- మూడో దశలో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, జెండర్, పుట్టిన తేదీ (ఆధార్ కార్డు ప్రకారం) అడుగుతుంది.

- ఆ తర్వాత మీ ఫోటోను అప్ లోడ్ చేయాలి. ఇమేజ్ సైజ్ 150KB మించరాదు.

- ఆ తర్వాత జిల్లా, గ్రామ పంచాయతీ/వార్డు, వీధి పేరు, మున్సిపాలిటీ లేదా మండలం, డోర్ నెంబర్, పిన్ కోడ్ అడుగుతుంది.

- అనంతరం రెసిడెన్స్ ప్రూఫ్ అప్ లోడ్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, రెసిడెంట్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి ఉండాలి.

- ఇమేజ్ సైజ్ 1MB మించరాదు.

- ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇ-మెయిల్ ఇవ్వాలి.

- Go and Continue పైన క్లిక్ చేయాలి.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

నాలుగో దశలో ఇంటర్మీడియేట్, యూనివర్సిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ గ్రేడ్, పాస్ అయిన సంవత్సరం, వచ్చిన మార్కులు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.

- ఆ తర్వాత Go and Continue పైన క్లిక్ చేయాలి.

- గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్, పట్టణ ప్రాంతాలకు డిగ్రీ, గిరిజన ప్రాంతాలకు పదో తరగతి అర్హత.

- చివరి దశలో ఓసీ వర్గానికి చెందిన వారు అయితే YES బటన్ పైన క్లిక్ చేయాలి. అంగవైకల్యం లేకుంటే NO పైన క్లిక్ చేయాలి. డిక్లరేషన్ తర్వాత APPLY పైన క్లిక్ చేయాలి.

- ఓసీ అయితే రేడియో బటన్ NO సెలక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఐడీని నమోదు చేసి Verify Details పైన క్లిక్ చేయాలి.

- Choose File పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.

- అంగవైకల్యం ఉంటే YES బటన్ పైన క్లిక్ చేయాలి. వైకల్యం రకం, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత Choose File క్లిక్ చేసి, అప్ లోడ్ చేయాలి.

- అన్ని వివరాలు ఇచ్చాక, వాటిని సరి చూసుకొని, APPLY పైన క్లిక్ చేయాలి. మీకు ఐడీ నెంబర్ వస్తుంది.

English summary

నేటి నుండే గ్రామవాలంటీర్ పోస్ట్‌కు దరఖాస్తులు: స్టెప్ బై స్టెప్.. ఇలా అప్లై చేయండి... | How to applly for AP Grama Volunteer: Step by Step

The AP government on Saturday issued orders for recruitment of village volunteers to deliver welfare schemes at the doorstep of all eligible beneficiaries. Notifications issued in the districts on June 23.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X