For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్త, ఈ సూచనలు పాటించండి: ఫ్రాడ్ చేసేవాళ్లు ఇలా చేస్తారు

|

బ్యాంకింగ్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే బ్యాంక్ ఫ్రాడ్‌లు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మొబైల్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. ఇటీవల యూపీఐ మోసాలు ఎక్కువగా అయ్యాయి. ఎనీ డెస్క్ యాప్ మోసం ఇందులో భాగమే. సిమ్ కార్డులు, స్కిమ్మర్ల మోసాలూ జరుగుతున్నాయి. బ్యాంక్ ఫ్రాడ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఐసీఐసీఐ తమ కస్టమర్లకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు చెప్పింది. ఈ సూచనలు అందరూ పాటించవచ్చు.

'ఎనీ డెస్క్' యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 9 అంకెల నెంబర్ (యాప్ కోడ్) జనరేట్ అవుతుంది. బ్యాంక్ ఫ్రాడ్‌కు పాల్పడేవాళ్లు ఈ 9 అంకెల నెంబర్ షేర్ చేయమని చెబుతారు. ఇలా మీరు షేర్ చేస్తే వారు ఫ్రాడ్ చేయగలుగుతారు. కాబట్టి ఏ నెంబర్లు ఎవరితోను షేర్ చేసుకోవద్దు. మీ అకౌంట్లు ఫ్రాడ్‌కు గురికావొద్దనుకుంటే ఈ సూచనలు పాటించండి.

ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ లో వడ్డీ రేట్లు అధికం.

జాగ్రత్తలు 1

జాగ్రత్తలు 1

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మీరు ఏదైనా యూపీఐ యాప్ లేదా ఇతర పేమెంట్స్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో అన్ని వెరిఫై చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆయా బ్యాంకులకు చెందిన నమ్మకమైన, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులకు చెందిన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గుర్తు తెలియని వారి నుంచి వచ్చే అప్లికేషన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఏదైనా అప్లికేషన్ లేదా యూపీఐ యాప్ లేదా పేమెంట్ వాలెట్ డౌన్‌లోడ్ చేసేముందు ఎప్పుడు కూడా రివ్యూలు చదవడం మంచిది. మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో మిమ్మల్ని ఏమైనా అనుమతులు కోరితే జాగ్రత్తగా ఉండాలి. మీ ఖాతాలో ఎలాంటి అనాథరైజ్డ్ చర్యలు లేకుండా ఉండేందుకు మీ ఈ-మెయిల్ ఐడీ రిజిస్టర్ చేసుకోండి. ఈ మెయిల్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా ఎప్పటికి అప్పుడు అలర్ట్ ద్వారా మీ అకౌంట్‌ను చెక్ చేసుకోండి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి.

జాగ్రత్తలు 2

జాగ్రత్తలు 2

మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకుంటే సిమ్ కార్డును బ్లాక్ చేయించండి. ఫోన్లో మీరు లాగిన్ అయిన అకౌంట్ల నుంచి వెబ్‌లో లాగ్ ఔట్ అవండి. ఎస్సెమ్మెస్‌ల ద్వారా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లపై అలర్ట్ సందేశం వచ్చేలా చూసుకోండి. మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగినట్లు తెలిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. మీకు తెలియని వ్యక్తులకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయకండి. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఎమౌంట్ వేయండి. మీ యూపీఐ వాలెట్స్ పిన్, పాస్‌వర్డ్, ఓటీపీని ఎవరితోను షేర్ చేయకండి. అలాగే ఎం-పిన్‌ను కూడా షేర్ చేయకండి. ఒకవేళ అతను బ్యాంక్ ఎంప్లాయి అయినా షేర్ చేయకండి.

జాగ్రత్తలు 3

జాగ్రత్తలు 3

డిజిటల్ పేమెంట్స్ కోసం ఎస్సెమ్మెస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే గుర్తు తెలియని లింక్స్ పైన క్లిక్ చేయకండి. ఎప్పుడూ విశ్వసనీయ, సురక్షిత వెబ్ సైట్ ఉపయోగించండి. పిన్, వన్ టైమ్ పాస్ వర్డ్, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్, గ్రిడ్ వ్యాల్యూ, టైప్ ఆఫ్ కార్డ్ (వీసా, మాస్టర్, రూపే తదితర) వంటి అంశాలను ఎవరితోను షేర్ చేయకండి. బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పినప్పటికీ అతనికి షేర్ చేయకండి. మీ పాస్‌వర్డ్ తరుచూ మార్చడం మంచిది. మీ పాస్‌వర్డ్‌లో యూనిక్ క్యారెక్టర్ ఉంటే మంచిది. ఎప్పుడు కూడా మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ (ఎంఎంఐడీ) , మొబైల్ నెంబర్‌ను వ్యాలిడేట్ చేసుకోండి.

English summary

Bank fraud on UPI: How fraudsters use bank details; ICICI Bank's 15 tips to avoid bank frauds

As the means of transactions and banking operations have increased, so are the possibilities of bank frauds. Transferring money from one account to another, without topping up the funds in the mobile wallet, has become possible by the advent of Unified Payment Services (UPI).
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more