For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ATM కార్డుతో ఎన్నో ఉపయోగాలు: ఏ సేవలు పొందవచ్చో చూడండి

|

ఏటీఎం కార్డుతో మనం డబ్బులు విత్ డ్రా చేసుకుంటాం. నగదు డిపాజిట్ కూడా ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు. అలాగే, స్వైపింగ్ ద్వారా వివిధ చోట్ల డిజిటల్ కరెన్సీ చెల్లించవచ్చు. ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్, యుటిలిటీ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ పేమెంట్, ట్యాక్స్ పేమెంట్ వంటి వాటికి ఉపయోగపడతాయి. ఏటీఎం కార్డుతో ఇవే కాకుండా ఎన్నో లాభాలు ఉన్నాయి.

PMJJBYని ఎందుకు రెన్యూవల్ చేయించుకోవాలి?

క్యాష్ డిపాజిట్

క్యాష్ డిపాజిట్

ప్రస్తుతం ఎన్నో ఏటీఎం ఔట్‌లెట్‌లలో క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. ఏటీఎం కార్డుతో నగదును డిపాజిట్ చేయవచ్చు. అక్కడి ఇన్‌స్ట్రక్షన్స్ పాటించి, నగదు వివరాలు ఇచ్చి డిపాజిట్ చేయాలి. మిషన్ కనుక డిపాజిట్ అమౌంట్‌ను కన్‌ఫర్మ్ చేశాక, మీకు వెంటనే కన్‌ఫర్మేషన్ లెటర్ వస్తుంది. అలాగే, బ్యాలెన్స్ ఎంక్వయిరీ, అకౌంట్ స్టేట్‌మెంట్,, ఏటీఎం పిన్ చేంజ్, చెక్ డిపాజిట్, చెక్ బుక్ రిక్వెస్ట్, డొనేషన్స్ సేవలు కూడా ఏటీఎం కార్డు ద్వారా సులువు.

ఫిక్స్‌డ్ డిపాజిట్

ఫిక్స్‌డ్ డిపాజిట్

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. ఏటీఎం స్క్రీన్ పైన కనిపించే ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్‌ను ఎంచుకొని ఈ సేవలను పొందవచ్చు. ఇక్కడ ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నారు.. ఎంతమొత్తం చేస్తారు అనే వివరాలు అందించవలసి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేకపోయినా మీ అకౌంట్ నుంచి ఇతరులకు డబ్బును పంపవచ్చు.

యుటిలిటీ బిల్స్

యుటిలిటీ బిల్స్

ఏటీఎం కార్డు ద్వారా మొబైల్ నెంబర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్లు రీచార్జ్ చేయవచ్చు. డీజీహెచ్ రీచార్జ్ చేసుకోవచ్చు. ఇందుకు ఏటీఎం స్క్రీన్ పైన మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, ఇన్సురెన్స్ ప్రీమియం వంటివి చెల్లించవచ్చు. ఈ సేవల కోసం బ్యాంక్ వెబ్ సైట్లో బిల్లర్‌ను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చెల్లించడం ద్వారా కొన్ని ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. పలు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సెలెక్టెడ్ ఏటీఎం బ్యాంకు కార్డుల ద్వారా అప్లిక్షన్, ట్యూషన్ ఫీ చెల్లించేందుకు అనుమతిస్తోంది. వన్ టైమ్ ప్రొసీజర్‌తో ఏటీఎం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. మనీ ట్రాన్సుఫర్ అయ్యాక ఏటీఎం నుంచి స్లిప్ వస్తుంది.

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించవచ్చు

ఏటీఎం కార్డు ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించవచ్చు. అయితే మీ క్రెడిట్, డెబిట్ కార్డు ఒకే బ్యాంకుకు సంబంధించినది అయితే ఇది వర్తిస్తుంది. సెలక్ట్ చేసుకొని డబ్బులు చెల్లించాక, మీకు రిసిప్ట్ వస్తుంది. కౌంటర్ ట్రాన్సాక్షన్ అయితే ఫీజు తీసుకుంటారు. ఉదాహరణకు ఓ బ్యాంకు రూ.50, మరో బ్యాంకు రూ.100 తీసుకుంటుంది.

రైల్వే టిక్కెట్ బుకింగ్ సౌకర్యం

రైల్వే టిక్కెట్ బుకింగ్ సౌకర్యం

కొన్ని బ్యాంకులు ఏటీఎంలలో రైల్వే టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఎస్బీఐ, పీఎన్‌బీ వంటి బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలు కొన్ని ప్రాంతాలు, రైల్వే పరిసరాల్లో అందుబాటులో ఉంటాయి.

ట్యాక్స్ పేమెంట్

ట్యాక్స్ పేమెంట్

ఏటీఎం ట్యాక్స్ పేమెంట్ కోసం మీ బ్యాంక్ వద్ద మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓసారి రిజిస్టర్ అయ్యాక ఏటీఎంకు వెళ్లి చెల్లించవచ్చు. మనీ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఆ తర్వాత ఏటీఎం నుంచి మీకు రిసిప్ట్ (SIN) వస్తుంది. ఈ రిసిప్ట్‌ను మీరు 24 గంటల తర్వాత బ్యాంక్ వెబ్‌సైట్‌లో సబ్‌మిట్ చేసి చలాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో మీరు రిసిప్ట్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది.

ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్

ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పలు బ్యాంకులు ఏటీఎంల ద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ రుణాలను అందిస్తున్నాయి. ఏటీఎం కార్డ్ హోల్డర్ ట్రాన్సాక్షన్ వివరాలు, రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ ఆదారంగా పర్సనల్ లోన్స్ ఇస్తాయి. సింపుల్ స్టెప్స్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటీఎం స్క్రీన్ పైన ఉన్న పర్సనల్ లోన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అమౌంట్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటరెస్ట్ రేట్, చార్జ్, టెన్యూర్ యాక్సెప్ట్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిన్స్ కన్‌ఫర్మ్ తర్వాత మీ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది.

English summary

Advantages and Benefits of using Bank ATM Cards

Nowadays, many ATM outlets have a cash deposit machine. You can deposit small amounts at these kiosks.
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more